పులివెందుల : పట్టణంలోని స్టేట్ బ్యాంకు మెయిన్ బ్రాంచ్‌లో సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్న భాస్కర్‌రెడ్డిపై దాడి జరిగిన సంఘటన శనివారం చోటు చేసుకుంది. బాధితుడు, పోలీసుల కథనం మేరకు.. శనివారం బ్యాంకులో విధులు నిర్వహిస్తున్న భాస్కర్‌రెడ్డిపై పట్టణానికి చెందిన రిటైర్డు సీడీపీవో విజయలక్ష్మి కుమారులు అశోక్, అమృత్‌లు భాస్కర్‌రెడ్డిని బ్యాంకులో నుంచే తీవ్రంగా కొట్టుకుంటూ బ్యాంకు వెలుపలికి తీసుకొచ్చి అక్కడ కూడా దాడి చేశారు. భాస్కర్‌రెడ్డి శుక్రవారం బ్యాంకుకు వెళ్లిన విజయలక్ష్మిని క్యూలో నిలబడాలని కోరడంతో శనివారం మళ్లీ ఆమె బ్యాంకు రాగా.. అదేవిధంగా క్యూలో నిలబడాలని చెప్పగా..కోప్రోదిక్తులైన ఆమె కుమారులు భాస్కర్‌రెడ్డిపై తీవ్రంగా దాడి చేశారు. భాస్కర్‌రెడ్డిని స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించి ప్రథమ చికిత్స నిర్వహించారు. భాస్కర్‌రెడ్డి స్థానిక అర్బన్ పోలీస్‌స్టేషన్‌లో పిర్యాదు చేయగా.. పోలీసులు సంఘటనపై విచారిస్తున్నారు. దాడి చేసిన వారిలో అశోక్ ఏఆర్ కానిస్టేబుల్‌గా నిర్వహిస్తుండటం విశేషం.
సెక్యూరిటీ గార్డుపై దాడి
Published Sat, Mar 4 2017 11:26 PM | Last Updated on Tue, Aug 21 2018 5:51 PM
Advertisement
Advertisement