‘కరువు’పై గవర్నర్ నివేదిక సరికాదు: చాడ
సాక్షి, హైదరాబాద్: రాష్ర్టంలో తీవ్ర కరు వు పరిస్థితులుంటే ముమ్మరంగా కరువు సహాయక చర్యలను చేపడుతున్నట్లు కేం ద్రానికి గవర్నర్ నివేదిక ఇవ్వడం సరికాదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి అన్నారు. ప్రజలకు కరువు సహాయం అందడం లేదని, ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్లు సమ్మె చేస్తుంటే నివారించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవడం లేదన్నారు.
సోమవారం మఖ్దూం భవన్‌లో మాట్లాడుతూ... రాష్ర్టం నాలుగు వందల స్కూళ్లు మూసివేయాలని చూడడం సరికాదన్నారు. పాలేరు ఉప ఎన్నికలపై టీఆర్‌ఎస్ రకరకాల వాగ్దానాలతో గెలిచేందుకు సర్వశక్తులు ఒడ్డిందనీ.. అయితే సానుభూతి పనిచేయడంవల్ల కాంగ్రెస్ గెలిచే అవకాశాలున్నాయన్నారు.