turn over
-
రూ.50 వేల కోట్ల టర్నోవర్‌ను దాటిన మలబార్
హైదరాబాద్: మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ రూ.50 వేల కోట్లను మించి రికార్డు వార్షిక టర్నోవర్ సాధించిందని సంస్థ చైర్మన్ ఎం.పి. అహమ్మద్ తెలిపారు. సోమాజిగూడ మలబార్ షోరూమ్‌లో శుక్రవారం జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ‘‘గ్లోబల్ ర్యాంకింగ్ ఆఫ్ లగ్జరీ ప్రోడక్ట్స్‌లో మలబార్ గ్రూప్ 19వ ర్యాంక్‌ను కైవసం చేసుకుంది. గత ఆర్థిక సంవత్సరం రూ.51,218 కోట్ల వార్షిక రిటైల్ గ్లోబల్ టర్నోవర్ సాధించింది’’ అన్నారు. వ్యాపార విస్తరణకు ప్రణాళికల్లో భాగంగా దేశ, విదేశాల్లో వచ్చే ఏడాదిలో 100 కొత్త షోరూములు ప్రారంభించాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. తద్వారా అదనంగా 7 వేల మందికి ఉపాధి కలి్పస్తామని అహమ్మద్ పేర్కొన్నారు. -
లక్ష్యం సాధిస్తే రూ.40 వేల కోట్ల టర్నోవర్
గోదావరిఖని: దేశవ్యాప్తంగా బొగ్గుకు తీవ్రమైన డిమాండ్ ఏర్పడుతోందని, మిగిలిన ఆర్నెల్లలో రోజూ కనీసం 2.10 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి చేయాలని సింగరేణి సంస్థ సీ అండ్ ఎండీ ఎన్.శ్రీధర్ ఆదేశించారు. మంగళవారం వీడియో కాన్ఫరెన్స్‌లో అన్నిఏరియాలో జరిగిన సమావేశంలో మాట్లాడారు. వచ్చేఏడాది మార్చి చివరికల్లా 72 మిలియన్ టన్నుల లక్ష్యాన్ని అధిగమించాలని ఆదేశించారు. ఈ ఆర్థిక సంవత్సరంలో తొలి ఆర్నెల్లలో వర్షాలతో కొంతఇబ్బంది కలిగినా అన్నిఅవరోధాలు అధిగమిస్తూ గతేడాది బొగ్గు రవాణాలో 12 శాతం వృద్ధి, ఉత్పత్తిలో 7శాతం, ఓవర్‌బర్డెన్ తొలగింపులో 15 శాతం వృద్ధి సాధించడంపై హర్షం వ్యక్తంచేశారు. ఈఆర్థిక సంవత్సరంలో మిగిలిన ఆర్నెల్లు కీలకమని పేర్కొన్నారు. ఈ క్రమంలో అన్నిఏరియాలకు అవసరమైన యంత్రాలు, అనుమతులు, ఓబీ కాంట్రాక్టులు ఇప్పటికే సమకూర్చామన్నారు. ఇకపై వర్షప్రభావం ఉండే అవకాశం లేదన్నారు. ఓపెన్‌కాస్ట్‌ల్లో నిలిచిన నీటిని బయటకు తోడేయాలని, బొగ్గు ఉత్పత్తి, ఓవర్ బర్డెన్ తొలగింపును మరింత వేగవంతం చేయాలని సూచించారు. లక్ష్యాలు సాధిస్తే రూ.3,500కోట్ల లాభాలు ఈఏడాది నిర్దేశిత 72మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి చేస్తే.. లక్ష్యానికి అనుగుణంగా రవాణా చేసే అవకాశం ఉందని సీఎండీ తెలిపారు. తద్వారా రూ.40 వేల కోట్ల టర్నోవర్, సుమారు రూ.3,500 కోట్ల లాభాలు సాధించే అవకాశం ఉందని తెలిపారు. అంకిత భావంతో పనిచేయాలి సింగరేణి ఉద్యోగులకు గతంలో ఎన్నడూ లేనివిధంగా ఒకేదఫా రూ.1,750 కోట్ల వేజ్‌బోర్డు ఎరియర్స్ చెల్లించామని, సీఎం ప్రకటించినట్లు 32శాతం లాభాల బోనస్ రూ.711 కోట్లు కూడా దసరా పండుగకు ముందే విడుదల చేయనున్నామని పేర్కొన్నారు. దీపావళి బోనస్‌ను పండుగకు ముందే కార్మికుల ఖాతాల్లో జమ చేస్తామని వెల్లడించారు. కంపెనీపై విశ్వాసం, విధుల్లో అంకితభావంతో కార్మిక, అధికారులు, సమష్టిగా కృషి చేయాలని కోరారు. లక్ష్యాల అధిగమించిన సింగరేణి ఈ ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ వరకు బొగ్గు ఉత్పత్తి, రవాణాలో సింగరేణి నిర్దేశిత లక్ష్యాలు సాధించిందని శ్రీధర్ అన్నారు. ఈ ఏడాది బొగ్గు రవాణా లక్ష్యం 307 లక్షల టన్నులు కాగా 330 లక్షల టన్నుల బొగ్గు రవాణా చేసి, 7 శాతం వృద్ధిని నమోదు చేసిందని వివరించారు. గతేడాది ఇదే సమయం కన్నా 12శాతం అధికమని పేర్కొన్నారు. సమావేశంలో డైరెక్టర్లు ఎన్.బలరాం, సత్యనారాయణరావు, వెంకటేశ్వర్‌రెడ్డి, అధికారులు సరేంద్రపాండే, అల్విన్, ఎం.సురేశ్, రమేశ్ పాల్గొన్నారు. -
ఆటో విడిభాగాల లాభాలు వీక్!
న్యూఢిల్లీ: కోవిడ్–19 సెకండ్ వేవ్ కారణంగా ఆటో విడిభాగాల కంపెనీలు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2021–22) తొలి క్వార్టర్లో ఆర్థిక సవాళ్లను ఎదుర్కోనున్నట్లు రేటింగ్ దిగ్గజం ఇక్రా తాజాగా అంచనా వేసింది. కరోనా కేసుల కట్టడికి ఆంక్షలు, లాక్డౌన్ల నేపథ్యంలో నిర్వహణ లాభాలపై తీవ్ర ప్రభావం పడనున్నట్లు పేర్కొంది. వెరసి క్యూ1(ఏప్రిల్–జూన్)లో ఆటో విడిభాగాల కంపెనీల నిర్వహణ లాభాల్లో 70 శాతం కోత పడేవీలున్నట్లు ఒక నివేదికలో అభిప్రాయపడింది. ఇందుకు మరోవైపు వేగంగా పెరిగిన కమోడిటీల ధరలు కారణంకానున్నట్లు తెలియజేసింది. అయితే వీటిని వాహన తయారీ(ఓఈఎం) సంస్థలకు బదిలీ చేసే వీలున్నప్పటికీ ఇందుకు 3–6 నెలల సమయం పడుతుందని వివరించింది. ఆంక్షల ఎఫెక్ట్ ఈ ఏడాది క్యూ1లో ఆటో విడిభాగాల కంపెనీల మొత్తం ఆదాయాలూ ప్రతికూల ప్రభావాన్ని ఎదుర్కోనున్నట్లు ఇక్రా నివేదిక పేర్కొంది. త్రైమాసికవారీగా చూస్తే 30–40 శాతం స్థాయిలో టర్నోవర్ తగ్గవచ్చని అంచనా వేసింది. ఫలితంగా నిర్వహణ లాభం (ఇబిటా) గత ఆర్థిక సంవత్సరం(2020–21) చివరి త్రైమాసికంతో పోలిస్తే 70 శాతం స్థాయిలో క్షీణించవచ్చని అభిప్రాయపడింది. కాగా.. కరోనా ప్రతికూలతల నేపథ్యంలో లాక్డౌన్ ఆంక్షలు కొనసాగుతున్నప్పటికీ గత కొద్ది నెలలుగా ఆటో విడిభాగాల పరిశ్రమను ఎగుమతులు ఆదుకుంటున్నట్లు ఇక్రా నివేదిక పేర్కొంది. దీంతో దేశీ డిమాండుపైనే అధికంగా ఆధారపడే కంపెనీలపై