shiva shankar reddy
-
‘దావోస్‌లో బాబు.. 2014-19 మధ్య ఒప్పందాల సంగతేంటి?’
సాక్షి, తాడేపల్లి: ముఖ్యమంత్రి చంద్రబాబు(Chandrababu) దావోస్ వెళ్లారు కాబట్టి రేపటి నుంచి ఎల్లోమీడియాలో ప్రచారం పీక్ లెవల్‌కి వెళ్తుందన్నారు వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి పుత్తా శివశంకర్ రెడ్డి. 2014-19 మధ్యలో కూడా చంద్రబాబు నాలుగుసార్లు దావోస్(Davos) వెళ్లి ఏం సాధించారు?. ఎన్ని కంపెనీలు వచ్చాయి? ఎంతమందికి ఉద్యోగాలు వచ్చాయో టీడీపీ వారే చెప్పాలి అని డిమాండ్ చేశారు.వైఎస్సార్సీపీ(YSRCP) అధికార ప్రతినిధి పుత్తా శివశంకర్ తాడేపల్లిలో మీడియాతో మాట్లాడుతూ..‘పారిశ్రామిక వేత్తలు ఏపీలో వేల కోట్లు పెట్టుబడులు పెడుతున్నట్టు టీడీపీ నేతలు ప్రకటించారు. ఎంతమందికి ఉద్యోగాలు ఇచ్చారు?. ఆంధ్రాకి అలీబాబా, హైస్పీడ్ రైళ్ల కర్మాగారం, ఏపీకి ఎయిర్ బస్, కుమియుమి 20 బిలియన్ డాలర్లు పెట్టుబడి, రాష్ట్రానికి సౌదీ ఆరాంకో, మైక్రోసాఫ్ట్ సంస్థ హైబ్రిడ్ క్లౌడ్.. అంటూ ఎల్లోమీడియాలో తెగ ప్రచారం చేశారు. చివరికి హీరోహోండా కంపెనీకి శంకుస్థాపన చేస్తున్నట్టు ప్రకటించారు. ప్రకాశం జిల్లాలో జిందాల్ ఫ్యాక్టరీ పెడుతున్నట్టు ప్రకటించారు. ఇలా చెప్పుకుంటూ పోతే అనేక కంపెనీలు వచ్చేసినట్టే ఎల్లోమీడియాలో భజన చేశారు.కానీ, ఒక్కటంటే ఒక్క కంపెనీ కూడా ఏపీకి రాలేదు. దీనికితోడు నేషనల్ మీడియాలో దండోరా చేయించడానికి కోట్లాది రూపాయలు దోచిపెట్టారు. కానీ, ఏ కంపెనీని తీసుకురాలేకోయారు. వైఎస్ జగన్ తన హయాంలో ఎలాంటి ప్రచారం లేకుండా దావోస్ వెళ్లారు. అదానీ గ్రూపు గ్రీన్ ఎనర్జీ ప్లాంటుకు ఒప్పందం చేసుకున్నారు. ఆ పనులు వేగంగా జరుగుతున్నాయి.ఓర్వకల్లు దగ్గర గ్రీన్కో ప్రాజెక్టు నిర్మాణానికి ఒప్పందం చేసుకుని వేగంగా పనులు కొనసాగుతున్నాయి. దీన్ని పవన్ కూడా మెచ్చుకున్నారు. వైఎస్ జగన్ హయాంలో లక్షా 26 కోట్ల విలువైన ఒప్పందాలు చేసుకున్నారు. అవన్నీ నిర్మాణంలో ఉండగా ఉత్పత్తులు ప్రారంభించాయి. అదీ వైఎస్ జగన్ గొప్పతనం. చంద్రబాబు ప్రస్తుతం దావోస్ వెళ్లారు కాబట్టి రేపట్నించి ఎల్లోమీడియాలో ప్రచారం పీక్ లెవల్‌కు చేరుకుంటుంది. ఆ ఎలివేషన్‌కు ముందు 2014-19 నాటి ఒప్పందాల వివరాలు కూడా చెప్పాలి’ అని వ్యాఖ్యలు చేశారు. -
‘అక్రమ కట్టడం.. అధికారిక నివాసమా?.. ఇది సబబేనా బాబూ?’
సాక్షి, తాడేపల్లి: చంద్రబాబు అధికారిక నివాసం అక్రమ కట్టడమని.. నదీ పరీవాహకంలో ఎలాంటి నివాసాలు ఏర్పాటు చేయకూడదని వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి పుత్తా శివశంకర్ అన్నారు. గురువారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, మరి చట్టాలు తయారు చేసేవారే అక్రమ నివాసాల్లో ఉండటం సబబేనా? అంటూ ప్రశ్నించారు.‘‘అక్రమ నివాసాన్ని అధికారిక నివాసంగా ఎలా నిర్ణయిస్తారు?. 2014లోనే ఇది అక్రమ కట్టడం అని అధికారికంగానే తేల్చారు. రాష్ట్ర విభజన అనంతరం కొత్త ప్రభుత్వం వచ్చింది. చంద్రబాబు ప్రభుత్వంలోని ఇరిగేషన్ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ఇది అక్రమ కట్టడం అని చెప్పారు. దీన్ని కూల్చాలంటూ ప్రకటన కూడా చేశారు. మేథాపాట్కర్, రాజేంద్రసింగ్ వంటి పర్యావరణ వేత్తలు ఈ ప్రాంతాన్ని సందర్శించి అక్రమ కట్టడాలను తొలగించాలని డిమాండ్ చేశారు’’ అని శివశంకర్ గుర్తు చేశారు.‘‘నదీ పరివాహక చట్టం ప్రకారం వంద మీటర్ల లోపు ఎలాంటి కట్డడాలు చేయకూడదు. కానీ చంద్రబాబు నివాసం నదీ పరివాహకంలోనే ఉంది. లోకాయుక్త సైతం 2015లో ఈ అక్రమ కట్టడాలను తొలగించాలని ఆదేశించింది. అయినాసరే ఆ అక్రమ నివాసాన్ని కూల్చకుండా చంద్రబాబు నివాసం ఉంటున్నారు. ఇటీవల వచ్చిన వరదలతో చంద్రబాబు ఇల్లు ఖాళీ చేసి విజయవాడ కలెక్టరేట్లో తల దాచుకున్నారు. ఈ అక్రమ కట్టడాన్ని కాపాడుకోవడానికి చంద్రబాబు బుడమేరు వరదని విజయవాడ మీదకు తిప్పారు’’ అని శివశంకర్ పేర్కొన్నారు.ఇదీ చదవండి: బాబుకది షరా మామూలే!‘‘ఆ ఇంటిని ప్రభుత్వం ల్యాండ్ పూలింగ్ కింద తీసుకుందని.. ఓనరు లింగమనేని రమేష్ ప్రకటించారు. కానీ చంద్రబాబు మాత్రం అసెంబ్లీలో ఆ బిల్డింగ్‌కి అద్దె కడుతున్నానని చెప్పారు. ఇలా ఒక్కొక్కరు ఒక్కో అబద్దం చెప్పారు. చంద్రబాబు నివాసం అక్రమ కట్టడమే’’ అని పుత్తా శివశంకర్ దుయ్యబట్టారు. -
జమిలి ఎన్నికలంటే బాబుకు భయం మొదలైందా?
-
జగన్ పై ఆనం వ్యాఖ్యలు.. మరోసారి ఏకిపారేసిన శివ శంకర్ రెడ్డి
-
‘ఆనం నోరు అదుపులో పెట్టుకో... మెంటల్ సర్టిఫికెట్ తెచ్చుకున్నదెవరో గుర్తు చేసుకో’
తాడేపల్లి: ‘సినిమా సీరియస్‌గా నడుస్తున్నప్పుడు డైవర్షన్ కోసం ఒక కమెడియన్ వస్తాడు.. అచ్చం అలాగే ఇప్పుడు టీడీపీ ఆఫీసులో ఆనం వెంకటరమణారెడ్డి అనే ఒక కమెడియన్ ప్రత్యక్షమయ్యాడు. విచక్షణ లేకుండా మాట్లాడుతున్నాడు’ అని వైఎస్సార్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి పుత్తా శివశంకర్‌రెడ్డి ఆక్షేపించారు. ఆనం ఇకనైనా నోరు అదుపులో పెట్టుకోవాలని, లేకపోతే తామూ మాట్లాడగలమని ఆయన స్పష్టంగా తేల్చి చెప్పారు.తమ అధినేతను ఏకవచనంతో సంబోధిస్తున్న ఆనం వైఖరిని తీవ్రంగా తప్పు పట్టారు. అలా తామూ మాట్లాడగలమని, అయితేవైయస్సార్సీపీ తమకు సంస్కారం ఉందని చెప్పారు. ఆనాడు చంద్రబాబును ఔరంగజేబుతో పోల్చిన ఎన్టీఆర్ మాటలు ప్రస్తావించిన ఆయన, త్వరలో తన తండ్రి చంద్రబాబును కూడా నారా లోకేశ్ ఔరంగజేబు మాదిరిగా పక్కకు నెట్టి సీఎం కుర్చీ లాక్కుంటాడని బయట జోరుగా ప్రచారం జరుగుతోందని గుర్తు చేశారు. ఇకనైనా ఆనం తన నోరు అదుపులో పెట్టుకోవాలని, మళ్లీ తమ నాయకులపై పిచ్చిపిచ్చిగా మాట్లాడితే నాలుక చీరేస్తామని శివశంకర్‌రెడ్డి హెచ్చరించారు.జగన్‌పై పిచ్చికూతలు కూస్తున్న నల్ల బాలు అనబడే ఆనం వెంకటరమణారెడ్డి.. ఆ పార్టీలో ఇప్పుడు ఎమ్మెల్యేగా ఉన్న హీరో ఇంట్లో కాల్పులు జరిగితే, వైద్యుల నుంచి ఏ సర్టిఫికెట్ తీసుకుని, బెయిల్ పొందారో గుర్తు చేసుకోవాలని కోరారు. ధైర్యం ఉంటే తాను చెప్పింది వాస్తవమో, కాదో చెప్పాలని కోరారు. అలాగే చంద్రబాబు సొంత తమ్ముడు నారా రామ్మూర్తినాయుడికి మెంటల్ అని చెప్పి గొలుసులతో కట్టేసిన విషయాన్ని ఆయన బంధువు నార్నె శ్రీనివాసరావు మీడియా ముందు చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు.తమ పార్టీ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి రావాలా? వద్దా? అనేది తమ పార్టీ శాసనసభాపక్షం నిర్ణయిస్తుందని, దాన్ని ప్రశ్నించడానికి ఆనంకు ఏ హక్కు ఉందని నిలదీశారు. అసెంబ్లీకి రాకుండా జీతాలు తీసుకుంటూ, ఏసీ టికెట్లు, ఇంటర్నెట్, కరెంట్ బిల్లులు ఉచితంగా పొందుతున్నారని ఆరోపిస్తున్న ఆనం.. నవంబర్ 19, 2021 నుంచి కారణం లేకుండా రెండున్నరేళ్లు చంద్రబాబు అసెంబ్లీకి ఎందుకు రాలేదని, అలాగే టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్టీఆర్ సైతం ఆగస్టు 13, 1993న అసెంబ్లీ నుంచి బయటకు వెళ్లిన విషయం గుర్తు లేదా? అని ప్రశ్నించారు. మరి వారు ఉచితంగా జీతాలు తీసుకున్నట్లు కాదా? అని పుత్తా శివశంకర్‌రెడ్డి నిలదీశారు. -
విజయమ్మ లేఖ వెనుక ఎవరున్నారు?
-
రెడ్ బుక్ కాదు బ్లడ్ బుక్.. హోం మంత్రి అనితకు కౌంటర్
-
పవన్ కళ్యాణ్.. వెంట్రుక ముక్క కూడా పీకలేవ్
-
నారా లోకేష్, చంద్రబాబులపై YSRCP ప్రతినిధి శివశంకర్ రెడ్డి ఫైర్
-
ఎన్టీఆర్ బాడీ లాంగ్వేజ్ ఏంటి? నీ బాడీ లాంగ్వేజి ఏంటి?
-
‘లోకేష్.. నువ్వు నేర్చుకున్న చదువు ఇదేనా?’
సాక్షి, తాడేపల్లి: తనది ఎన్టీఆర్ గొంతు అని టీడీపీ నేత నారా లోకేష్ అంటున్నాడు. మాట్లాడితే ఎన్టీఆర్ వారసుడిని అంటాడు.. ఎన్టీఆర్ బాడీ లాంగ్వేజ్ ఏంటి? నీ బాడీ లాంగ్వేజ్ ఏంటి?. అసలు ఎక్కడైనా పోలిక ఉందా?. తెలుగు వారి ఆత్మగౌరవం అంటూ చేతిని సూటిగా చూపిస్తారు ఎన్టీఆర్. మరి నీ తండ్రి చంద్రబాబు రెండువేళ్లూ ఊపుతూ చూపితే అది ఊళ్ళల్లో చెప్పినట్టు లండన్(బాత్ రూమ్)కు వెళ్లొస్తా అన్నట్లుగా ఉంటుంది. నీ స్థాయి అంత కన్నా కిందికి దిగజారి చేతిని అలా ఇలా అని అసభ్యంగా ఊపుతూ దిక్కుమాలిన సంజ్ఞలు చేయడం చూస్తే జనం ఛీదరించుకుంటున్నారు.. ఏంటీ ఈ వెర్రితనం.. పిచ్చితనం లోకేశ్?. లోకేష్.. నీవు నేర్చుకున్న చదువు ఇదేనా?. నీ తండ్రి బాబు నీకు నేర్పిన సంస్కారం ఇదేనా?. జనం నవ్విపోతారన్న సిగ్గన్నా మీకు లేదా?. డెంగ్యూ అని పలకడం రాక బూతులు పలికే నీవు చదువు గురించి, సంస్కారం గురించి మాట్లాడతావా?. ఆంధ్రప్రదేశ్‌లో లోకేశ్ యువ‘గంగాళం’ అనే ప్రాజెక్టు ఒకటి నడుస్తోంది. ఈ ప్రాజెక్టును పూర్తి చేయడం కోసం, ఒకవైపు టీడీపీ, మరోవైపు ఎల్లోమీడియా జాకీలు పెట్టి మరీ పైకి లేపాలని చూస్తోంది. మీరెంత లేపినా.. యువ‘గంగాళం’ ప్రాజెక్టుపైకి లేవదు. ఎన్నటికీ పూర్తి కానేకాదు. అది అంత అసమర్థ ప్రాజెక్టు అని జనమే తేల్చేశారు. పెయిడ్ ఆర్టిస్టులతో జనాన్ని రప్పించాలని రండి బాబూ రండి.. అని ఎంతగా బతిమాలి బామాలినా పాదయాత్రలో లోకేశ్ వెంట నడవం గాక నడవం అంటూ జనం ఆ యాత్రకు రానే రావడం లేదు. జనం రావడం లేదన్న నిరాశలో ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నారు. నీ పాదయాత్రను పట్టించుకునే వారే లేరన్న నిరాశలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిపై విమర్శలు చేస్తున్నావు. సీఎం జగన్ పాదయాత్ర చూసి కాపీ కొడితే.. పులిని చూసి వాతలు పెట్టుకుంటే అవుతుంది. ‘స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో లోకేష్ నిజంగానే చదివాడా?. అతని క్లాస్‌మెట్స్ పేర్లు చెప్పమంటే ఎందుకు చెప్పటం లేదు?. చంద్రబాబు.. లోకేష్‌కు బూతులు నేర్పించి రోడ్డుపైకి వదిలారు. తండ్రీకొడుకులు ఇద్దరూ ఏ సబ్జెక్ట్‌పైనా 35 మార్కులు తెచ్చుకోలేరు. ఆంధ్రప్రదేశ్ అని రాయడం రాని లోకేష్ కూడా మాట్లాడటం విడ్డూరంగా ఉంది. చంద్రబాబు రెండు వేళ్లతో వెన్నుపోటు అని చూపించడం అందరికీ తెలుసు’ అంటూ కామెంట్స్ చేశారు. -
ఆంధ్రప్రదేశ్ అని రాయడంరాని లోకేష్ మాట్లాడటం విడ్డూరంగా ఉంది: శివశంకర్‌రెడ్డి
-
‘లోకేష్‌కు చంద్రబాబే బూతులు నేర్పించి రోడ్డుపైకి వదిలారు’
సాక్షి, తాడేపల్లి: టీడీపీ అధినేత చంద్రబాబు, నారా లోకేష్‌పై వైఎస్సార్సీపీ పార్టీ అధికార ప్రతినిధి పుత్తా శివశంకర్ రెడ్డి ఆసక్తికర కామెంట్స్ చేశారు. కనీసం ఆంధ్రప్రదేశ్ అని పేరు రాయడం కూడా చేతగాని వ్యక్తి లోకేష్ అని ఘాటు వ్యాఖ్యలు చేశారు. కాగా, శివశంకర్ రెడ్డి మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. ‘నారా లోకేష్ ఎక్కడ చదివాడు?. అతని క్లాస్‌మెట్స్ పేర్లు చెప్పమంటే ఎందుకు చెప్పటం లేదు?. చంద్రబాబు.. లోకేష్‌కు బూతులు నేర్పించి రోడ్డుపైకి వదిలారు. తండ్రీకొడుకులు ఇద్దరూ ఏ సబ్జెక్ట్‌పైనా 35 మార్కులు తెచ్చుకోలేరు. లోకేష్ భాష చూస్తుంటే సంస్కారం లేదని అర్థమవుతోంది. ఆంధ్రప్రదేశ్ అని రాయడం కూడా రాని చేతగాని దద్దమ్మ లోకేష్. అంతేకాకుండా లోకేష్ తన చెత్త హావభావాలతో ప్రజల్లోకి వచ్చాడు. అలాంటి లోకేష్ కూడా మాట్లాడటం విడ్డూరంగా ఉంది. చంద్రబాబు రెండు వేళ్లతో వెన్నుపోటు అని చూపించడం అందరికీ తెలుసు’ అంటూ కౌంటర్ ఇచ్చారు. -
పులివెందుల కోర్టుకు శివశంకర్‌రెడ్డి
కడప అర్బన్: మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో అరెస్టయి, సీబీఐ కస్టడీలో ఉన్న వైఎస్సార్సీపీ నాయకుడు దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డిని సోమవారం వైఎస్సార్ జిల్లా పులివెందుల కోర్టులో మేజిస్ట్రేట్ ముందు హాజరు పరిచారు. డిసెంబర్ 2వతేదీ వరకు ఏడు రోజుల పాటు శివశంకర్‌రెడ్డిని తమ కస్టడీలో విచారణ చేస్తామన్న సీబీఐ బృందం నాలుగోరోజునే తమ విచారణకు సహకరించడం లేదని పులివెందుల మేజిస్ట్రేట్ ముందు శివశంకరరెడ్డిని హాజరు పరిచారు. తరువాత మేజిస్ట్రేట్ ఆదేశాల మేరకు కడప కేంద్రకారాగారానికి రిమాండ్‌కు తరలించారు. కాగా, శివశంకర్‌రెడ్డికి బెయిల్ మంజూరు చేయాలని ఆయన తరఫు న్యాయవాది కడప కోర్టులో వేసిన పిటిషన్ రద్దు చేశారు. ఎర్ర గంగిరెడ్డి బెయిల్ పిటిషన్‌పై తీర్పు వాయిదా మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో అరెస్టయి, ప్రస్తుతం బెయిల్‌పై ఉన్న ఎర్ర గంగిరెడ్డి బెయిల్ రద్దు పిటిషన్‌పై తీర్పు మంగళవారానికి వాయిదా పడింది. జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో ఆయన బెయిల్ రద్దయ్యే అవకాశాలున్నట్లు న్యాయవాదులు చెబుతున్నారు. బెయిల్ రద్దు తరువాత గంగిరెడ్డి స్టేట్మెంట్ను రికార్డు చేసి కీలక వ్యక్తులను అరెస్ట్ చేసేందుకు సీబీఐ కదులుతోంది. -
సీబీఐ పిటిషన్లో టీడీపీ పలుకులు!
సాక్షి, అమరావతి: వై.ఎస్.వివేకా హత్య కేసులో అరెస్టయిన డి.శివశంకర్‌రెడ్డిని జ్యుడీషియల్ కస్టడీకి ఇవ్వాలంటూ గురువారం కడప ఫస్ట్‌క్లాస్ మేజిస్ట్రేటు ఎదుట సీబీఐ వేసిన పిటిషన్‌లోని అంశాలు విస్మయాన్ని కలిగిస్తున్నాయి. తెలుగుదేశం పార్టీ చేస్తున్న ఆరోపణలనే... తమ దర్యాప్తులో తేలిన అంశాలుగా సీబీఐ పేర్కొనటం ఇక్కడ గమనార్హం. ‘‘నిందితుడు డి.శివశంకర్‌రెడ్డి... హత్య జరిగిన మరుసటి రోజు ఉదయం 6.30 సమయంలో సమాచారం అందుకుని వివేకా ఇంటికి వెళ్లారు. ఆయన్ను రక్తపు మడుగులో చూశాక... గుండెపోటు వచ్చిందని చేసిన ప్రచారంలో తాను భాగమయ్యాడు. వై.ఎస్.వివేకా గుండెపోటుతో చనిపోయినట్లు ఆయనే సాక్షి టీవీకి సమాచారమిచ్చాడు’’ అని సీబీఐ పేర్కొంది. నిజానికి శివశంకర్‌రెడ్డి వివేకా ఇంటికి వెళ్లక మునుపే ‘సాక్షి’ టీవీ సహా పలు టీవీల్లో ఆ వార్త వచ్చేసింది. పైపెచ్చు శివశంకర్‌రెడ్డి హైదరాబాద్‌లోని వివేకా బంధువుల ద్వారా సమాచారం అందుకుని అక్కడకు వెళ్లేసరికే వివేకా పీఏ ఎం.వి.కృష్ణారెడ్డి, ఇనయతుల్లా, వాచ్మెన్ రంగన్న, పనిమనిషి సహా పలువురు అప్పటికే అక్కడున్నారు. అందరూ ఉండగా తాను రక్తపు మడుగును తుడిపించటం వంటివి సాధ్యమా? ఆ తరవాత సీఐతో సహా ఎర్ర గంగిరెడ్డి వచ్చి... పరిస్థితిని తన అధీనంలోకి తీసుకుని... రక్తాన్ని తుడిపించారన్నది అందరూ చెబుతున్న మాట. సీఐ, పోలీసులు ఉండటం వల్ల వారు చెప్పింది పని మనుషులు చేశారన్నది వారి వాదన. ఇక తనకు ఫోన్ చేసిన వివేకా బావమరిది శివప్రసాద్ రెడ్డే గుండెపోటుతో చనిపోయారని అన్నట్లు శివశంకర్‌రెడ్డి చెబుతున్నారు. ఎందుకంటే అంతకు ముందే ఇనయతుల్లా ఫోటోలు తీసి వివేకా కుటుంబీకులకు వాట్సప్ కూడా పంపించారు. దాన్ని బట్టి శివశంకర్‌రెడ్డి అక్కడకు వెళ్లేటప్పటికే రక్తాన్ని తుడిచేశారని అర్థం కావటం లేదా? మరి సీబీఐ దీన్ని ఎందుకు విస్మరించింది? అంతమంది సమక్షంలో జరిగినా... నిజానికి రక్తాన్ని తుడవటం, గాయాల దగ్గర బ్యాండేజీ వేయటం వంటివి స్థానికులు పెద్ద సంఖ్యలో ఉండగానే జరిగాయి. మరి శివశంకర్‌రెడ్డి తలుపు గడియ పెట్టుకుని లోపల ఇదంతా చేసినట్లు సీబీఐ చెబుతున్న వాదనను ఏమనుకోవాలి? నిజానికి హత్య జరిగిన రోజు వివేకా బావమరిది తనకు చెప్పారంటూ... వివేకానందరెడ్డి గుండెపోటుతో చనిపోయారని నాటి టీడీపీ మంత్రి ఆదినారాయణరెడ్డి స్వయంగా మీడియా ముందుకొచ్చి చెప్పారు. అదేవ్యక్తి తనకూ అదే విషయం చెప్పారని దేవిరెడ్డి శివశంకరరెడ్డి చెబుతున్నారు. కానీ ‘సాక్షి’ టీవీకి శివశంకరరెడ్డే చెప్పినట్లు సీబీఐ పేర్కొనటాన్ని ఏమనుకోవాలి? దస్తగిరి స్టేట్మెంట్లో వేరేలా ఉంది కదా? ఇతర నిందితులకు భారీగా డబ్బులు ఎర వేయటం ద్వారా శివశంకర్ రెడ్డి, ఆయన సహచరులు వివేకా హత్యకు కుట్ర పన్నినట్లు దర్యాప్తులో తేలిందని సీబీఐ పేర్కొంది. హత్యకు కొన్ని రోజుల ముందు శివశంకర్‌రెడ్డి పులివెందుల లోని తన స్నేహితుడు బయపురెడ్డి ఇంటికి షేక్ దస్తగిరిని పిలిచాడని, తన పేరు ఎక్కడా బయటకు రాకూడదని అక్కడే చెప్పాడని దర్యాప్తులో తేలిందని కూడా పేర్కొంది. నిజానికి దస్తగిరి కోర్టుకు ఇచ్చిన స్టేట్మెంట్లో ఈ వివరాలు మరో కోణంలో ఉండటం గమనార్హం. ‘‘ఈ హత్య చేస్తే మనకు శివశంకర్‌రెడ్డి అనే వ్యక్తి రూ.40 కోట్లు ఇస్తాడు. మీ వాటా మీకొస్తుంది’’ అని గంగిరెడ్డి తనతో చెప్పినట్లు ఆ స్టేట్మెంట్లో దస్తగిరి పేర్కొన్నాడు. తనకు నేరుగా శివశంకర్‌రెడ్డి తెలియదనే పరోక్షంగా చెప్పాడు. కానీ సీబీఐ మాత్రం దస్తగిరిని హత్యకు ముందే శివశంకర్‌రెడ్డి తన ఇంటికి పిలిచాడని పేర్కొనటం గమనార్హం. ఇవన్నీ చూస్తుంటే సీబీఐ కావాలని శివశంకర్‌రెడ్డిని ఇరికించే ప్రయత్నాలు చేస్తోందన్న వాదనలకు బలం చేకూరుతోందన్నది ఈ కేసును గమనిస్తున్న వారి మాట. -
కానిస్టేబుల్ వీరంగం
ప్రొద్దుటూరు టౌన్, న్యూస్‌లైన్: ఏపీఎస్పీ కానిస్టేబుల్ సాయిబాలాజీ సింగ్‌తోపాటు విద్యుత్ ఉద్యోగి నరేంద్ర, వీరి బంధువు గురువారం రాత్రి స్థానిక సినీ హబ్ థియేటర్స్‌లో వీరంగం సృష్టించారు. కారును పార్కింగ్‌లో పెట్టాలని కానిస్టేబుల్‌కు థియేటర్ సిబ్బంది శివశంకర్‌రెడ్డి చెప్పారు. తాము కానిస్టేబుళ్లమని చెబుతూ వాగ్వాదానికి దిగారు. ఉన్నట్టుండి ఇండికా కారులోని లాఠీలను తీసుకొని కానిస్టేబుల్ బాలాజీ శివశంకర్‌రెడ్డిని చితకబాదాడు. థియేటర్లోని తోటి సిబ్బంది బాలాజీతో వాగ్వాదానికి దిగారు. బాలాజీతోపాటు మరో ఇద్దరు శివశంకర్‌రెడ్డిని తలపై మోదడంతో తీవ్ర రక్తగాయమైంది. థియేటర్ యజమాని రాజేశ్వరరెడ్డి ఈ విషయాన్ని డీఎస్పీ శ్రీనివాసులరెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. మద్యం మత్తులో ఉన్న సాయిబాలాజీ సింగ్‌తోపాటు మిగతా ఇద్దరిని అదుపులోకి తీసుకుని రూరల్ పోలీస్‌స్టేషన్‌కు తీసుకొచ్చారు. తనపై దాడి చేసిన కానిస్టేబుల్, మరో ఇద్దరిపై శివశంకర్‌రెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు. టీడీపీ నాయకుడు వైఎస్ మహమూద్ పోలీస్‌స్టేషన్‌కు చేరుకుని సాయిబాలాజీ సింగ్‌పై కేసు నమో దు కాకుండా రాజేశ్వరరెడ్డితో చర్చించారు. పోలీసులు కేసు నమోదు చేశారు. -
ఎనిమిది మందిపై పీడీ యాక్ట్
బ్రహ్మంగారిమఠం, న్యూస్‌లైన్: ఎర్రచందనం అక్రమ రవాణాలో ఆరితేరిన స్మగ్లర్లపై ప్రత్యేక నిఘాను ఉంచడంతో పాటు 8 మందిపై పీడీ యాక్టుకు ప్రతిపాదనలు పంపినట్లు డీఎఫ్ఓ పల్లె శివశంకర్‌రెడ్డి పేర్కొన్నారు. బి. మఠం వచ్చిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రొద్దుటూరు డివిజన్ పోరుమామిళ్ల, బద్వేలు, వనిపెంట రేంజ్ పరిధిలోని నలుగురిపై పీడీ యాక్ట్ పెట్టాలని కలెక్టర్‌ను కోరగా సానుకూలంగా స్పదించారన్నారు. అలాగే మరో నలుగురిపై పీడీ యూక్ట్ కోసం ప్రతిపాదనలు పంపామన్నారు. ఎర్రచందనం అక్రమ రవాణాపై ప్రత్యేక నిఘా ఉంచామన్నారు. డివిజన్ పరిధిలో 25 మంది సాయుధ బలగాలు ఉన్నారన్నారు. పొలీసు సిబ్బందితో ప్రతి రేంజ్ పరిధిలో కవాతు నిర్వహిస్తున్నామన్నారు. బి.మఠం మండలంలో ఎర్రచందనం కూలీలే స్మగ్లర్లుగా మారుతున్నట్లు సమాచారం ఉందన్నారు. ఇందులో మల్లెపల్లెకు చెందిన వారు ఎక్కువగా ఉన్నారన్నారు. వీరిపై ప్రత్యేక దృష్టి సారిస్తామన్నారు.