సాక్షి, తాడేపల్లి: తనది ఎన్టీఆర్ గొంతు అని టీడీపీ నేత నారా లోకేష్ అంటున్నాడు. మాట్లాడితే ఎన్టీఆర్ వారసుడిని అంటాడు.. ఎన్టీఆర్ బాడీ లాంగ్వేజ్ ఏంటి? నీ బాడీ లాంగ్వేజ్ ఏంటి?. అసలు ఎక్కడైనా పోలిక ఉందా?. తెలుగు వారి ఆత్మగౌరవం అంటూ చేతిని సూటిగా చూపిస్తారు ఎన్టీఆర్. మరి నీ తండ్రి చంద్రబాబు రెండువేళ్లూ ఊపుతూ చూపితే అది ఊళ్ళల్లో చెప్పినట్టు లండన్(బాత్ రూమ్)కు వెళ్లొస్తా అన్నట్లుగా ఉంటుంది.
నీ స్థాయి అంత కన్నా కిందికి దిగజారి చేతిని అలా ఇలా అని అసభ్యంగా ఊపుతూ దిక్కుమాలిన సంజ్ఞలు చేయడం చూస్తే జనం ఛీదరించుకుంటున్నారు.. ఏంటీ ఈ వెర్రితనం.. పిచ్చితనం లోకేశ్?. లోకేష్.. నీవు నేర్చుకున్న చదువు ఇదేనా?. నీ తండ్రి బాబు నీకు నేర్పిన సంస్కారం ఇదేనా?. జనం నవ్విపోతారన్న సిగ్గన్నా మీకు లేదా?. డెంగ్యూ అని పలకడం రాక బూతులు పలికే నీవు చదువు గురించి, సంస్కారం గురించి మాట్లాడతావా?.
ఆంధ్రప్రదేశ్‌లో లోకేశ్ యువ‘గంగాళం’ అనే ప్రాజెక్టు ఒకటి నడుస్తోంది. ఈ ప్రాజెక్టును పూర్తి చేయడం కోసం, ఒకవైపు టీడీపీ, మరోవైపు ఎల్లోమీడియా జాకీలు పెట్టి మరీ పైకి లేపాలని చూస్తోంది. మీరెంత లేపినా.. యువ‘గంగాళం’ ప్రాజెక్టుపైకి లేవదు. ఎన్నటికీ పూర్తి కానేకాదు. అది అంత అసమర్థ ప్రాజెక్టు అని జనమే తేల్చేశారు. పెయిడ్ ఆర్టిస్టులతో జనాన్ని రప్పించాలని రండి బాబూ రండి.. అని ఎంతగా బతిమాలి బామాలినా పాదయాత్రలో లోకేశ్ వెంట నడవం గాక నడవం అంటూ జనం ఆ యాత్రకు రానే రావడం లేదు.
జనం రావడం లేదన్న నిరాశలో ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నారు. నీ పాదయాత్రను పట్టించుకునే వారే లేరన్న నిరాశలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపై విమర్శలు చేస్తున్నావు. సీఎం జగన్ పాదయాత్ర చూసి కాపీ కొడితే.. పులిని చూసి వాతలు పెట్టుకుంటే అవుతుంది. ‘స్టాన్‌ఫోర్డ్ యూనివర్సిటీలో లోకేష్ నిజంగానే చదివాడా?. అతని క్లాస్‌మెట్స్ పేర్లు చెప్పమంటే ఎందుకు చెప్పటం లేదు?. చంద్రబాబు.. లోకేష్‌కు బూతులు నేర్పించి రోడ్డుపైకి వదిలారు. తండ్రీకొడుకులు ఇద్దరూ ఏ సబ్జెక్ట్‌పైనా 35 మార్కులు తెచ్చుకోలేరు. ఆంధ్రప్రదేశ్ అని రాయడం రాని లోకేష్ కూడా మాట్లాడటం విడ్డూరంగా ఉంది. చంద్రబాబు రెండు వేళ్లతో వెన్నుపోటు అని చూపించడం అందరికీ తెలుసు’ అంటూ కామెంట్స్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment