అదానీ గ్రూప్ స్టాక్స్‌లో విదేశీ పెట్టుబడులకు సంబంధించి గతంలోనే హిండెన్‌బర్గ్ రీసెర్చ్ చేసిన ఆరోపణలు ఇంకా చల్లారకముందే ఇలాంటి ఆరోపణలు చేస్తూ 'ఆర్గనైజ్డ్ క్రైమ్ అండ్ కరప్షన్ రిపోర్టింగ్ ప్రాజెక్ట్' (OCCRP) రిపోర్ట్ బయటకు వచ్చింది. ఇందులో అదానీ కుటుంబానికి సన్నిహితులైన కొందరు మారిషస్ ఫండ్స్ ద్వారా పెట్టుబడులు పెట్టినట్లు తెలిసింది. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.
నివేదికల ప్రకారం.. మల్టిపుల్ టాక్స్ హెవెన్ సంస్థలను వాడుకుని ఆదానీ లిస్టెడ్ స్టాక్స్‌లో పెట్టుబడులు పెట్టినట్లు హిండెన్‌బర్గ్ గతంలో ఆరోపించింది. కాగా ఇప్పుడు తాజాగా ఓసీసీఆర్పీ కూడా ఇదే ఆరోపించింది. ఈ రిపోర్టులన్నీ నిరాధారమైనవని, పెట్టుబడిదారులను తప్పుదోవ పట్టించే విధంగా ఉన్నట్లు ఆదానీ హిండెన్‌బర్గ్ తర్వాత వెల్లడించాడు.
హిండెన్‌బర్గ్ రిపోర్ట్ తరువాత ఆదానీ గ్రూప్ కంపెనీలు తమ మార్కెట్లో విలువలో 150 మిలియన్ డాలర్లను కోల్పోయాయి. కాగా ఇప్పుడు వెలువడిన రిపోర్ట్ కూడా హిండెన్‌బర్గ్ రిపోర్ట్ మాదిరిగానే నిరాధారంగా ఉందని ఆదానీ గ్రూప్ వెల్లడించింది.
అదానీ గ్రూప్‌కి సంబంధించిన పబ్లిక్ లిస్టెడ్ కంపెనీలు తమ షేర్ హోల్డింగ్‌లకు సంబంధించి కావలసిన చట్టాలకు లోబడి ఉన్నట్లు స్పష్టం చేసింది. కాగా గతంలో వెలువడిన హిండెన్‌బర్గ్ రిపోర్ట్ మీద ఇప్పటికీ సెబీ దర్యాప్తు చేస్తూనే ఉంది. కాగా తాజా నివేదికలు మరింత కలకలం రేపుతున్నాయి.
ఇదీ చదవండి: క్షమాపణలు చెప్పిన ఆనంద్ మహీంద్రా! రాఖీ పండుగ వేళ..
ఇదిలా ఉండగా ఈ రోజు స్టాక్ మార్కెట్లు ప్రారంభమైన కొంత సేపటికే అదానీ గ్రూప్ స్టాక్‌లు రెడ్ జోన్‌లోకి జారిపోయాయి. అదానీ పవర్ షేర్లు 3 శాతానికి పైగా నస్టపాయాయి. అదానీ ట్రాన్స్‌మిషన్ షేర్ ధర 3.3 శాతానికి పడిపోయింది. అదానీ ఎంటర్‌ప్రైజెస్ షేర్ ధర 2.50 శాతం మేర నష్టపోగా, అదానీ గ్రీన్ ఎనర్జీ , అదానీ టోటల్ గ్యాస్ 2.25 శాతం మేర నష్టపోయాయి.
Comments
Please login to add a commentAdd a comment