ప్రత్యేక హోదాపై బీజేపీ, టీడీపీ డ్రామా | Special status of the BJP, TDP Drama | Sakshi
Sakshi News home page

ప్రత్యేక హోదాపై బీజేపీ, టీడీపీ డ్రామా

Published Sat, Aug 8 2015 3:09 AM | Last Updated on Sat, Mar 23 2019 9:10 PM

ప్రత్యేక హోదాపై బీజేపీ, టీడీపీ డ్రామా - Sakshi

ప్రత్యేక హోదాపై బీజేపీ, టీడీపీ డ్రామా

- లక్ష్యం సాధించే వరకు విశ్రమించం
- అందరం కలిసికట్టుగా పోరాటం చేద్దాం
- సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ
కడప అగ్రికల్చర్ :
ఏపీకి ప్రత్యేక హోదా ఇచ్చే, తెచ్చే విషయంలో అటు బీజేపీ, ఇటు టీడీపీ డ్రామా లాడుతున్నాయని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ దుయ్యబట్టారు. బస్సుయాత్రలో భాగంగా వైఎస్సార్ జిల్లా కేంద్రమైన కడపలో శుక్రవారం రాత్రి నిర్వహించిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. ఏపీకి ప్రత్యేక హోదా విషయమై నాటి పార్లమెంటు సమావేశాల్లో హామీ ఇచ్చారని, ప్రత్యేకంగా నిధులు కూడా ఇస్తామని చెప్పారన్నారు. అయితే అధికారంలోకి వచ్చిన బీజేపీ ప్రత్యేక హోదా విషయంలో కేంద్రమంత్రులు, పార్టీ నేతలు పలు రకాలుగా మాట్లాడుతుండడం సిగ్గు చేటన్నారు. కడప ఎమ్మెల్యే ఎస్‌బీ అంజద్‌భాష మాట్లాడుతూ ప్రత్యేక హోదా కోసం అందరం కలిసి పోరాడాల్సిన సమయం ఆసన్నమైందన్నారు.

అంతకు మనుపు బళ్లారి-చెన్నై జాతీయ రహదారి నుంచి ర్యాలీగా నగరంలోకి బస్సుయాత్ర వచ్చింది. ఈ సభలో సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ఓబులేశు, ఏఐవైఎఫ్ రాష్ట్ర రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నవనీతం సాంబశివరావు, ఏఐఎస్‌ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు కరీముల్లా, రాష్ట్ర మహిళా సమాఖ్య అధ్యక్ష, ఉపాధ్యక్షులు జయలక్ష్మీ, పద్మావతి, సీపీఐ జిల్లా కార్యదర్శి ఈశ్వరయ్య, రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు టి రామసుబ్బారెడ్డి, కార్యదర్శి చంద్ర, సీనియర్ నాయకులు పులి కృష్ణమూర్తి, పాలెం చెన్నకేశవరెడ్డి, సుబ్బారెడ్డి, మహిళా నాయకురాలు విజయలక్ష్మీ తదితరులు పాల్గొన్నారు.
 
రాజంపేట రూరల్: ప్రత్యేక హోదాపై రాష్ట్ర ప్రజల్లో చైతన్యం తెచ్చేందుకే సీపీఐ వారు బస్సు యాత్ర చేపట్టారని వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు ఆకేపాటి అమరనాథరెడ్డి అన్నారు. స్థానిక వైఎస్సార్ సర్కిల్(పాతబస్టాండు)లో శుక్రవారం బస్సు యాత్ర చేపట్టిన సీపీఐ నాయకులకు ఆకేపాటి వైఎస్సార్‌సీపీ పట్టణ కన్వినర్ పోలా శ్రీనివాసులురెడ్డితో కలిసి సంఘీభావం తెలిపారు. కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ నాయకులు పాపినేని విశ్వనాథరెడ్డి, నాగినేని నాగేశ్వరనాయుడు, డి.భాస్కర్‌రాజు, పసుపులేటి సుధాకర్, గోవిందు బాలకృష్ణ, జీవీ సుబ్బరాజు, సీ.జ్యోతియాదవ్ తదితరులు పాల్గొన్నారు.
 
నందలూరు: రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసం సీపీఐ ఆధ్వర్యంలో శ్రీకాకుళం నుంచి హిందూపురం వరకు చేపడుతున్న బస్సుయాత్ర నందలూరు మీదుగా వెళ్లిన సందర్భంగా స్థానిక సీపీఐ నాయకులు స్వాగతం పలికారు. కార్యక్రమంలో సీపీఐ నియోజకవర్గ నాయకులు మహేష్, మండల నాయకుడు శివరామకృష్ణ దేవర పాల్గొన్నారు.
 
రైల్వేకోడూరు అర్బన్:రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసం ఎంత వరకైనా పోరాడుతామని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ అన్నారు. బస్సుయాత్ర మార్గమధ్యంలోని రైల్వేకోడూరు పట్టణంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. కార్యక్రమంలో ఏరియా కార్యదర్శి శంకరయ్య, రాధాకృష్ణ, సీనియర్ నాయకుడు కృష్ణమూర్తి, పండుగోల మణి, సుధాకర్, చైతన్య, చెన్నయ్య, విజయలక్ష్మీ, పద్మావతి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement