డి.యర్రవరం జంక్షన్‌లో ఏటీఎంలో వచ్చిన రంగు పడి ఉన్న రూ.500 నోట్లు
సాక్షి, విశాఖపట్నం, నాతవరం: ఇండియా వన్ ఏటీఎం ద్వారా రూ.500 నోట్లుపై రంగులు పడిన చెల్లని నోట్లు రావడంతో వినియోగదారులు అందో ళన చెందుతున్నారు. మర్రిపాలెం గ్రామానికి చెందిన సత్తిబాబు అనే వ్యక్తి సోమవారం నర్సీపట్నం ఆస్పత్రికి వెళ్తూ మార్గమధ్యంలో డి.యర్రవరం జంక్షన్‌లో గల ఇండియా వన్ ఏటీఎంకు వెళ్లి తన కార్డు ద్వారా రూ. మూడు వేలు నగదు తీశాడు. అయితే వచ్చిన ఆరు రూ.500 నోట్లుపై ఎర్రటి పసుపు రంగుతో కూడిన రంగులు ఉన్నాయి. నోట్లన్నిటిపైనా రంగులు పడి ఉండడంతో అవి ఎక్కడా చెల్లలేదు. దీంతో ఏం చేయాలో తెలియక లబో దిబో మన్నాడు. ఇదే విధంగా తూర్పుగోదా వరి జిల్లా కోటనందూరుకు చెందిన మరో వ్యక్తి కూడా ఇదే ఏటీఎంలో డబ్బులు తీశా రు. అయనకు కూడా రంగులు పడిన రూ. 500 నోట్లు రావడంతో అందోళన చెందారు.
Comments
Please login to add a commentAdd a comment