బ్రహ్మంగారిమఠం, న్యూస్‌లైన్: ఎర్రచందనం అక్రమ రవాణాలో ఆరితేరిన స్మగ్లర్లపై ప్రత్యేక నిఘాను ఉంచడంతో పాటు 8 మందిపై పీడీ యాక్టుకు ప్రతిపాదనలు పంపినట్లు డీఎఫ్‌ఓ పల్లె శివశంకర్‌రెడ్డి పేర్కొన్నారు. బి. మఠం వచ్చిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రొద్దుటూరు డివిజన్ పోరుమామిళ్ల, బద్వేలు, వనిపెంట రేంజ్ పరిధిలోని నలుగురిపై పీడీ యాక్ట్ పెట్టాలని కలెక్టర్‌ను కోరగా సానుకూలంగా స్పదించారన్నారు. అలాగే మరో నలుగురిపై పీడీ యూక్ట్ కోసం ప్రతిపాదనలు పంపామన్నారు.
ఎర్రచందనం అక్రమ రవాణాపై ప్రత్యేక నిఘా ఉంచామన్నారు. డివిజన్ పరిధిలో 25 మంది సాయుధ బలగాలు ఉన్నారన్నారు. పొలీసు సిబ్బందితో ప్రతి రేంజ్ పరిధిలో కవాతు నిర్వహిస్తున్నామన్నారు. బి.మఠం మండలంలో ఎర్రచందనం కూలీలే స్మగ్లర్లుగా మారుతున్నట్లు సమాచారం ఉందన్నారు. ఇందులో మల్లెపల్లెకు చెందిన వారు ఎక్కువగా ఉన్నారన్నారు. వీరిపై ప్రత్యేక దృష్టి సారిస్తామన్నారు.
ఎనిమిది మందిపై పీడీ యాక్ట్
Published Fri, Jan 17 2014 2:30 AM | Last Updated on Sat, Sep 2 2017 2:40 AM
Advertisement
Advertisement