పీఎన్‌బీతో ఎన్‌ఎఫ్‌డీబీ ఒప్పందం | NFDB signs pact with PNB to extend financial assistance | Sakshi
Sakshi News home page

పీఎన్‌బీతో ఎన్‌ఎఫ్‌డీబీ ఒప్పందం

Published Fri, Aug 6 2021 2:26 AM | Last Updated on Fri, Aug 6 2021 2:26 AM

NFDB signs pact with PNB to extend financial assistance - Sakshi

హైదరాబాద్‌: జాతీయ మత్స్య సంపద అభివృద్ధి మండలి(ఎన్‌ఎఫ్‌డీబీ).. పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకు (పీఎన్‌బీ)తో అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఒప్పందం కింద మత్స్య పరిశ్రమలకు పీఎన్‌బీ ద్వారా రుణ సాయం లభించనుంది. మత్స్య రంగంలో సామర్థ్యం ఉండీ, అంతగా వెలుగుచూడని పరిశ్రమలకు ఎఫ్‌ఐడీఎఫ్, ప్రధాన మంత్రి మత్స్యసంపద యోజన కింద రుణ వితరణకు గాను పీఎన్‌బీతో ఒప్పందం వీలు కల్పిస్తుందని ఎన్‌ఎఫ్‌డీబీ సీఈవో సువర్ణ చంద్రప్పగిరి తెలిపారు. హైదరాబాద్‌లో జరిగిన ఈ ఒప్పంద కార్యక్రమంలో సువర్ణ చంద్రప్పగిరి, పీఎన్‌బీ ఎండీ, సీఈవో మల్లికార్జునరావు, ఇతర అధికారులు పాల్గొన్నారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement