ఏటీఎం నుంచి వచ్చిన నోట్లు , నోట్లను చూపుతున్న వినియోగదారులు
ఎదులాపురం(ఆదిలాబాద్): జిల్లా కేంద్రంలోని ఓ బ్యాంకు ఏటీఎం కేంద్రం నుంచి వచ్చిన రూ.500ల నోట్లు నకిలీవిగా కలకలం రేగింది. దక్కన్ గ్రామీణ బ్యాంకు సమీపంలో ఉన్న ఓ బ్యాంకు ఏటీఎంలో ఆదివారం పట్టణానికి చెందిన శంకర్‌గౌడ్, గంగాధర్ అనే వ్యక్తులు డబ్బులు డ్రా చేశారు. ఆ సమయంలో ఎర్రా సిరాతో రాసిన.. ప్రింట్ కనిపించకుండా.. ఇతర రంగుతో కూడిన నోట్లు వచ్చాయి. దీంతో వారు ఆందోళనకు గురయ్యారు. బ్యాంకుల్లో సిరాతో రాయబడిన, ఇతర రంగుల్లో ఉన్న నోట్లను తీసుకోవడం లేదని, ఏటీఎం ద్వారా ఇలాంటి నోట్లు రావడం ఏంటని వాపోయారు. సంబంధిత బ్యాంకు అధికారులు స్పందించి ఇకనైనా ఇలాంటి నోట్లు రాకుండా చూడాలని వినియోగదారులు కోరారు.
Comments
Please login to add a commentAdd a comment