సాక్షి, న్యూఢిల్లీ: పెద్ద నోట్ల రద్దు నిర్ణయంపై కాంగ్రెస్ చేస్తున్న ఆరోపణలన్నీ నిరాధారమని కేంద్ర ప్రసారాల,సమాచార శాఖా మంత్రి ఎం.వెంకయ్య నాయుడు గురువారం వ్యాఖ్యానించారు. ఈ నిర్ణయం అవినీతి వ్యతిరేక టీకాగా పనిచేస్తోందన్నారు. ఎన్డీయే రెండున్నరేళ్ల పాలనపై గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరిస్తూ.. కాంగ్రెస్ పార్టీ అనుసరిస్తున్న తీరును తీవ్రంగా దుయ్యబట్టారు.