- సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు గుండా మల్లేశ్
- బెల్లంపల్లిలో బైలుభరో
బెల్లంపల్లి : ప్రజల కోసం ప్రాణత్యాగాలకు సిద్ధపడతామని సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు, మాజీ ఎమ్మెల్యే గుండా మల్లేశ్ అన్నారు. గురువారం దేశ వ్యాప్త పిలుపులో భాగంగా బెల్లంపల్లి ఏఎంసీ మైదానం ఎదుట సీపీఐ ఆధ్వర్యంలో సత్యాగ్రహం(జైలుభరో) నిర్వహించారు. రైతులు, మహిళలు, యువకులు, విద్యార్థులు సామూహికంగా సత్యాగ్రహంలో పాల్గొన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకం గా, భూ సేకరణ చట్ట సవరణ ఆర్డినెన్స్‌ను రద్దు చేయాలని నినదించారు. అనంతరం ప్రదర్శనగా వెళ్లి తహశీల్దార్ కార్యాలయం ఎదుట ఆందోళన నిర్వహించారు. ప్రధా న ద్వారం వద్ద నుంచి లోనికి వెళ్లేందుకు యత్నించగా పోలీసులు అడ్డుకున్నారు.
ఈ సందర్భంగా మల్లేశ్ మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేం ద్రమోదీ కార్పొరేట్ శక్తులకు అనుకూలంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. భూ సేకరణ చట్టానికి సవరణ తీసుకురావడం వల్ల రైతులకు రక్షణ లేని పరిస్థితు లు ఏర్పడతాయని, ఆ ఆర్డినెన్స్‌ను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టు ప్రతిపాదిత తుమ్మిడిహెట్టి ప్రాంతంలోనే నిర్మించి జిల్లాలోని 1.66 లక్షల ఎకరాలకు సాగు, తాగునీరు అందించాలని అన్నారు. పోడు వ్యవసాయ చేసుకుంటున్న దళిత, గిరిజనులకు భూమి పట్టాలు ఇవ్వాలన్నారు. కేకే-2 మెగా ఓపెన్‌కాస్ట్, శ్రావణ్‌పల్లి ఓపెన్‌కాస్ట్ ప్రతిపాదనలు ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలని పేర్కొన్నారు. అనంతరం తహశీల్దార్ కె.శ్యామలాదేవికి వినతిపత్రం అందజేశారు.
ఈ కార్యక్రమంలో సీపీఐ అసెంబ్లీ నియోజకవర్గ కార్యదర్శి డి.సత్యనారాయణ, పట్టణ కార్యదర్శి సిహెచ్.నర్సయ్య, మండల కార్యదర్శి డి.లక్ష్మీనారాయణ, ఏఐటీయూసీ బ్రాంచి కార్యదర్శి ఎం.వెంకటస్వామి, బీకేఎంయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పోశం, కాసిపేట మండల సీపీఐ కార్యదర్శి కె.లక్ష్మణ్, సీపీఐ జిల్లా నాయకులు దాగం మల్లేశ్, ఎస్.తిరుపతి, గురిజాల సర్పంచ్ డి.తిరుపతి, నాయకులు రత్నం ఐల య్య, జి.సరోజ, పూర్ణిమ, తాళ్లపల్లి మల్లయ్య, పి.శేషగిరి రావు, ఆర్.ప్రశాంత్, జి.మాణిక్యం, డి.శ్రీధర్ పాల్గొన్నారు.
జైల్ భరో ఉద్రిక్తం
ఆదిలాబాద్ అగ్రికల్చర్ : కేంద్ర ప్రభుత్వం భూసేకరణ చట్ట సవరణను నిరసిస్తూ సీపీఐ జాతీయ కమిటీ పిలుపు మేరకు జిల్లాలో నిర్వహించిన జైల్‌భరో ఉద్రిక్తతకు దారి తీసింది. గురువారం కలెక్టర్ కార్యాలయం ఎదుట సీపీఐ నాయకులు ఆందోళన చేపట్టగా పోలీసులు అరెస్టు చేశారు. ఈ సందర్భంగా సీపీఐ జిల్లా కార్యదర్శి కలవేణి శంకర్ మాట్లాడుతూ కేంద్రం ప్రభుత్వం పెట్టుబడిదారులు, కార్పొరేట్ శక్తులకు ప్రయోజనం కల్పించడం కోసమే చట్టాన్ని తీసుకొస్తోందని విమర్శించారు. తీవ్ర కరువు పరిస్థితుల్లో అన్నదాతలు ఆత్మహత్యకు పాల్పడుతున్నా పట్టించుకోవడం లేదన్నారు. సీపీఐ జిల్లా సహయ కార్యదర్శి ముడుపు ప్రభాకర్‌రెడ్డి, పట్ణణ కార్యదర్శి ఎస్.అరుణ్‌కుమార్, మహిళా నాయకురాలు ముడు పు నళినిరెడ్డి, సరోజ తదితరులు పాల్గొన్నారు.