పులివెందుల కోర్టుకు శివశంకర్‌రెడ్డిని తీసుకొచ్చిన సీబీఐ బృందం
కడప అర్బన్: మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో అరెస్టయి, సీబీఐ కస్టడీలో ఉన్న వైఎస్సార్‌సీపీ నాయకుడు దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డిని సోమవారం వైఎస్సార్ జిల్లా పులివెందుల కోర్టులో మేజిస్ట్రేట్ ముందు హాజరు పరిచారు. డిసెంబర్ 2వతేదీ వరకు ఏడు రోజుల పాటు శివశంకర్‌రెడ్డిని తమ కస్టడీలో విచారణ చేస్తామన్న సీబీఐ బృందం నాలుగోరోజునే తమ విచారణకు సహకరించడం లేదని పులివెందుల మేజిస్ట్రేట్ ముందు శివశంకరరెడ్డిని హాజరు పరిచారు. తరువాత మేజిస్ట్రేట్ ఆదేశాల మేరకు కడప కేంద్రకారాగారానికి రిమాండ్‌కు తరలించారు. కాగా, శివశంకర్‌రెడ్డికి బెయిల్ మంజూరు చేయాలని ఆయన తరఫు న్యాయవాది కడప కోర్టులో వేసిన పిటిషన్ రద్దు చేశారు.
ఎర్ర గంగిరెడ్డి బెయిల్ పిటిషన్‌పై తీర్పు వాయిదా
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో అరెస్టయి, ప్రస్తుతం బెయిల్‌పై ఉన్న ఎర్ర గంగిరెడ్డి బెయిల్ రద్దు పిటిషన్‌పై తీర్పు మంగళవారానికి వాయిదా పడింది. జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో ఆయన బెయిల్ రద్దయ్యే అవకాశాలున్నట్లు న్యాయవాదులు చెబుతున్నారు. బెయిల్ రద్దు తరువాత గంగిరెడ్డి స్టేట్‌మెంట్‌ను రికార్డు చేసి కీలక వ్యక్తులను అరెస్ట్ చేసేందుకు సీబీఐ కదులుతోంది.
Comments
Please login to add a commentAdd a comment