తీవ్ర ప్రభావం పడనున్నట్లు తెలియజేసింది. నిల్వలు పెరుగుతున్నాయ్ స్వల్ప కాలంలో ఆటో విడిభాగాల పరిశ్రమ సవాళ్లను ఎదుర్కోనున్నప్పటికీ పూర్తి ఏడాదిలో పటిష్ట పనితీరు చూపే వీలున్నట్లు పేర్కొంది. ఆదాయంలో సగటున 20–23% పురోగతి నమోదుకాగలదని అంచనా వేసింది. ఆటోమొబైల్ రంగంలో పలు విభాగాలలోనూ రెండంకెల వృద్ధికి వీలుండటంతో ఆదాయాలు పుంజుకోగలవని వివరించింది. ఏప్రిల్‌లో ఉత్పత్తిలో నిలకడ కొనసాగినప్పటికీ గత రెండు నెలల్లో రిటైల్ విక్రయాలు పడిపోయినట్లు తెలియజేసింది. దీంతో ఆటో రంగ పరిశ్రమలో నిల్వలకు అవకాశం ఏర్పడినట్లు ప్రస్తావించింది. పలు ఓఈఎంలు జూన్ నెలలో ఒకే షిఫ్ట్‌కు పరిమితంకావడంతో ఉత్పత్తి పరిమాణం మందగించనున్నట్లు తెలియజేసింది. కమోడిటీ ధరలు సైతం ఒత్తిడిని పెంచనున్నట్లు ఇక్రా వివరించింది. ప్రస్తుత ఏడాది తొలి అర్ధభాగంలో ఈ ప్రభావం అధికంగా కనిపించనుందని, అక్టోబర్–మార్చి నుంచి ధరలు కొంతమేర బలహీనపడవచ్చని విశ్లేషించింది. ఎలక్ట్రానిక్ పరికరాల కొరత, సెమీకండక్టర్ ధరల పెరుగుదల సైతం ఆటో పరిశ్రమకు సమస్యలు సృష్టించనున్నట్లు ఇక్రా అభిప్రాయపడింది. చదవండి: అదిరిపోయిన బీఎండబ్ల్యూ ‘మినీ’ కార్లు..! హ్యుందాయ్ కెట్రాలో కొత్త మోడల్... తగ్గిన ధర -
ఎస్బీఐ ఖాతాదారులకు తప్పని తిప్పలు
చీపురుపల్లి : సిబ్బంది కొరత కార ణంగా స్థానిక స్టేట్‌బ్యాంక్ వినియోగదారులు అవస్థలు పడుతున్నారు. చీపురుపల్లి, గరివిడి, మెరకముడిదాం మండలాల్లో అత్యం త ప్రాధాన్యత కలిగిన బ్రాంచి చీపురుపల్లి ఎస్బీఐ. ఈ బ్రాంచిలో దాదాపు 40 వేల ఖాతాలు ఉన్నాయి. ప్రతిరోజూ కోట్లాది రూపాయిలు టర్నోవర్ జరుగుతుంటుంది. అలాం టి ఈ బ్రాంచిలో రెండు నెలలుగా బ్రాంచి మేనేజర్ పోస్టు ఖాళీగా ఉందంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. రెండు నెలలు కిందట వరకూ ఇక్కడ మేనేజర్‌గా సేవలందించిన గోవింద్తివారి పదోన్నతిపై వెళ్లిపోయారు. తరువాత మేనేజర్‌ను నియమించలేదు. క్లరికల్, గుమస్తా సిబ్బంది కూడా తక్కువ శాతంలో ఉండడంతో సిబ్బంది ఇబ్బందులు పడాల్సి వస్తోంది. సాయంత్రం 4 గంటలకు సమయం ముగిసే సమయానికి కూడా ఇంకా పదుల సంఖ్యలో ఖాతాదారులు ఉంటారు. వారందరి పని ముగించాలంటే సిబ్బంది అదనంగా గంట సమయం సేవ లు అందించాల్సి ఉంటుంది. అదనంగా సేవలందిం చేందుకు సిబ్బంది నిరాకరిస్తున్నారు. దీంతో ఇటీవల ఖాతాదారులకు సిబ్బందికి మద్య వాగ్వాదం కూడా జరిగింది. పట్టణంలో అదనపు బ్రాంచి ఏర్పాటు చేస్తే బాగుంటుందని ఖాతాదారులు అభిప్రాయపడుతున్నారు. 3