
పులివెందుల రోటరీపురం బ్రిడ్జి వద్ద ఆయుధాల కోసం ఆన్వేషిస్తున్న సీబీఐ అధికారుల బృందం
పులివెందుల: మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్యకు ఉపయోగించిన మారణాయుధాల కోసం సీబీఐ అధికారులు అన్వేషిస్తున్నారు. కేసులో కీలక నిందితుడిగా ఉన్న సునీల్‌యాదవ్ నుంచి సేకరించిన సమాచారం మేరకు శనివారం మధ్యాహ్నం ఈ గాలింపు చేపట్టారు. నిందితుణ్ణి వెంటబెట్టుకుని మూడు వాహనాల్లో పులివెందులలోని రోటరీపురం బ్రిడ్జి వద్దకు వారు చేరుకున్నారు.
అనంతరం మున్సిపల్ కార్మికులతో నీటిని తోడించే కార్యక్రమం చేపట్టారు. మురికినీరు ఎక్కువగా ఉండటంతో ఉల్లిమెల్ల చెరువు వద్ద గండి కొట్టించారు. రాత్రి వరకు గాలించినా ఆయుధాల జాడ లభించలేదు. చీకటి పడటంతో ఆదివారం ఉదయం మళ్లీ పనులు మొదలు పెట్టనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment