
సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. రోజురోజుకు సైబర్ నేరాల సంఖ్య పెరిగిపోతోంది. ఏదో రకంగా కేటుగాళ్లు.. ప్రజలను బురిడీ కొట్టించి.. డబ్బులు దండుకుంటున్నారు. తాజాగా తెలంగాణలో మరో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది.
తెలంగాణ డీజీపీ మహేందర్ రెడ్డిని సైతం సైబర్ నేరగాళ్లు వదలలేదు. 97857 43029 నెంబర్‌కు డీజీపీ డీపీ పెట్టి కేటుగాళ్లు మోసాలను తీర లేపారు. పోలీసు ఉన్నతాధికారులు, ప్రముఖులు, సామాన్యులకు డీజీపీ పేరుతో సైబర్ నేరగాళ్లు మెసేజ్‌లు పంపుతున్నారు. దీనిపై ఆరా తీసిన సైబర్ క్రైమ్ పోలీసులు.. అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కాగా, ఈ నేరాలపై దర్యాప్తు చేపట్టాలని డీజీపీ మహేందర్ రెడ్డి పోలీసులను ఆదేశించారు.
ఇది కూడా చదవండి: 1,518 సివిల్ కేసుల పరిష్కారం
Comments
Please login to add a commentAdd a comment