మోసపూరిత సందేశాలను పంపి అమాయక ప్రజలను దోచుకునేవారు ఎక్కువైపోతున్నారు. ఇటీవల ఎస్‌బీఐ కస్టమర్లను టార్గెట్ చేసుకుని కొందరు ఫ్రాడ్ మెసేజ్‌లు పంపిస్తున్నారు. దీంతో కస్టమర్లను అప్రమత్తం చేయడానికి ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (PIB) ఫ్యాక్ట్ చెక్ యూనిట్ సోషల్ మీడియాలో ఓ ట్వీట్ చేసింది.
ఎస్‌బీఐ కస్టమర్లకు వస్తున్న సందేశాలు చట్టబద్దమైనవి కావు. బ్యాంక్ ఎప్పుడూ ఎస్ఎమ్ఎస్, వాట్సాప్ ద్వారా లింక్స్ లేదా యాప్స్ పైల్స్ పంపదు. కాబట్టి వస్తున్న సందేశాలకు ఎవరూ స్పందించవద్దని వెల్లడించింది.
జాగ్రత్తగా ఉండండి, ఎస్‌బీఐ రివార్డ్‌లను రీడీమ్ చేయడానికి APK ఫైల్‌ను డౌన్‌లోడ్ చేసి, ఇన్‌స్టాల్ చేయమని మీకు సందేశం కూడా వచ్చిందా జాగ్రత్త ?.. అటాంటి ఫైళ్లను క్లిక్ చేయవద్దు, డౌన్‌లోడ్ చేయవద్దని ఎక్స్ (ట్విటర్) ఖాతా ద్వారా ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (పీఐబీ) ఫ్యాక్ట్ చెక్ యూనిట్ ట్వీట్ చేసింది.
సైబర్ నేరగాళ్లు పంపే మెసేజ్‌లు
ప్రియమైన వాల్యూ కస్టమర్, మీ ఎస్‌బీఐ నెట్‌బ్యాంకింగ్ రివార్డ్ పాయింట్‌ల (రూ.9980.00) గడువు ఈరోజు ముగుస్తుంది. ఇప్పుడు ఎస్‌బీఐ రివార్డ్ యాప్ ఇన్‌స్టాల్ ద్వారా రీడీమ్ చేసుకోండి. మీ ఖాతాలో నగదు డిపాజిట్ అవుతుందని మెసేజ్ చేస్తున్నారు. ఇది నిజమే అని చాలామంది మోసపోతున్నారు.
ఇలాంటి సందేశాలకు మోసపోకుండా ఉండాలంటే?
- మెసేజ్ ఎవరు పంపించారు అనే విషయాన్ని ఖచ్చితంగా ధ్రువీకరించండి. నిజంగానే బ్యాంక్ నుంచి సందేశం వచ్చిందా? అని తెలుసుకోవాలి.
- తెలియని లింక్‌లపై క్లిక్ చేయడం, డౌన్‌లోడ్ చేయడం వంటివి మానుకోవాలి.
- మీ బ్యాంక్ నుంచి అనుమానాస్పద సందేశాన్ని స్వీకరించినట్లయితే.. అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించి మరిన్ని వివరాలు తెలుసుకోవాలి.
- బ్యాంకుకు సంబంధించిన అధికారిక యాప్స్ లేదా వెబ్‌సైట్‌ల ద్వారా మాత్రమే లావాదేవీలను జరపండి.
- ఈమెయిల్, ఎస్ఎమ్ఎస్ లేదా సోషల్ మీడియా ద్వారా వ్యక్తిగత, ఆర్థిక సంబంధిత లాగిన్ వివరాలను పంచుకోవద్దు.
- ఏవైనా అనుమానాస్పద సందేశాలు లేదా ఫిషింగ్ ప్రయత్నాల గురించి సంబంధిత అధికారులకు తెలియజేయాలి.
Beware ‼️
Did you also receive a message asking you to download & install an APK file to redeem SBI rewards❓#PIBFactCheck
❌@TheOfficialSBI NEVER sends links or APK files over SMS/WhatsApp
✔️Never download unknown files or click on such links
🔗https://t.co/AbVtZdQ490 pic.twitter.com/GhheIEkuXp— PIB Fact Check (@PIBFactCheck) July 31, 2024
Comments
Please login to add a commentAdd a comment