కడప ఎడ్యుకేషన్: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అధికారంలోకి వచ్చి 14 నెలలు అయిందని అప్పటి నుంచి నేటి వరకూ ప్రజలకు చేసిన అభివృద్ధి ఏమిటో చూపాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను ప్రశ్నిం చారు. కడప జిల్లా పరిషత్తులోని సభాభవనంలో శని వారం సీపీఐ ఆధ్వర్యంలో రాయలసీమ సమగ్రాభివృద్ధిపై రాయలసీమ జిల్లాలకు సంబంధిం చిన ప్రతినిధులతో సదస్సు జరిగింది. సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ఓబులేసు అధ్యక్షతన జరిగిన ఈ సదస్సు లో రామకృష్ణ మాట్లాడుతూ ముఖ్యమం త్రి చంద్రబాబు హామీలు తప్ప ప్రజలకు చేసిం దేమీ లేదన్నారు. రాయలసీమ వరుస కరువులతో అల్లాడుతుంటే ప్రభుత్వం ఏం చేస్తోందన్నారు.
రాష్ట్ర విభజన సందర్భంగా రాయలసీమ 4 జిల్లాలకు, ఉత్తరాంధ్రలో 3 జిల్లాలకు ప్రత్యేక ప్రాకేజీతోపాటు ప్రత్యేక హోదాను ఇస్తామన్న ప్రభుత్వం ఆ విషయాన్ని పట్టించుకోలే దన్నారు. సీఎం చంద్రబాబు అధికారంలోకి రాగానే వైఎస్సార్ జిల్లాలో ఉక్కు ఫ్యాక్టరీ ఏర్పాటు చేస్తామని, పోలవరంను జాతీయ ప్రాజెక్టుగా చేస్తామని హామీ ఇచ్చారని, ఇంతవరకూ చేసిందేమీలేదన్నా రు. పట్టిసీమ ప్రాజెక్టు పూర్తికి 13 వందల కోట్లు అవసరం కాగా ఇప్పటి వరకు రూ. 620 కోట్లు ఖర్చుచేశారన్నారు.
కానీ 4 కిలోమీటర్ల పైపు లై న్ కూడా పూర్తి చేయలేదన్నారు. పట్టిసీమ వల్ల కృష్ణా డెల్టాకు తప్ప రాయలసీమకు నీళ్లు రావన్నారు. సీపీఐ రాష్ట్ర సహా య కార్యదర్శి సీవీ సత్యనారాయణ, శాసనమండలి సభ్యుడు జీజే చంద్రశేఖర్‌రావులు మాట్లాడుతూ గోదావరి పుష్కరాల కోసం ఖర్చు చేసిన నిధులతో రాయలసీమ ప్రజలను ఆదుకొని ఉండొచ్చన్నారు. ఇటీవల కుప్పంలో నిర్వహించిన సభలో హంద్రీనీవాకు 2 టీఎం సీల నీటిని ఇస్తామని హామీ ఇచ్చారన్నా రు. హంద్రీనీవా ప్రాజె క్టు పూర్తి కాకుం డానే నీరు ఎలా ఇస్తారన్నారు. 150 ఏళ్ల చరిత్ర ఉన్న కేసీ కెనాల్‌కు చుక్కనీరు ఇవ్వలేని చంద్రబాబు కుప్పంకు ఎలా నీరు ఇస్తారన్నారు. టీడీపీ అధికారంలోకి వచ్చి 14 ఏళ్లు అవుతోందని అప్పటి నుంచి ప్రధానమంత్రిని చంద్రబాబు 8 సార్లు కలిశారని కానీ రాష్ట్రానికి ప్రయోజనమేమీ లేదన్నారు.
నీటి ప్రాజెక్టుల విషయంలో సీమకు అన్యాయం
రాయలసీమకు నీటి కేటాయింపుల్లో పాల కులు తీవ్ర అన్యాయానికి పాల్పడ్డారని రాయలసీమ కార్మిక కర్షక సమితి అధ్యక్షుడు సీహెచ్ చంద్రశే ఖర్‌రెడ్డి, సాగునీటి సాధన సమితి క న్వీనర్ బొజ్జా దశర థరామిరెడ్డి, రిటైర్డ్ చీఫ్ ఇంజనీర్ శ్రీరామ్‌రెడ్డిలు విమర్శించారు. రాయలసీమకు పట్టిసీమ ద్వారా నీళ్లు ఇస్తామని 16 వందల కోట్లు ఖర్చు చేశారన్నారు. దీని ద్వారా రాయలసీమకు ఒరి గేది ఏమీ లేదన్నారు. రాజశేఖర్‌రెడ్డి ము ఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ప్రాజెక్టులు అంతోఇంతో అభివృద్ధి చెందాయన్నారు. 1962లో గౌహతి కమిషన్ గోదావ రి బేసిన్ నుంచి క్రిష్ణా బేసిన్‌కు 160 టీఎంసీలు నీటిని కేటాయిస్తే దాని గురించి పట్టించుకునే వారే లేరన్నా రు, శ్రీశైలం ప్రాజెక్టును 1963లో పవర్‌ప్రాజెక్టుగా ప్రకటిస్తే దానిపై ఏ ఒక్కరూ మా ట్లాడలేదన్నారు. శ్రీశైలంలో 854 టీఎం సీల మేర నీటి మట్టం నిల్వ ఉండాలని మాట్లాడే పరిస్థితి ఈ పాలకులను అస లు లేదన్నారు. పట్టిసీమకు కేటాయిం చిన నిధులను పెండింగ్ ప్రాజెక్టులకు ఖర్చు చేస్తే కొంతమేరైనా పనులు జరుగుతాయన్నారు. ఏపీ రైతుసంఘం రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రయ్య, అనంతపు రం, చిత్తూరు. కర్నూలు, వైఎస్సార్ జి ల్లాల సీపీఐ కార్యదర్శులు జగదీష్, రా మానాయుడు, రామాంజనేయులు, ఈశ్వరయ్య తదితరులు పాల్గొన్నారు.
ప్రజలకు మీరు చేసిందేమిటి..?
Published Sun, Aug 23 2015 3:46 AM | Last Updated on Mon, Aug 13 2018 7:24 PM