
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: అల్పాదాయ, మధ్య తరగతి వర్గాల సొంతింటి కలను సాకారం చేసేందుకు ఉన్నతి హోమ్ లోన్ స్కీమ్ ద్వారా ఆకర్షణీయమైన వడ్డీ రేట్లకు గృహ రుణాలు అందిస్తున్నట్లు పీఎన్‌బీ హౌసింగ్ ఫైనాన్స్ ఎండీ హర్‌దయాళ్ ప్రసాద్ తెలిపారు. దీని కింద రూ.35 లక్షల దాకా లేదా ప్రాపర్టీ విలువలో 90 శాతం దాకా (ఉద్యోగులకు), స్వయం ఉపాధి పొందుతున్న వారికి 80 శాతం దాకా రుణం అందిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. టియర్-1 నగరాల్లో కనిష్టంగా రూ.8 లక్షలు, టియర్-2 నగరాల్లో రూ.6 లక్షల మేర రుణం పొందవచ్చన్నారు. ఇక నగర పరిధిలో 225 చ.అ. లేదా 40 చ.గ.ల్లో ఇంటి నిర్మాణానికి కూడా ఉన్నతి స్కీమ్ ద్వారా లోన్ పొందవచ్చని ప్రసాద్ వివరించారు. ఇంటి వద్దే బీమా పాలసీలు, సర్వీసులు అందించేందుకు పలు బీమా దిగ్గజాలతో కూడా భాగస్వామ్యం కుదుర్చుకున్నట్లు ఆయన చెప్పారు.
చదవండి:
Comments
Please login to add a commentAdd a comment