Fake Messages
-
ఎస్బీఐ ఖాతాదారులకు హెచ్చరిక.. ఇలాంటి లింక్స్‌పై క్లిక్ చేయొద్దు
మోసపూరిత సందేశాలను పంపి అమాయక ప్రజలను దోచుకునేవారు ఎక్కువైపోతున్నారు. ఇటీవల ఎస్బీఐ కస్టమర్లను టార్గెట్ చేసుకుని కొందరు ఫ్రాడ్ మెసేజ్‌లు పంపిస్తున్నారు. దీంతో కస్టమర్లను అప్రమత్తం చేయడానికి ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (PIB) ఫ్యాక్ట్ చెక్ యూనిట్ సోషల్ మీడియాలో ఓ ట్వీట్ చేసింది.ఎస్బీఐ కస్టమర్లకు వస్తున్న సందేశాలు చట్టబద్దమైనవి కావు. బ్యాంక్ ఎప్పుడూ ఎస్ఎమ్ఎస్, వాట్సాప్ ద్వారా లింక్స్ లేదా యాప్స్ పైల్స్ పంపదు. కాబట్టి వస్తున్న సందేశాలకు ఎవరూ స్పందించవద్దని వెల్లడించింది.జాగ్రత్తగా ఉండండి, ఎస్బీఐ రివార్డ్‌లను రీడీమ్ చేయడానికి APK ఫైల్‌ను డౌన్లోడ్ చేసి, ఇన్స్టాల్ చేయమని మీకు సందేశం కూడా వచ్చిందా జాగ్రత్త ?.. అటాంటి ఫైళ్లను క్లిక్ చేయవద్దు, డౌన్లోడ్ చేయవద్దని ఎక్స్ (ట్విటర్) ఖాతా ద్వారా ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (పీఐబీ) ఫ్యాక్ట్ చెక్ యూనిట్ ట్వీట్ చేసింది.సైబర్ నేరగాళ్లు పంపే మెసేజ్లుప్రియమైన వాల్యూ కస్టమర్, మీ ఎస్బీఐ నెట్‌బ్యాంకింగ్ రివార్డ్ పాయింట్ల (రూ.9980.00) గడువు ఈరోజు ముగుస్తుంది. ఇప్పుడు ఎస్బీఐ రివార్డ్ యాప్ ఇన్స్టాల్ ద్వారా రీడీమ్ చేసుకోండి. మీ ఖాతాలో నగదు డిపాజిట్ అవుతుందని మెసేజ్ చేస్తున్నారు. ఇది నిజమే అని చాలామంది మోసపోతున్నారు.ఇలాంటి సందేశాలకు మోసపోకుండా ఉండాలంటే?మెసేజ్ ఎవరు పంపించారు అనే విషయాన్ని ఖచ్చితంగా ధ్రువీకరించండి. నిజంగానే బ్యాంక్ నుంచి సందేశం వచ్చిందా? అని తెలుసుకోవాలి.తెలియని లింక్‌లపై క్లిక్ చేయడం, డౌన్లోడ్ చేయడం వంటివి మానుకోవాలి.మీ బ్యాంక్ నుంచి అనుమానాస్పద సందేశాన్ని స్వీకరించినట్లయితే.. అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించి మరిన్ని వివరాలు తెలుసుకోవాలి.బ్యాంకుకు సంబంధించిన అధికారిక యాప్స్ లేదా వెబ్సైట్ల ద్వారా మాత్రమే లావాదేవీలను జరపండి.ఈమెయిల్, ఎస్ఎమ్ఎస్ లేదా సోషల్ మీడియా ద్వారా వ్యక్తిగత, ఆర్థిక సంబంధిత లాగిన్ వివరాలను పంచుకోవద్దు.ఏవైనా అనుమానాస్పద సందేశాలు లేదా ఫిషింగ్ ప్రయత్నాల గురించి సంబంధిత అధికారులకు తెలియజేయాలి.Beware ‼️Did you also receive a message asking you to download & install an APK file to redeem SBI rewards❓#PIBFactCheck❌@TheOfficialSBI NEVER sends links or APK files over SMS/WhatsApp✔️Never download unknown files or click on such links🔗https://t.co/AbVtZdQ490 pic.twitter.com/GhheIEkuXp— PIB Fact Check (@PIBFactCheck) July 31, 2024 -
డీజీపీ మహేందర్ రెడ్డి పేరుతో సైబర్ నేరగాళ్ల వసూళ్లు
సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. రోజురోజుకు సైబర్ నేరాల సంఖ్య పెరిగిపోతోంది. ఏదో రకంగా కేటుగాళ్లు.. ప్రజలను బురిడీ కొట్టించి.. డబ్బులు దండుకుంటున్నారు. తాజాగా తెలంగాణలో మరో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. తెలంగాణ డీజీపీ మహేందర్ రెడ్డిని సైతం సైబర్ నేరగాళ్లు వదలలేదు. 97857 43029 నెంబర్‌కు డీజీపీ డీపీ పెట్టి కేటుగాళ్లు మోసాలను తీర లేపారు. పోలీసు ఉన్నతాధికారులు, ప్రముఖులు, సామాన్యులకు డీజీపీ పేరుతో సైబర్ నేరగాళ్లు మెసేజ్‌లు పంపుతున్నారు. దీనిపై ఆరా తీసిన సైబర్ క్రైమ్ పోలీసులు.. అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కాగా, ఈ నేరాలపై దర్యాప్తు చేపట్టాలని డీజీపీ మహేందర్ రెడ్డి పోలీసులను ఆదేశించారు. ఇది కూడా చదవండి: 1,518 సివిల్ కేసుల పరిష్కారం -
కాల్ చేశారా.. ఖాతా ఖాళీ!
గన్నవరంలో ఓ వ్యక్తికి ‘మీరు కరెంట్ బిల్లు చెల్లించలేదు. విద్యుత్ సరఫరా ఆగిపోతుంది. వెంటనే విద్యుత్ అధికారిని సంప్రదించండి’ అంటూ మెసేజ్ వచ్చింది. ఆ మెసేజ్‌లో ఓ సెల్ ఫోన్ నంబర్ ఉంది. ఆ మెసేజ్ చూసి కంగుతిన్న ఆ వ్యక్తి.. వెంటనే అందులో ఇచ్చిన నంబర్‌కు ఫోన్ చేశాడు. అంతే, అతని బ్యాంకు ఖాతా నుంచి డబ్బులు మాయమయ్యాయి. సాక్షి, అమరావతి: ‘క్రైమ్ అంతం కాదు.. దాని స్వరూపం మార్చుకుంటుందంతే’.. అంటూ ఒక సినిమాలో చెప్పిన వ్యాఖ్యలను అక్షరాలా నిజం చేస్తున్నారు సైబర్ నేరగాళ్లు. ఒకప్పుడు క్రెడిట్ కార్డు బకాయి చెల్లించలేదని, ఏటీఎం కార్డు గడువు తేదీ ముగిసిందని ఫోన్ చేసి ఓటీపీలు అడిగేవారు. చెప్పగానే బ్యాంకులో డబ్బులు లాగేసేవారు. లాటరీ టికెట్ తగిలిందని, భారీ ఆఫర్లు అంటూ ఫోన్‌కు లింక్‌లు పంపేవారు. వాటిని తెరిస్తే అంతే సంగతులు. ఇప్పుడు ఓటీపీలు, లింకులు, బ్యాంకు వివరాలు కోరడం వంటి వాటిపై ప్రజల్లో అవగాహన పెరగడంతో నేరగాళ్లు కొత్త బాట పట్టారు. ఎనీ డెస్క్, టీం వ్యూయర్ వంటి రిమోట్ డెస్క్ యాప్స్‌ను మొబైల్లో డౌన్లోడ్ చేసుకుని, బ్యాంక్ ఐడీ, పాస్వర్డ్స్ తెలుసుకుని దోచుకుంటున్నారు. వినియోగదారులకు బిల్లు కట్టలేదంటూ మెసేజ్‌లు పంపి అందులోని ఫోన్ నంబర్‌కు కాల్ చేయగానే అతని ఖాతాలో ఉన్న సొమ్మును ఊడ్చేస్తున్నారు. ఈ విధమైన మోసాలు విద్యుత్ విజిలెన్స్ అధికారుల దృష్టికి వచ్చాయి. ఇటువంటి మెసేజ్‌లను నమ్మవద్దని, ఎటువంటి ఫోన్ నంబర్లకు ఫోన్ చేయవద్దని హెచ్చరిస్తున్నారు. విద్యుత్ పంపిణీ సంస్థలు సురక్షితమైన విధానాల ద్వారా బిల్లులు చెల్లించాలని సూచిస్తున్నారు. ఇలా చేస్తే సురక్షితం విద్యుత్ బిల్లులు చెల్లించడానికి ప్రజలు ఎలక్ట్రికల్ రెవెన్యూ కార్యాలయం(ఈఆర్ఓ), మీసేవ కేంద్రాలకు వెళ్తున్నారు. కొన్ని ప్రాంతాల్లో ఎనీటైం పేమెంట్ మెషీన్ (ఏటీపీ)లను డిస్కంలు ఏర్పాటు చేశాయి. రాష్ట్రంలోని దాదాపు 1.91 కోట్ల వినియోగదారులకు సేవలందించేందుకు ఆంధ్రప్రదేశ్ తూర్పు, దక్షిణ, మధ్య ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థలు వాటి పేర్లతోనే మొబైల్ యాప్‌లు రూపొందించాయి. వీటి ద్వారా కొత్త సర్వీసులు, బిల్లు చెల్లింపులు వంటి సేవలు అందిస్తున్నాయి. ఆన్‌లైన్‌లోనూ ఇంటి నుంచే బిల్లు చెల్లించే అవకాశం లభించింది. ఫలితంగా లేట్ పేమెంట్ సర్ చార్జీల భారం తప్పుతుంది. మాకు చెప్పండి డిస్కంల యాప్‌లు, యూపీఐ యాప్‌ల ద్వారా గానీ, నేరుగా గానీ బిల్లు చెల్లించాలే తప్ప ఇతర మార్గాల్లో ప్రయత్నించవద్దు. విద్యుత్ శాఖ ఎవరికీ మెసేజ్‌లు పంపదు. ఫోన్ చేయమని అస్సలు అడగదు. లైన్మెన్ స్వయంగా ఇంటికి వచ్చి నోటీసు ఇస్తారు. ఎవరైనా గుర్తుతెలియని వ్యక్తుల ద్వారా మెసేజ్‌లు వస్తే 1912 కాల్ సెంటర్‌కు సమాచారం అందించాలి. – బి.మల్లారెడ్డి, విజిలెన్స్ జేఎండీ, ఏపీట్రాన్స్కో -
ఎఫ్‌పీవోలో రాందేవ్‌బాబా ప్రభంజనం!.. రంగంలోకి దిగిన మోసగాళ్లు?
న్యూఢిల్లీ: దివాలా ప్రక్రియలో భాగంగా 2019లో వేలానికి వచ్చిన రుచి సోయాను బాబా రామ్‌దేవ్ సారథ్యంలోని పతంజలి ఆయుర్వేద్ రూ. 4,350 కోట్లకు కొనుగోలు చేసింది. అప్పటి నుంచి రుచి సోయా బ్రాండ్‌పై పతంజలి తనదైన ముద్రను వేయగలిగింది. తాజాగా రుచి సోయా బ్రాండ్ విస్తరణలో భాగంగా ఫాలో ఆన్ పబ్లిక్ ఆఫర్‌కు వస్తోంది రుచి సోయా. ఫుల్ డిమాండ్ దాదాపు రూ. 4,300 కోట్లు సమీకరించేందుకు రుచి సోయా ఇండస్ట్రీస్ తలపెట్టిన ఫాలో అన్ పబ్లిక్ ఆఫర్ (ఎఫ్‌పీవో) మార్చి 24న ప్రారంభమైంది. ఈ ఎఫ్‌పీవో రికార్డు స్థాయింలో 3.60 రెట్లు సబ్స్క్రయిబ్ అయ్యింది. యాంకర్ ఇన్వెస్టర్ల నుంచి కంపెనీ రూ.1,290 కోట్లు సమీకరించింది. బీఎస్ఈ గణాంకాల ప్రకారం 4.89 కోట్ల షేర్లను విక్రయానికి ఉంచగా 17.60 కోట్ల షేర్లకు బిడ్లు వచ్చాయి. క్వాలిఫైడ్ ఇనిస్టిట్యూషనల్ బయర్స్ (క్యూఐబీ) కోటా 2.20 రెట్లు, సంస్థగతయేతర ఇన్వెస్టర్ల కోటా 11.75 రెట్లు సబ్స్క్రయిబ్ అయ్యింది. రిటైల్ ఇన్వెస్టర్ల కోటా 90 శాతం సబ్స్క్రయిబ్ అయ్యింది. ఎఫ్‌పీవో కింద షేరు ధర శ్రేణి రూ. 615–650గా ఉంది. ఏమార్చే ప్రయత్నం పతంజలి బ్రాండ్‌కు ఉన్న విలువ, బాబారాందేవ్ మీద నమ్మకంతో రిటైల్ ఇన్వెస్టర్లు కూడా ఈ షేర్ల కోసం ఆసక్తి చూపిస్తున్నారు. ఈ క్రమంలో రుచి సోయా షేర్లను మార్కెట్ ధరకే తక్కువగా దాదాపు 30 శాతం డిస్కౌంట్‌తో అందిస్తామంటూ పర్సనల్ నంబర్లకు, సోషల్ మీడియాలో మెసేజ్‌లు భారీ ఎత్తున తిరుగుతున్నాయి. ఈ షేర్లు సొంతం చేసుకోవాలంటే మీ యూపీఐ, బ్యాంక్ ఖాతా, డిమ్యాట్ ఖాతా, బ్రోకర్ ద్వారా దరఖాస్తు చేసుకోండంటూ ఆయా మెసేజ్‌లలో కోరుతున్నారు. హరిద్వార్‌లో ఫిర్యాదు డిస్కౌంట్ ధరకే రుచి సోయా షేర్లు అందిస్తామంటూ చక్కర్లు కొడుతున్న మెసేజ్‌లపై పతంజలి గ్రూపు స్పందించింది. డిస్కౌంట్ ధరలో రుచి సోయా షేర్ల పేరుతో వస్తున్న మెసేజ్‌కి పతంజలి గ్రూపు డైరెక్టర్లు, ప్రమోటర్లు, ప్రమోటర్ గ్రూప్‌కి సంబంధం లేదని.. ఈ ఫేక్ మెసేజ్‌లపై దర్యాప్తు జరిపి తగు చర్యలు తీసుకోవాలని పోలీసు శాఖని కోరింది పతంజలి గ్రూపు. ఈ మేరకు 2022 మార్చి 27న హరిద్వార్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా పోలీసులు 0188 నంబరుతో ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. అప్రమత్తమైన సెబీ రుచి సోయా పేరుతో చక్కర్లు కొడుతున్న మెసేజ్‌పై సెక్యూరిటీస్ అండ్ ఎక్సేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (సెబీ) అప్రమత్తమైంది. ఫేక్ మెసేజ్‌పై ప్రజలను అప్రమత్తం చేసేందుకు పత్రికా ప్రకటనలు ఇవ్వాలంటూ రుచి సోయా ప్రమోటర్లకు సెబీ సూచించింది. ఈ మేరకు సర్క్యులర్ జారీ చేసింది. మరోవైపు ఎఫ్‌పీవోలో ఈ షేర్ల కొనుగోలు విషయంలో పునరాలోచన చేసుకునే అవకాశాన్నివ ఇన్వెస్టర్లకు కల్పించింది. బంపర్ హిట్ మంగళవారం మార్కెట్లో రుచి సోయా షేరు ధర దూసుకుపోయింది. ఉదయం 11 గంటల సమయంలో 102 పాయింట్లు లాభపడి 915 దగ్గర ట్రేడవుతోంది. -
కలెక్టర్ పేరుతో జిల్లా అధికారులకీ మెసేజ్‌లు.. డబ్బులు పంపించాలని ఆదేశాలు
పై చిత్రం చూశారా.. బీసీ సంక్షేమ అధికారి డి.కీర్తి సెల్‌ఫోన్‌కు వాట్సాప్ ద్వారా వచ్చిన సందేశం. కలెక్టర్ ఎ.సూర్యకుమారి ఫొటోను డీపీగా వాడి ఫేక్ నంబర్ నుంచి మెసేజ్ వచ్చింది. ఆమె ఒక్కరికే కాదు జిల్లాలోని అన్ని శాఖల అధికారులకు, ఎంపీడీఓలకు ఇలాంటి ఫేక్ మెసేజ్‌లే వచ్చాయి. సాక్షి ప్రతినిధి, విజయనగరం: కలెక్టర్ పేరుతో వివిధ ఫోన్నంబర్లతో జిల్లా అధికారులందరికీ ఒకేసారి మెసేజ్‌లు రావడం సోమవారం కలకలం రేపింది. సైబర్ నేరగాళ్లు 94391 40791, 94391 40733, 94391 39978, 73812 76244 నంబర్ల నుంచి వాట్సాప్‌లో అధికారులతో చాటింగ్‌ను కొనసాగించారు. విధి నిర్వహణకు సంబంధించిన ప్రశ్నలు వేసిన తర్వాత ఆ నంబర్లను ఫోన్లో పర్సనల్‌గా సేవ్ చేసుకోవాలని సూచించారు. తర్వాత కొద్దిసేపటికే డబ్బులు పంపించాలని ఆదేశాలు ఇవ్వడం ప్రారంభించారు. ఈ వాట్సాప్ మేసెజ్‌లు సోమవారం ఉదయం కలెక్టరేట్లో కాసేపు సంచలనం సృష్టించాయి. వాట్సాప్ మెసేజ్‌లు అందుకున్న అధికారుల్లో చాలామంది గ్రీవెన్స్ సెల్ కార్యక్రమానికి హాజరయ్యారు. కలెక్టర్ సూర్యకుమారి ఎదురుగానే ఉన్నారు. ఆమె చేతిలో సెల్‌ఫోన్ లేదు. చాటింగ్ ఎలా చేస్తున్నారనే అనుమానం వచ్చి వెంటనే కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. తానెప్పుడూ వాట్సాప్ గ్రూప్‌లకు తన ఫొటోను డీపీగా ఉంచలేదని, తన ఫొటోతో ఉన్న వాట్సాప్ నంబర్లను వెంటనే బ్లాక్ చేయాలని అధికారులకు మైక్‌లో సూచించారు. అధికారికంగా ప్రభుత్వం కేటాయించిన నంబరు మినహా ఎలాంటి పర్సనల్ నంబర్లు లేవని, అందరూ గుర్తించి ఫేక్ మెసేజ్‌లతో మోసపోవద్దని సూచిస్తూ జిల్లా యంత్రాంగానికి వెంటనే సందేశం పంపించారు. చదవండి: (మరీ ఇంత దారుణమా: ఆస్తులు రాయించుకుని..) కటక్‌లో ఉన్న కేటుగాళ్లు... ఫేక్ మెసేజ్‌ల విషయాన్ని వెంటనే ఎస్పీ దీపిక దృష్టికి కలెక్టర్ తీసుకెళ్లారు. ఆమె వెంటనే స్పందించి పోలీసులను అప్రమత్తం చేశారు. ఫేక్ మెసేజ్‌లు పంపినవారిపై క్రిమినల్ కేసు నమోదు చేయాలని అభ్యర్థిస్తూ ఆరుగురు ఉద్యోగులు విజయనగరం ఒకటో పట్టణ పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదుచేశారు. సెల్‌ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా ఆ ఫోన్ నంబర్లను వాడినవారి ఆచూకీని పోలీసులు కనిపెట్టారు. వారు కటక్‌లో ఉన్నట్టుగా అంచనాకు వచ్చారు. వారిని పట్టుకునేందుకు ప్రత్యేక పోలీస్ బృందం కటక్‌కు బయల్దేరినట్లు తెలిసింది. అప్రమత్తంగా ఉండాలి కలెక్టర్ ప్రొఫైల్‌తో జిల్లా ఉన్నతాధికారులకు వాట్సాప్ మెసేజ్‌లు వచ్చాయి. వాటితో జిల్లా యంత్రాంగానికి ఎలాంటి సంబంధం లేదు. వాట్సాప్ ద్వారా వచ్చే ఆదేశాలు, సూచనలను ఎవ్వరూ పట్టించుకోవద్దు. ఇలాంటి ఫేక్ నంబర్ల పట్ల అధికారులు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. ఇప్పటికే పోలీసులకు ఫిర్యాదు చేశాం. ఇంకా ఎవరికైనా అలాంటి మెసేజ్‌లు వస్తే ఉన్నతాధికారులకు సమాచారం ఇవ్వండి. ఫేక్ మేసెజ్‌లకు బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. – ఎ.సూర్యకుమారి, కలెక్టర్ -
ఎస్బీఐ ఖాతాదారులకు అలర్ట్..!
ప్రభుత్వ దిగ్గజ బ్యాంకింగ్ సంస్థ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ) తన ఖాతాదారులను హెచ్చరించింది. బ్యాంకు ఖాతాదారులకు పలు బూటకపు మెసేజ్‌లను వారి మొబైల్ నంబర్లకు, ఈ-మెయిల్ అకౌంట్లకు సైబర్ నేరస్థులు పంపుతుంటారు. ఒక వేళ ఫోన్లకు, ఈ-మెయిల్‌కు వచ్చే మెసేజ్‌లను నమ్మితే అంతే సంగతులు...! ఖాతాదారుల అకౌంట్లలోని డబ్బులను సైబర్ నేరస్థులు సమస్తం ఉడ్చేస్తారు. తన ఖాతాదారులను అప్రమత్తం చేయడానికి ఎస్బీఐ పలు సూచనలను చేసింది. బూటకపు మెసేజ్‌లు, ఇతర ఫిషింగ్ మోసాల నుంచి ఎప్పటికప్పుడు ఎస్బీఐ తన ఖాతాదారులను అప్రమత్తం చేయడంలో ఒక అడుగు ముందే ఉంటుంది. తాజాగా ఎస్బీఐ తన ఖాతాదారులకు బూటకపు మేసేజ్‌లను గుర్తించడంలో పలు సూచనలు చేసింది. ఖాతాదారులకు వచ్చే సందేశాలు బ్యాంకు పంపిందా లేదా.. అనే విషయాన్ని ఏలా ధృవీకరించాలనే విషయాన్ని ఎస్బీఐ పేర్కొంది. ఎస్బీఐ తన ఖాతాదారులకు కేవలం ‘SBI/SB’ అనే షార్ట్కోడ్స్ను ఉపయోగించి మాత్రమే మొబైల్ నంబర్‌కు మేసేజ్‌లను పంపుతుందని ట్విటర్లో పేర్కొంది. ఉదాహరణకు SBIBNK, SBIINB, SBIPSG, SBIYONO లాంటి మేసేజ్‌లు బ్యాంకు పంపినట్లుగా ఖాతాదారులు ధృవీకరించాలని ఎస్బీఐ పేర్కొంది. ఇతర గుర్తుతెలియని మెసేజ్‌లను అసలు ఒపెన్ చేయకుండా ఉండడమే మంచిదని ఎస్బీఐ పేర్కొంది. Always check who's behind the door before letting anyone in. Here is your key to safety.#SafeWithSBI #CyberSafety #StayAlert #StaySafe #SBI #StateBankOfIndia pic.twitter.com/6FbFgP6Y2t — State Bank of India (@TheOfficialSBI) July 27, 2021 -
