తమిళనాడు తిరుచ్చి జిల్లాలోని సమయపురం పంజాబ్ నేషనల్ బ్యాంకులో భారీ చోరీ జరిగింది. బ్యాంకులోని 10 కోట్ల రూపాయల నగదు, 5 కేజీల బంగారాన్ని దుండగులు అపహరించారు. జాతీయ రహదారి పక్కనే ఉండే సమయపురంలో ఇంతటి భారీ దోపిడీ జరగడం జిల్లాలో కలకలం రేపుతుంది. వివరాల్లోకి వెళ్తే.. 26, 27 తేదీలు బ్యాంకుకు సెలవు దినాలు కావడంతో సోమవారం ఉదయం సిబ్బంది బ్యాంకు తెరిచారు. అనంతరం బ్యాంకు లోపలికి వెళ్లి చూడగా చోరీ విషయం బయటపడింది.