హైదరాబాద్: తెలుగు భాషను, సంస్కృతిని ప్రతిబింబించే విధంగా మారిషస్ లో తెలుగు భాషా బ్రహ్మోత్సవాలను నిర్వహించనున్నారు. ఆగష్టు 27 వ తేదీ నుంచి 29 వరకు ఈ ఉత్సవాలను జరపనున్నారు. ఈ ఉత్సవాల్లో ముఖ్యఅతిథిగా ప్రముఖ విద్యావేత్త వాసిరెడ్డి అమర్నాథ్ పాల్గొననున్నారు. ఈ మేరకు మారిషస్ ప్రభుత్వం ఆయనను ఆహ్వానించింది.
ప్రపంచంలోని తెలుగు మాట్లాడే వివిధ దేశాలకు చెందిన వారందరినీ ఒక తాటిపై తెచ్చేందుకు ఏర్పాటు చేసిన 'తెలుగు డయాస్పోరా ఇంటర్నేషనల్ ' అనే సంస్థను ఈ సందర్భంగా అమర్ నాథ్ ప్రారంభిస్తారు. అదేవిధంగా అక్కడి అధ్యాపకులు, విద్యార్థులను ఉద్దేశించి ఆయన ప్రసగించనున్నారు.
బ్రహ్మోత్సవాల్లో భాగంగా మారిషస్ లోని వేంకటేశ్వర ఆలయంలో తెలుగు సంస్కృతికి అద్దంపట్టేలా భజనలు, కోలాటాలు, అన్నమాచార్య కీర్తనలు, సామూహిక పూజలు, తెలుగులో పోటీల వంటి పలు కార్యక్రమాలను దేశమంతటా వైభవంగా నిర్వహించనున్నారు.
మారిషస్ లో తెలుగు భాషా బ్రహ్మోత్సవాలు
Published Tue, Aug 25 2015 2:08 PM | Last Updated on Sun, Sep 3 2017 8:07 AM
Advertisement