
ముంబై: బ్యాంక్ ఆఫ్ ఇండియా (బీఓఐ), పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్‌బీ)లకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) సోమవారం మొత్తం రూ.6 కోట్ల జరిమానా విధించింది. ఇందులో బీఓఐకి విధించిన జరిమానా రూ.4 కోట్లుకాగా, పీఎన్‌బీ విషయంలో ఈ మొత్తం రూ.2 కోట్లు. బ్యాంకింగ్ మోసాలకు సంబంధించిన నివేదికను ఆర్‌బీఐకి ఆలస్యంగా సమర్పించడం, అన్‌క్లైమ్డ్ బ్యాలెన్స్‌ను డీఈఏ (డిపాజిటర్ ఎడ్యుకేషన్ అండ్ అవేర్‌నెస్) ఫండ్‌కు బదలాయించడంలో తాత్సారం వంటి అంశాలకు సంబంధించి నిబంధనలను పాటించకపోవడం దీనికి కారణమని రెండు వేర్వేరు ప్రకటనల్లో ఆర్‌బీఐ పేర్కొంది.
చదవండి: ఫ్రాంక్లిన్ టెంపుల్టన్‌కు సెబీ షాక్.. భారీ జరిమానా