
దేశంలో ప్రభుత్వ రంగ రెండవ బ్యాంకింగ్ దిగ్గజం– పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్‌బీ) ఎంసీఎల్‌ఆర్ (మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్) ఆధారిత రుణాల వడ్డీ రేటును 15 బేసిస్ పాయింట్లు పెంచింది. దీనితో బ్యాంక్ ఏడాది వ్యవధి రేటు 8.30 శాతానికి పెరిగింది. తక్షణం తాజా రేటు అమల్లోకి వస్తుందని బ్యాంక్ పేర్కొంది. బ్యాంక్ 15 బేసిస్ పాయింట్లు రేటు పెంపు ప్రకారం ఓవర్‌నైట్, నెల, మూడు, ఆరు నెలల రేట్లు 7.80 శాతం, 7.95 శాతం, 8.10 శాతం, 8.25 శాతానికి పెరిగాయి.
డిపాజిట్ రేట్లూ పెంపు: బ్యాంక్ రిటైల్, బల్క్ డిపాజిట్ రేట్లను కూడా వివిధ మెచ్యూరిటీ లపై 45 బేసిస్ పాయింట్ల వరకూ పెంచింది. దీని ప్రకారం... రిటైల్ డిపాజిట్ ఏడాది– మూడేళ్ల మెచ్యూరిటీ రేటు 25 బేసిస్ పాయింట్లు పెరిగి 6.75కు చేరింది. బల్క్ డిపాజిట్ రేటు ఏడాది కాలానికి 6.50 శాతం నుంచి 6.75 శాతానికి పెరిగింది.