మారిషస్ కమర్షియల్ బ్యాంక్‌తో సమస్యను పరిష్కరించుకుంటాం
కోర్టుకు నివేదించిన ‘సుజనా’ ఎండీ l
చివరి అవకాశమిచ్చిన న్యాయస్థానం
సాక్షి, హైదరాబాద్: మారిషస్ కమర్షియల్ బ్యాంకు(ఎంసీబీ)కి చెల్లించాల్సిన రుణ వ్యవహా రంలో పది రోజుల గడువివ్వాలని సుజనా యూనివర్సల్ ఇండస్ట్రీస్ ఎండీ గురువారం కోర్టును అభ్యర్థించారు. ఈలోపు ఆ బ్యాంకుతో ఉన్న రుణ సమస్యలను పరిష్కరించుకుం టామన్నారు. ఇందుకు అంగీకరించిన కోర్టు.. ఇదే చివరి అవకాశమని స్పష్టం చేస్తూ తదుపరి విచారణను ఈ నెల 13కు వాయిదా వేసింది. ఈ మేరకు సిటీ సివిల్ కోర్టు 11వ అదనపు చీఫ్ జడ్జి ఉత్తర్వులు జారీ చేశారు. మారిషస్‌లో హేస్టియా పేరుతో ఓ డొల్ల కంపెనీని ఏర్పాటు చేసి 2010లో ఎంసీబీ నుంచి రూ.100 కోట్ల మేర రుణం తీసుకున్నారు.
ఈ లావాదేవీలో సుజనా యూనివర్సల్ ఇండస్ట్రీస్ హామీదారుగా ఉంది. రుణానికి సంబంధించి ఎంసీబీకి, హేస్టియాకు మధ్య రాతపూర్వక ఒప్పందం కూడా జరిగింది. 2012 నుంచి ఎంసీబీకి హేస్టియా బకాయి చెల్లించడం మానేసింది. బకాయిలపై స్పందిం చాలంటూ హేస్టియాకు ఎంసీబీ ఎన్ని లేఖలు రాసినా ప్రయోజనం లేకపోయింది. దీంతో మారిషస్ కమర్షియల్ బ్యాంక్.. సుజనా, దాని ప్రతినిధులు తమను ఉద్దేశపూర్వకంగా మోసం చేశారంటూ కోర్టును ఆశ్రయించింది. ‘సుజ నా’పై కేసు దాఖలు చేశారు.
దీనిపై విచారణ జరిపిన న్యాయస్థానం.. సుజనా యూనివర్సల్ అధినేత, కేంద్రమంత్రి సుజనాచౌదరితో పాటు ఆ కంపెనీ ఎండీ తదితరులను వ్యక్తిగతంగా కోర్టులో హాజరుకావాలని ఆదేశాలిచ్చింది. ఈ ఆదేశాలపై సుజనాచౌదరి హైకోర్టును ఆశ్రయిం చి.. వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు తెచ్చుకున్నారు. గురువారం సుజనా యూనివ ర్సల్ ఎండీ శ్రీనివాసరాజు కోర్టు ముందు హాజరయ్యారు. తమకు 10 రోజుల గడువు ఇవ్వాలని, ఆ లోపు ఎంసీబీతో రుణ సమస్యను పరిష్కరించుకుంటామని తెలిపారు.
పది రోజుల గడువివ్వండి
Published Fri, Mar 3 2017 1:26 AM | Last Updated on Tue, Oct 16 2018 2:36 PM
Advertisement
Advertisement