కవాడిగూడ,న్యూస్‌లైన్: సీపీఐ నగరకార్యదర్శి వీఎస్ బోస్‌పై ఇద్దరు వ్యక్తులు గుండాగిరి చేశారు. అందరూ చూస్తుండగానే ఆయన కాలర్ పట్టుకొని దాడిచేశారు. ఈఘటన మంగళవారం ఉదయం ముషీరాబాద్ తహసీల్దార్ కార్యాలయం వద్ద జరిగింది.
వివరాలిలా ఉన్నాయి..డీబీఆర్ మిల్లు స్థలంలో జరుగుతున్న నిర్మాణాలను వెంటనే అడ్డుకోవాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ, ఎమ్మెల్సీ పీజే చంద్రశేఖర్, రాష్ట్ర నాయకుడు డాక్టర్ సుధాకర్, ఐఎఫ్‌టీయూ జాతీయ ప్రధానకార్యదర్శి ప్రదీప్, అరుణ, ఝాన్సీల ఆధ్వర్యంలో డీబీఆర్ మిల్లు కార్మికుల పక్షాన ముషీరాబాద్ తహసీల్దార్ వసంతకుమారికి వినతిపత్రం అందించారు.
అనంతరం కార్మికులంతా మిల్లు ప్రాంతానికి వెళ్లాలని నిర్ణయించారు. ఆ క్రమంలో డీబీఆర్ మిల్లు ప్రాంతంలోని 6 ఎకరాల స్థలాన్ని తానే కొనుగోలు చేశానని చెప్పుకుంటున్న రాజ్‌కుమార్ మాల్‌పానీకి చెందిన ఇద్దరు వ్యక్తులు కార్మికుల ఫొటోలు తీస్తుండగా వీఎస్ బోస్ ఎందుకు ఫొటోలు తీస్తున్నావని ప్రశ్నించారు. దీంతో బోస్‌పై సదరు వ్యక్తులు రాములు, అబ్దుల్ రహీమ్‌లుపై దాడిచేసి కొట్టారు. ఎందుకు కొడుతున్నావు..అని ఎదురుతిరిగినా పట్టించుకోకుండా పిడిగుద్దులు కురిపించారు.
అక్కడే ఉన్న కార్మికులు దాడి చేస్తున్న ఇద్దరు వ్యక్తులపై తిరగబడి తరిమికొట్టారు. ఇదంతా పోలీసుల సమక్షంలో జరుగుతున్నప్పటికీ పట్టించుకోకుండా ఆలస్యంగా ఆ ఇద్దరు వ్యక్తులను రక్షక్ వాహనంలోకి ఎక్కించి పోలీసుస్టేషన్‌కు తరలించారు. బోస్‌పై దాడి జరిగిన సమయంలో పార్టీ రాష్ట్ర కార్యదర్శి నారాయణ,ఎమ్మెల్సీ పీజే చంద్రశేఖర్ అక్కడే ఉండడం గమనార్హం.
మిల్లు స్థలాన్ని ప్రభుత్వమే రక్షించాలి : నారాయణ
డీబీఆర్ మిల్లు స్థలానికి ప్రభుత్వమే రక్షణ కల్పించాలని,ఆ స్థలానికి హైకోర్టు నుంచి స్టేటస్‌కో ఉత్తర్వులు ఉన్నప్పటికీ అక్రమ నిర్మాణాలు చేసేందుకు యత్నించిన రాజ్‌కుమార్ మాల్‌పానీపై భూకబ్జా కేసును నమోదు చేయాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ డిమాండ్ చేశారు. డీబీఆర్ మిల్లు ఆవరణలో కార్మికులను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ సుమారు రూ.1500 కోట్లు విలువచేసే స్క్రాప్‌ను పోలీసులు, అధికారుల కనుసన్నల్లో భూకబ్జాదారులు మాయం చేశారన్నారు.
హైకోర్టు స్టేటస్‌కో ఉత్తర్వులు ఉండగా మిల్లు స్థలంలోకి ఎలా ప్రవేశిస్తారని ప్రశ్నించారు. అలాంటి వారిపై భూకబ్జా కేసు నమోదు చేయాలని, రౌడీ,గుండాయాక్టు ప్రకారం కఠినచర్యలు తీసుకోవాలన్నారు. డీబీఆర్ మిల్లు స్థలాన్ని కాపాడుకునేందుకు అవసరమైతే ప్రాణత్యాగాలకు సిద్ధమని ఐఎఫ్‌టీయూ జాతీయ ప్రధానకార్యదర్శి ప్రదీప్ స్పష్టం చేశారు.
దాడి కేసులో ఇద్దరు అరెస్టు
బన్సీలాల్‌పేట: సీపీఐ నగరకార్యదర్శి వీఎస్ బోస్‌పై దాడి ఘటనలో అబ్దుల్ రహీం, రాములును గాంధీనగర్ పోలీసులు అరెస్టు చేశారు. బాధితుల ఫిర్యా దు మేరకు కేసు నమోదు చేసి వారిని అరెస్టు చేసిన ట్లు సీఐ సంజీవరావు తెలిపారు. అడ్డగించి దాడి చే సిన నేపథ్యంలో 341, 323 సెక్షన్ల కింద కేసు నమో దు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.
బోస్‌పై గుండాగిరి
Published Wed, Apr 2 2014 12:26 AM | Last Updated on Thu, Apr 4 2019 2:50 PM
Advertisement