
మారిషస్‌లో 108 అడుగుల శ్రీవారి విగ్రహం
సాక్షి, తిరుమల: మారిషస్ దేశంలో 108 అడుగుల ఎత్తయిన శ్రీవేంకటేశ్వరస్వామి విగ్రహాన్ని ప్రతిష్ఠించనున్నట్లు అక్కడి హరిహర దేవస్థానం చైర్మన్, కేబినెట్ ఓఎస్‌డీ పార్థసారథి తెలిపారు. శనివారం ఉదయం ఆయన మారిషస్ ప్రభుత్వ కేబినెట్ సెక్రటరీ సురేష్ చంద్రతో కలిసి శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం ఆలయం వెలుపల పార్థసారథి మీడియాతో మాట్లాడారు. ఈ ఏడాది డిసెంబరులో కుంభాభిషేకం చేసి అంగరంగ వైభవంగా విగ్రహాన్ని ప్రతిష్ఠించనున్నామని తెలిపారు. అనంతరం తిరుమలలోని వేద పాఠశాలను వారు సందర్శించారు. మారిషస్‌లో కూడా వేదపాఠశాలను ఏర్పాటు చేయాలనే ఆలోచన ఉందన్నారు.