ఏటీఎంలో దొంగ నోటు..? | fake Notes in ATM | Sakshi
Sakshi News home page

ఏటీఎంలో దొంగ నోటు..?

Published Wed, Jun 11 2014 2:20 AM | Last Updated on Sat, Sep 2 2017 8:35 AM

ఏటీఎంలో దొంగ నోటు..?

ఏటీఎంలో దొంగ నోటు..?

రాజాం: స్థానిక స్టేట్‌బ్యాంక్ ఏటీఎం నుంచి మంగళవారం వెయ్యి రూపాయల దొంగనోటు బయటపడింది. పట్టణానికి చెందిన న్యాయవాది శాసపు అప్పలనాయుడు రెండు విడతలుగా బ్యాంకు ఏటీఎం నుంచి రూ.40 వేలను విత్ డ్రా చేసి మరో బ్యాంకులో జమ చేయడానికి వెళ్లగా అందులో ఒక వెయ్యి రూపాయల దొంగనోటు బయటపడడంతో బ్యాంకు అధికారులు ఆయన దృష్టికి తీసుకువచ్చారు. ఇదే విషయాన్ని స్టేట్‌బ్యాంకు మేనేజర్ వినోద్‌కుమార్ వద్ద అప్పలనాయుడు ప్రస్తావించారు. తాము ఏటీఎంలో పెట్టిన  నోట్లున పరిశీలించి పెడతామని, దొంగనోట్లు వచ్చే ప్రసక్తే లేదని ఆయన స్పష్టం చేశారు. బ్యాంకు ఏటీఎంలో పెట్టిన నోట్ల నెంబర్లు మీ వద్ద ఉంటాయా అని న్యాయవాది ప్రశ్నించగా అటువంటివి నమోదు చేయమని, పాత, కొత్త నోట్లు లక్షల రూపాయలను స్థానికంగా ఉన్న నాలుగు ఏటీఎంలలో పెడతామని అన్నారు. దీనిపై ఫిర్యాదు ఇస్తే ఉన్నతాధికారులకు పంపించి చర్యలు తీసుకుంటామని మేనేజర్ స్పష్టం చేశారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement