పెద్దనోట్ల రద్దు నిర్ణయాన్ని ఉపసంహరించాలి
మాజీ ఎంపీ వీహెచ్ డిమాండ్
గజ్వేల్: నోట్ల రద్దు నిర్ణయంతో సామాన్యులే ఇబ్బంది పడుతున్నారని.. ఈ నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని మాజీ ఎంపీ వి.హన్మంతరావు డిమాండ్ చేశారు. శుక్రవారం సిద్ధిపేట జిల్లా తొగుట మండలం వేములఘాట్ గ్రామంలో మల్లన్నసాగర్ ప్రాజెక్టుకు వ్యతి రేకంగా సాగుతున్న దీక్షా శిబిరానికి వెళ్తూ గజ్వేల్ నగర పంచాయతీ పరిధిలోని ప్రజ్ఞాపూర్‌లో ఆయన విలేకరులతో మాట్లాడారు. నోట్ల రద్దు వల్ల బడాబాబులు ఎవరూ సమస్యలు ఎదుర్కోవడం లేదన్నారు.