ప్రొద్దుటూరు టౌన్, న్యూస్‌లైన్: ఏపీఎస్‌పీ కానిస్టేబుల్ సాయిబాలాజీ సింగ్‌తోపాటు విద్యుత్ ఉద్యోగి నరేంద్ర, వీరి బంధువు గురువారం రాత్రి స్థానిక సినీ హబ్ థియేటర్స్‌లో వీరంగం సృష్టించారు. కారును పార్కింగ్‌లో పెట్టాలని కానిస్టేబుల్‌కు థియేటర్ సిబ్బంది శివశంకర్‌రెడ్డి చెప్పారు.
తాము కానిస్టేబుళ్లమని చెబుతూ వాగ్వాదానికి దిగారు. ఉన్నట్టుండి ఇండికా కారులోని లాఠీలను తీసుకొని కానిస్టేబుల్ బాలాజీ శివశంకర్‌రెడ్డిని చితకబాదాడు. థియేటర్‌లోని తోటి సిబ్బంది బాలాజీతో వాగ్వాదానికి దిగారు. బాలాజీతోపాటు మరో ఇద్దరు శివశంకర్‌రెడ్డిని తలపై మోదడంతో తీవ్ర రక్తగాయమైంది.
థియేటర్ యజమాని రాజేశ్వరరెడ్డి ఈ విషయాన్ని డీఎస్పీ శ్రీనివాసులరెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. మద్యం మత్తులో ఉన్న సాయిబాలాజీ సింగ్‌తోపాటు మిగతా ఇద్దరిని అదుపులోకి తీసుకుని రూరల్ పోలీస్‌స్టేషన్‌కు తీసుకొచ్చారు.
తనపై దాడి చేసిన కానిస్టేబుల్, మరో ఇద్దరిపై శివశంకర్‌రెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు. టీడీపీ నాయకుడు వైఎస్ మహమూద్ పోలీస్‌స్టేషన్‌కు చేరుకుని సాయిబాలాజీ సింగ్‌పై కేసు నమో దు కాకుండా రాజేశ్వరరెడ్డితో చర్చించారు. పోలీసులు కేసు నమోదు చేశారు.
కానిస్టేబుల్ వీరంగం
Published Fri, Apr 4 2014 2:53 AM | Last Updated on Mon, Aug 20 2018 3:37 PM
Advertisement
Advertisement