ఐటీ రిఫండ్ ఎస్ఎంఎస్లు : తాజా హెచ్చరిక
సాక్షి, న్యూఢిల్లీ: పన్ను చెల్లింపుదారులను ఆకట్టుకునేందుకు ఐటీ రిఫండ్స్ పేరుతో ఒక ఫేక్ మెసేజ్ ఒకటి హల్ చల్ చేస్తోందిట. ప్రజలను మోసగించేందుకు భారీ ఎత్తున ఐటీ రిఫండ్ వచ్చిందనే మెసేజ్‌లను సైబర్ నేరగాళ్లు పంపుతున్నారని, వీటిపట్ల అప్రమత్తంగా ఉంటాలంటూ సూచనలు జారీ అయ్యాయి. ఆదాయ పన్ను శాఖ పేరుతో వస్తున్న 'SMShing' మెసేజ్లపట్ల అప్రమత్తంగా ఉండాలని దేశంలోని ప్రధాన సైబర్ సెక్యూరిటీ ఏజెన్సీ (CERT-In) హెచ్చరించింది. ఇలాంటి హానికరమైన మెసేజ్‌లు ఇటీవల ప్రజలకు బాగా చేరుతున్నాయని తెలిపింది. ఐటీ రిఫండ్స్ వచ్చాయంటూ మెసేజ్ వస్తుంది. ఆ లింక్ చేస్తే.. ఒక నకిలీ పేజీ ఒకటి ఓపెన్ అవుతుంది. ఐటీ రిఫండ్ పొందాలంటే.. బ్యాంకు వివరాలు, ఐడి, పాస్వర్డ్, ఎంటర్ చేయమని అడుగుతుంది. దీంతో బాధితుడి వివరాలను సైబర్ నేరగాళ్లు తస్కరిస్తారని పేర్కొంది. సోషల్ మీడియా ప్లాట్‌ఫాంలో ఈ ఫేక్ మెసేజ్‌లు షేర్ అవుతున్న నేపథ్యంలో ఈ అలర్ట్ జారీ చేసింది. తద్వారా వారి ముఖ్యమైన వ్యక్తిగత వివరాలు సేకరించి అమ్మకానికి పెడుతున్నారని వివరించింది. సోషల్ మీడియా ద్వారా ఎస్ఎంఎస్షింగ్(ఎస్ఎంఎస్అండ్ ఫిషింగ్) అనే లింకుపై ఒక వ్యక్తి క్లిక్ చేసినపుడు, వారి వ్యక్తిగత వివరాలు చోరో అవడంతోపాటు, ఇ-ఫైలింగ్ క్రెడెన్షియల్స్ కూడా హ్యాక్ అవుతున్నాయనేది ఐటి శాఖ రికార్డుల ద్వారా గుర్తించినట్టు చెప్పారు. ఇలాంటి అనుమానాస్పద సందేశాలకు సమాధానాలు ఇవ్వడంగానీ, ఈమెయిల్స్లను, లింక్‌లు, ఓపెన్ చేయడంలాంటివిగానీ చేయొద్దని హెచ్చరించింది. హైపర్లింక్లపై క్లిక్ చేసే బ్యాంక్ ఖాతా, క్రెడిట్‌కార్డుకు సంబంధించిన ఇతర వివరాలేవీ ఎంటర్ చేయకూడదని తెలిపింది. అలాగే మొంబైల్ ఫోన్లు, ఇతర డివైస్‌లో యాంటీ వైరస్ సాఫ్ట్వేర్లను వాడాలని సూచించింది. మరోవైపు ఈ చోరీపై ఆదాయపన్ను అధికారి స్పందిస్తూ ఎస్ఎంఎస్ ఆధారిత మోసం తమ దృష్టికి వచ్చినట్టు చెప్పారు. ఈ మోసంపై పన్నుచెల్లింపుదారులను అప్రమత్తం చేసేందుకు కెర్ట్ అధికారులతో నిరంతరం సంప్రదిస్తున్నట్టు తెలిపారు.ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు సీజన్ కావడంతో కెర్ట్ ఈ హెచ్చరిక చేసింది. ప్రత్యక్ష పన్నుల సెంట్రల్ బోర్డ్ (సీబీడీటీ) ఆదాయ పన్ను దాఖలు గడువును ఆగస్టు 31వరక పొడిగించిన సంగతి తెలిసిందే. -
సోషల్ మీడియా దాడులు.. కాంగ్రెస్‌లో కలకలం!
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ పార్టీతో కొందరు ‘సోషల్ మీడియా’గేమ్ ఆడుతున్నారు. కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నట్టుగా అధికార టీఆర్ఎస్ పార్టీ నేతలో, మరెవరో అన్న దానిపై స్పష్టత లేదుగానీ.. కాంగ్రెస్‌ను ఇరుకున పెట్టేలా ‘మైండ్ గేమ్’ఆడుతున్నారు. కొద్దిరోజుల కింద రాష్ట్రంలోని 60 అసెంబ్లీ నియోజకవర్గాల్లో కాంగ్రెస్ ప్రాబబుల్స్ జాబితా అంటూ సోషల్ మీడియాలో ఓ జాబితా చక్కర్లు కొడితే.. తాజాగా పార్టీ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్ ట్వీటర్ ఖాతా పేరిట పార్టీకి వ్యతిరేకంగా పోస్టులు పెట్టి కలకలం సృష్టించారు. దీంతో కాంగ్రెస్ నేతలు పోలీసులను ఆశ్రయించాల్సి వచ్చింది. మొన్న జాబితా.. నేడు ఫిరాయింపు సోషల్ మీడియాను వేదికగా చేసుకున్న కొందరు కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేసి పోస్టులు పెడుతున్నారు. గత సోమవారం వాట్సాప్‌లో రెండు పేజీలతో కూడిన ఓ జాబితా వైరల్ అయింది. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రాబబుల్స్ అంటూ 60 అసెంబ్లీ స్థానాలకు 66 మంది పేర్లను ఆ జాబితాలో పెట్టారు. ఇందులో చనిపోయిన వారి పేర్లు, కనీసం పరిగణనలో కూడా లేని పేర్లు ఉన్నాయి. అయినా ఆయా స్థానాల్లో టికెట్ ఆశిస్తున్న కాంగ్రెస్ నేతలు, రాజకీయ వర్గాల్లో తీవ్ర స్థాయిలో చర్చ మొదలైంది. నాయకుల్లో కంగారు మొదలైంది. దీంతో ఆ జాబితాకు, పార్టీకి సంబంధం లేదని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి వెంటనే ప్రకటన చేయాల్సి వచ్చింది. ఈ హడావుడి ముగిసిందో లేదో మరో వివాదాస్పద పోస్టు వెలుగులోకి వచ్చింది. కాంగ్రెస్‌లో రెడ్ల ఆధిపత్యం నడుస్తోందంటూ.. కాంగ్రెస్ రాష్ట్ర అధికార ప్రతినిధి, బీసీ నాయకుడు దాసోజు శ్రవణ్‌కుమార్ పేరిట ట్వీటర్లో ఓ పోస్టు ప్రత్యక్షమైంది. ‘కాంగ్రెస్ పార్టీలో బీసీలకు తీవ్ర అన్యాయం జరుగుతోంది. రెడ్ల ఆధిపత్యంలో ఇమడలేక పార్టీ వీడాలని నిర్ణయించుకున్నా..’’అని ఆ పోస్టులో ఉండడంతో.. శ్రవణ్ నిర్ఘాంతపోయారు. తనకు సంబంధం లేకుండా, తన పేరిట ట్వీటర్లో చేసిన ఈ పోస్టింగ్‌పై ఆయన పోలీసులను ఆశ్రయించారు. మాజీ ఎంపీ అంజన్‌కుమార్‌యాదవ్‌తో కలసి సీసీఎస్ డీసీపీ అవినాశ్ మహంతికి లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేశారు. మొత్తంగా వరుసగా జరుగుతున్న ‘సోషల్ మీడియా’దాడులతో రాష్ట్ర కాంగ్రెస్‌లో కలకలం మొదలైందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. టీఆర్ఎస్ హస్తముందంటున్న కాంగ్రెస్ అయితే వివాదాస్పద పోస్టింగుల వెనుక అధికార టీఆర్ఎస్ హస్తం ఉందని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు. కుట్ర రాజకీయాలు చేస్తూ తప్పు ప్రచారాలు చేస్తున్నారని పేర్కొంటున్నారు. కానీ ఈ నకిలీ జాబితాలు, పోస్టింగుల వెనుక ఎవరున్నారనేది పోలీసులే తేల్చాల్సి ఉంది. టీఆర్ఎస్ చిల్లర రాజకీయాలు: శ్రవణ్ తన ప్రతిష్టకు భంగం కలిగించేలా తప్పుడు పోస్టింగులు పెట్టిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ బుధవారం పోలీసులకు ఫిర్యాదు చేసిన దాసోజు శ్రవణ్ అనంతరం మీడియాతో మాట్లాడారు. టీఆర్ఎస్ చిల్లర రాజకీయాలు చేస్తోందని విమర్శించారు. ఇప్పుడే ఎదుగుతున్న బీసీ నాయకుడినైన తనను అణచివేసేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. జయశంకర్ అడుగు జాడల్లో, మారోజు వీరన్న సిద్ధాంతాలతో ముందుకు వెళుతున్న తన ఉద్యమ స్ఫూర్తిని ఈ చిల్లర ప్రచారాలు ఆపలేవన్నారు. ఇలాంటి తప్పుడు విధానాలకు తెలంగాణ సమాజం పట్టం కట్టదన్న విషయాన్ని టీఆర్ఎస్ నేతలు గ్రహించాలని వ్యాఖ్యానించారు. -
ఫేక్ మెసేజ్ తెచ్చిన తంటా!
సైబర్ బాధితులు రోజురోజుకీ పెరిగిపోతున్నారు. ఈ లిస్ట్‌లో తాజాగా అందాల భామ అనుష్కశర్మ కూడా చేరడం బాలీవుడ్లో చర్చనీయాంశమైంది. ఆకతాయిలు చేసిన అల్లరి పని వల్ల బాలీవుడ్ నటుడు, నిర్మాత కమల్ ఆర్. ఖాన్ని అనవసరంగా నిందించి, చటుక్కున నాలిక కరుచున్నారు అనుష్క. వివరాల్లోకెళితే... మహిళలపై జరుగుతున్న వేధింపుల నేపథ్యంలో దర్శకుడు అనురాగ్ కశ్యప్ ‘దట్డే ఆఫ్టర్ ఎవ్విరిడే’ అనే లఘు చిత్రాన్ని తెరకెక్కించారు. ఆ లఘుచిత్రం విపరీతంగా నచ్చేయడంతో ‘అనురాగ్ ప్రయత్నం చాలా బాగుంది’ అని ట్విట్టర్ ద్వారా అభినందించారు అనుష్క. ఎప్పుడైతే ట్విట్టర్లో అనుష్క ఈ మెసేజ్ పోస్ట్ చేశారో... అప్పట్నుంచీ ఈ ముద్దుగుమ్మకు వేధింపులు మొదలయ్యాయి. కమల్ ఆర్ ఖాన్ పేరు మీద ఉన్న ఫేక్ ట్విట్టర్ ఎకౌంట్ ఈ వేధింపులకు సాధనం అయ్యింది. అనురాగ్ కశ్యప్‌తో అక్రమ సంబంధాన్ని అంటగడుతూ చాలా అసభ్యకరంగా మెసేజ్‌లు రావడం మొదలయ్యాయి. ఈ మెసేజ్‌లు చూసి ఖంగు తినడం అనుష్క వంతైంది. ఇంకేముందీ... కమల్ ఖానే ఈ మెసేజ్‌లను పోస్ట్ చేశాడనుకొని తనకు ఘాటుగా రిప్లయ్ ఇచ్చింది అనుష్క. ఆమెతో పాటు ఆమె అభిమానులు కూడా ఖాన్‌పై విరుచుకుపడ్డారు. దీన్ని చూసి ఖంగు తిన్న ఖాన్... అసలు విషయం చెప్పడంతో నాలిక కరుచుకోవడం అనుష్క వంతైంది. వెంటనే ఖాన్ని క్షమాపణ కోరారు అనుష్క. ఈ ఆకతాయి పని చేసిన వారిని పట్టుకునే పనిలో ప్రస్తుతం క్రైమ్‌బ్రాంచ్ పోలీసులు ఉన్నారు.