ఎవరి రూల్ వారిది
ఇది ప్రొద్దుటూరు పట్టణంలోని మైదుకూరు రోడ్డులో ఉన్న భారతీయ స్టేట్‌బ్యాంక్ టౌన్ బ్రాంచి వద్ద ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ. రుణమాఫీకి సంబంధించి రైతులు పట్టాదారు పాస్‌పుస్తకంతోపాటు 1-బి ఒరిజనల్, రేషన్, ఆధార్‌కార్డు, లోన్ తీసుకున్న రశీదు జిరాక్స్‌లు ఇవ్వాలని ఇందులో పేర్కొన్నారు. ప్రత్యేకంగా దరఖాస్తును కూడా బ్యాంక్ అధికారులు ముద్రించారు. చివరితేదీ ఈనెల 3వ తేదీ అని బ్యాంక్ నోటీసు బోర్డులో పెట్టారు.
రుణమాఫీ కోసం గత నెల 25వ తేదీ చివరి రోజుగా ప్రొద్దుటూరు పట్టణంలోని కరూర్ వైశ్యా బ్యాంక్ అధికారులు ప్రకటించడంతో రైతులు గ్రామాల నుంచి తరలి వచ్చి క్యూలో నిల్చొని ఒరిజనల్ పుస్తకాలను చూపించి జిరాక్స్ పత్రాలను ఇవ్వాల్సి వచ్చింది. ఈ బ్యాంక్‌లో 1-బి పత్రాలు మాత్రం అడగలేదు.
అది ప్రొద్దుటూరు పట్టణంలోని భారతీయ స్టేట్ బ్యాంక్ అభివృద్ధి శాఖ బ్రాంచి. ఇక్కడ 1-బి ఒరిజనల్‌తోపాటు పట్టాదారుపాస్‌పుస్తకం, ఆధార్ కార్డు, రేషన్ కార్డు, బ్యాంక్ ఖాతా పుస్తకం జిరాక్స్ పత్రాలను ఇవ్వాలని ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు. ఇప్పటికిప్పుడు 1-బి తయారు చేసి ఇవ్వడం కుదరదని రెవెన్యూ అధికారులు చెప్పడంతో దానిని తొలగించారు.
ఎర్రగుంట్లలోని ఎస్‌బీఐలో ఏకంగా రైతుల నుంచి టైటీల్ డీడ్ ఒరిజనల్ పుస్తకాలను స్వాధీనం చేసుకుంటున్నారు. ఆ పుస్తకం తీసుకున్నట్లు రైతులకు రశీదులు కూడా ఇవ్వకపోవడం గమనార్హం. ఎదురు ప్రశ్నిస్తే బ్యాంక్ అధికారులు ఏమంటారోనని బ్యాంక్ అధికారులు అడిగిన వాటిని రైతులు సమర్పిస్తున్నారు.