
సాక్షి, హైదరాబాద్: సీఎం కేసీఆర్ పాత పథకాలకు పాతరవేసి, కొత్త ఎన్నికల హామీలను తుంగలో తొక్కారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి ఆరోపించారు. ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలన్న కుయుక్తులతో బర్రెలు, గొర్రెలు, కంటి వెలుగు పేరుతో రోజుకో పథకాన్ని తెరపైకి తెస్తూ ప్రజలను మభ్యపెట్టేందుకు సీఎం ప్రయత్నిస్తున్నారన్నారు. మఖ్దూం భవన్‌లో బుధవారం సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి పల్లా వెంకటరెడ్డి, బాలమల్లేశ్‌లతో కలసి ఆయన విలేకరులతో మాట్లాడారు. పేదలకు డబుల్ బెడ్‌రూం ఇళ్లను నిర్మించి ఇవ్వాలన్న డిమాండ్‌తో ఆగస్టు 10న సీఎం క్యాంపు కార్యాలయం ప్రగతిభవన్ ను ముట్టడిస్తున్నట్లు తెలిపారు.