ఎర్రచందనం స్మగ్లర్లకు సహకరించిన ఆర్టీసీ డ్రైవర్లను నేడో, రేపో అరెస్ట్ చేయనున్నారు. ఏపీఎస్‌ఆర్టీసీ కడప జోనల్ పరిధిలో కర్నూలు రీజియన్‌కు చెందిన ఆర్టీసీ డ్రైవర్లు
ఎస్పీ టేబుల్‌పై జాబితా
కడప అర్బన్ : ఎర్రచందనం స్మగ్లర్లకు సహకరించిన ఆర్టీసీ డ్రైవర్లను నేడో, రేపో అరెస్ట్ చేయనున్నారు. ఏపీఎస్‌ఆర్టీసీ కడప జోనల్ పరిధిలో కర్నూలు రీజియన్‌కు చెందిన ఆర్టీసీ డ్రైవర్లు కొంతమంది ఎర్రచందనం దుంగల నరికివేత, స్మగ్లింగ్‌కు పాల్పడే కూలీలను తరలించడంలో తమవంతు సహకరిస్తున్నట్లు ఇటీవల వెల్లడైంది. ఈనెల 2వ తేదీన కర్నూలుజిల్లా ఆళ్లగడ్డ, నంద్యాల డిపోలకు చెందిన 11 మంది డ్రైవర్లను జిల్లా ఎస్పీ డాక్టర్ నవీన్‌గులాఠీ ఆధ్వర్యంలో పోలీసు సిబ్బంది అరెస్టు చేశారు.
దీంతో ఒక్కసారిగా ఉలిక్కిపడిన ఏపీఎస్‌ఆర్టీసీ అధికారులు విజిలెన్స్ అధికారులతో విచారణ చేయించారు. విజిలెన్స్ అధికారులు ఆయా జాబితాను సిద్ధం చేశారు. 30 మంది పేర్లున్న జాబితాను ఇప్పటికే ఆర్టీసీ ఎండీ పూర్ణచంద్రరావుకు పంపించారు. అదే నివేదికను జిల్లా ఎస్పీ నవీన్‌గులాఠీకి ఆర్టీసీ విజిలెన్స్ అధికారులు పంపినట్లు సమాచారం. ఎస్పీ స్వీయ పర్యవేక్షణలో పోలీసు అధికారులు జాబితాను పరిశీలించి వారి పాత్రను విచారించి త్వరలో అరెస్టు చేయనున్నట్లు తెలిసింది.