తాడిమర్రి స్టేట్ బ్యాంక్‌లో సోదాలు | police checks in state bank | Sakshi
Sakshi News home page

తాడిమర్రి స్టేట్ బ్యాంక్‌లో సోదాలు

Aug 24 2015 2:24 PM | Updated on Aug 21 2018 6:22 PM

అనంతపురం జిల్లా తాడిమర్రి స్టేట్ బ్యాంక్‌లో డోన్ డీఎస్పీ వేణుగోపాల్ సోదాలు నిర్వహించారు.

తాడిమర్రి: అనంతపురం జిల్లా తాడిమర్రి స్టేట్ బ్యాంక్‌లో డోన్ డీఎస్పీ వేణుగోపాల్ సోదాలు నిర్వహించారు. సోమవారం ఆయనతో పాటు బ్యాంక్ మేనేజర్ శ్రీనివాసగుప్తా ఈ సోదాల్లో పాల్గొన్నారు. వివరాలు.. రెండేళ్ల క్రితం తాడిమర్రి స్టేట్ బ్యాంక్ పరిధిలో 82 బోగస్ మహిళా స్వయం సహాయక సంఘాలు రూ. 3.5 కోట్ల రూపాయలను స్వాహా చేశాయి. అయితే, ఈ విషయంపై ఐకేపీ ఏపీఎమ్ పద్మావతి అప్పట్లో పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ కేసు వ్యవహారంలో అప్పటి బ్యాంక్ మేనేజర్,  ఐకేపీ ఏపీఎమ్‌ లపై సస్పెన్షన్ వేటు పడింది. కాగా ఈ కేసు విషయమై సోమవారం తనిఖీలు చేపట్టిన డీఎస్పీ మోదుగులకుంట, శివంపల్లి, మద్దులచెరువు, తాడిమర్రి మండల కేంద్రాల్లో ఎక్కువగా బోగస్ సంఘాలు ఉన్నట్లు గుర్తించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement