
న్యూఢిల్లీ: పంజాబ్ నేషనల్ బ్యాంకుకు వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీ చేసిన మోసాల మొత్తం మరో రూ.322 కోట్లు పెరిగి రూ.13,000 కోట్లకు విస్తరించింది. మొదటి రెండు ఎఫ్‌ఐఆర్‌లలో మోదీ మోసాల మొత్తం రూ.12,686 కోట్లుగా పేర్కొన్న విషయం తెలిసిందే.
మోదీకి చెందిన ఫైర్ స్టార్ ఇంటర్నేషనల్ లిమిటెడ్, ఫైర్‌స్టార్ డైమండ్ ఇంటర్నేషనల్ ప్రైవేటు లిమిటెడ్ తదితర కంపెనీలు కూడా గ్యారంటీలు, చట్టబద్ధమైన రుణాల్లో అక్రమాలకు పాల్పడి, రూ.49.4 మిలియన్ డాలర్లు (రూ.322 కోట్లు) మోసం చేసినట్టు పీఎన్‌బీ ఈ నెల 4న సీబీఐకి ఫిర్యాదు చేసింది. దీంతో మోదీ మోసాల మొత్తం రూ.13,008 కోట్లకు చేరింది.