
బంగారు వేలాన్ని అడ్డుకున్న వైఎస్సార్ సీపీ నాయకులు
రైతులతో కలిసి బ్యాంకు ముట్టడి
ఉరవకొండ: ఉరవకొండ స్టేట్‌బ్యాంకు పరిధిలో బంగారు తాకట్టు పెట్టి రుణాలు తీసుకున్న రైతులు రుణాలు చెల్లించకపోవడంతో వారి బంగారాన్ని శనివారం బ్యాంకు అధికారులు వేలం పాట నిర్వహించారు. విషయుం తెలుసుకుని బాధిత రైతులతో కలిసి వైఎస్‌ఆర్‌సీపీ, సీపీఎం నాయుకులు బ్యాంకును వుుట్టడించారు. అనంతరం బ్యాంకు మేనేజర్ రాజేంద్రన్‌తో వైఎస్‌ఆర్‌సీపీ రాష్ట్ర కార్యదర్శిలు రాకెట్ల అశోక్, ఎగ్గుల శ్రీనివాసులు, బసవరాజులు, సీపీఎం వుండల కార్యదర్శి రంగారెడ్డి వూట్లాడుతూ తీవ్ర కరువుతో రైతులు రుణాలు చెల్లించలేని పరిస్థితుల్లో ఉన్నారని, పంటలు పండక పెట్టుబడులు కుడా వెనక్కి రాని దుస్థితి నెలకొందన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో రుణాలు చెల్లించాలని రైతుల పై ఒత్తిడి తెచ్చి, వారి ఆత్మాభివూనం దెబ్బతినేలా బంగారాన్ని వేలం వేయుడం సరైంది కాదన్నారు.
చంద్రబాబు ప్రభుత్వం రైతు రుణమాఫీ పేరుతో రైతులను తీవ్రంగా మోసగించిందని, చివరకు రుణమాఫీ కాక రైతులు అప్పుల పాలయ్యూరని తెలిపారు. అనంతరం బ్యాంకు మేనేజర్ వూట్లాడుతూ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకే తావుు వేలం వేస్తున్నావుని, రైతులంతా కలిసి ఒక ఆర్జీ ఇస్తే వాటిని ఉన్నతాధికారులకు పంపి, వారి ఆదేశాల మేరకు తదుపరి చర్యలు తీసుకుంటావున్నారు.