ఎస్‌బీఐ ఖాతాదారులకు తప్పని తిప్పలు
చీపురుపల్లి : సిబ్బంది కొరత కార ణంగా స్థానిక స్టేట్‌బ్యాంక్ వినియోగదారులు అవస్థలు పడుతున్నారు. చీపురుపల్లి, గరివిడి, మెరకముడిదాం మండలాల్లో అత్యం త ప్రాధాన్యత కలిగిన బ్రాంచి చీపురుపల్లి ఎస్‌బీఐ.
ఈ బ్రాంచిలో దాదాపు 40 వేల ఖాతాలు ఉన్నాయి. ప్రతిరోజూ కోట్లాది రూపాయిలు టర్నోవర్ జరుగుతుంటుంది. అలాం టి ఈ బ్రాంచిలో రెండు నెలలుగా బ్రాంచి మేనేజర్ పోస్టు ఖాళీగా ఉందంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. రెండు నెలలు కిందట వరకూ ఇక్కడ మేనేజర్‌గా సేవలందించిన గోవింద్‌తివారి పదోన్నతిపై వెళ్లిపోయారు. తరువాత మేనేజర్‌ను నియమించలేదు.
క్లరికల్, గుమస్తా సిబ్బంది కూడా తక్కువ శాతంలో ఉండడంతో సిబ్బంది ఇబ్బందులు పడాల్సి వస్తోంది. సాయంత్రం 4 గంటలకు సమయం ముగిసే సమయానికి కూడా ఇంకా పదుల సంఖ్యలో ఖాతాదారులు ఉంటారు. వారందరి పని ముగించాలంటే సిబ్బంది అదనంగా గంట సమయం సేవ లు అందించాల్సి ఉంటుంది. అదనంగా సేవలందిం చేందుకు సిబ్బంది నిరాకరిస్తున్నారు. దీంతో ఇటీవల ఖాతాదారులకు సిబ్బందికి మద్య వాగ్వాదం కూడా జరిగింది. పట్టణంలో అదనపు బ్రాంచి ఏర్పాటు చేస్తే బాగుంటుందని ఖాతాదారులు అభిప్రాయపడుతున్నారు.
3