partha saradhi
-
బయటపడ్డ మరొక టీడీపీ నేత ప్రలోభాలు
-
‘నమ్మిన సిద్ధాంతం కోసం పాటుపడే వ్యక్తి ఆయన’
సాక్షి, కృష్ణా: రాష్ట్రంలోని 5 కోట్ల మంది ప్రజల కంటి సమస్యను పరిష్కరించడమే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ధ్యేయమని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే పార్థసారథి అన్నారు. జిల్లాలోని కానూరు గ్రామ ప్రభుత్వ పాఠశాలలో వైఎస్సార్ కంటివెలుగు పథకం కింద విద్యార్థులకు ఉచిత కళ్ళద్దాల పంపిణీ కార్యక్రమాన్ని శనివారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆయనతో పాటు జిల్లా కలెక్టర్ ఇంతియాజ్ అహ్మద్, జిల్లా వైద్య అధికారులు తదితురులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. 6 లక్షల మంది విద్యార్థుల్లో 44 వేల మంది విద్యార్థులకు దృష్టి లోపం ఉన్నట్లు గుర్తించామన్నారు. ఆరోగ్య శ్రీ పథకం కింద ప్రతి పేదవాడికి కార్పొరేట్ వైద్యాన్ని చేరువ చేసిన నాయకులు దివంగత నేత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి అని పేర్కొన్నారు. కానీ ఈ పథకాన్ని టీడీపీ ప్రభుత్వం నిర్లక్ష్యం చేసి.. దీని కింద ఉన్న1000 వ్యాధులకు చికిత్స అమలు కాకుండా వాటి సంఖ్యను తగ్గించిందని ఆయన మండిపడ్డారు. కాగా ప్రతి వ్యాధి ఆరోగ్య శ్రీ పథకంలోకి వచ్చేలా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చర్యలు తీసుకున్నారని, అదనంగా మరో 57 అర్ధోపెడిక్ వ్యాధులను కూడా చేర్చిన ఘనత సీఎం జగన్‌ది అన్నారు. ప్రభుత్వ బడుల్లో అమలు చేసే ఇంగ్లీష్ మీడియం మత బోధనకే అని, తెలుగు మీడియంను దెబ్బతీస్తున్నారని మాజీ సీఎం చంద్రబాబు నాయుడు అనవసర రాద్ధాంతం చేశారన్నారు. నమ్మిన సిద్ధాంతం కోసం పనిచేసే వ్యక్తి సీఎం జగన్ అని... 6 నెలల లక్ష్యంతో కూడిన పాలన సాగించారని వ్యాఖ్యానించారు. ఇక కలెక్టర్ ఇంతియాజ్ అహ్మద్ మాట్లాడుతూ.. జిల్లాలో 6 లక్షల మంది విద్యార్థులకు కంటి పరీక్షలు చేశామని వారిలో 40 వేల విద్యార్థులకు దృష్టి లోపం ఉన్నట్లు గుర్తించామన్నారు. ఈ క్రమంలో 14,734 మందికి కళ్ల జోళ్లు పంపిణీ చేయనున్నట్లు కలెక్టర్ వెల్లడించారు. -
పాకిస్తాన్లో ఉన్నామా లేక ప్రజాస్వామ్యంలోనా..?
గన్నవరం: రాష్ట్రంలో దిక్కుమాలిన పరిపాలన కొనసాగుతోందని వైఎస్సార్సీపీ నేత సి. రామచంద్రయ్య విమర్శించారు. గన్నవరంలో రామచంద్రయ్య విలేకరులతో మాట్లాడుతూ.. మనం ప్రజాస్వామ్యదేశంలో ఉన్నామా లేక పాకిస్తాన్ ఉన్నామా అనే అనుమానం కలుగుతోందన్నారు. సినిమా డైరెక్టర్ రాంగోపాల్ వర్మ మీడియా సమావేశానికి ఎందుకు అనుమతి ఇవ్వలేదని సూటిగా చంద్రబాబు ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. కోర్టు, ఎన్నికల కమిషన్, సెన్సార్‌బోర్డు అన్నీ కూడా సినిమాకు అనుమతి ఇచ్చిన తర్వాత కూడా మీడియా సమావేశాన్ని అడ్డుకోవడం ఏమిటని అడిగారు. వర్మను నిర్బంధించడం అప్రజాస్వామికం: అంబటి డైరెక్టర్ రాంగోపాల్ వర్మను పోలీసులు నిర్బంధించడం అప్రజాస్వామికమని వైఎస్సార్సీపీ నేత అంబటి రాంబాబు వ్యాఖ్యానించారు. విజయవాడలో అడుగుపెట్టాలంటే చంద్రబాబు నాయుడి పర్మిషన్ తీసుకోవాలా అని సూటిగా ప్రశ్నించారు. రాష్ట్రంలో రాక్షస రాజ్యమేలుతోందన్నారు. నిజాలు బయటకు వస్తాయనే లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాను అడ్డుకుంటున్నారని ఆరోపించారు. మే 23వ తేదీతో చంద్రబాబు పాలన అంతమవుతోందని జోస్యం చెప్పారు. వెన్నుపోటు బయటకు వస్తుందనే ఆందోళన: మల్లాది లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా అంటే చంద్రబాబు నాయుడు భయపడుతున్నారని వైఎస్సార్సీపీ నేత మల్లాది విష్ణు అన్నారు. చంద్రబాబు వెన్నుపోటు అంశం బయటకు వస్తుందనే భయంతోనే ఆందోళన చెందుతున్నారని చెప్పారు. రాంగోపాల్ వర్మ సినిమాను అడ్డుకోవడం అప్రజాస్వామికమన్నారు. ఎన్నికలకు ముందు విడుదల కావాల్సిన సినిమాకు భయపడి విడుదల కాకుండా అడ్డుకున్నారని ఆరోపించారు. సమావేశం అడ్డుకోవడం దుర్మార్గమైన చర్య: పార్దసారధి రాంగోపాల్ వర్మ మీడియా సమావేశాన్ని అడ్డుకోవడం దుర్మార్గమైన చర్య అని వైఎస్సార్సీపీ నేత పార్ధసారధి వ్యాఖ్యానించారు. గతంలో ఎన్నడూ దర్శక, నిర్మాతల మీడియా సమావేశాన్ని అడ్డుకోలేదని చెప్పారు. లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా అంటే ఎందుకు చంద్రబాబుకు అంత భయమని సందేహం వెలిబుచ్చారు. చంద్రబాబు ఆదేశాల మేరకే పోలీసులు మీడియా సమావేశాన్ని అడ్డుకున్నారని ఆరోపించారు. మీడియా సమావేశం కూడా పెట్టుకునే స్వేచ్ఛ ఏపీలో కనిపించడం లేదన్నారు. -
లోకేశ్ అవినీతిపై విచారణ జరిపించాలి
-
బాబు భూదాహం తీరడం లేదు
కొలుసు పార్థసారథి ధ్వజం సాక్షి, హైదరాబాద్: ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు భూ దాహం తీరడం లేదని ఆయన పేద రైతుల నోళ్లు కొట్టి లాక్కుంటున్న భూములను బడా బాబులకు పందేరం చేస్తున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ అధికార ప్రతినిధి కొలుసు పార్థసారథి ధ్వజమెత్తారు. శనివారం ఆయన పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ రాజధాని నిర్మాణానికని చెప్పి రైతుల దగ్గరి నుంచి ఇప్పటికే తీసుకున్న 33 వేల ఎకరాలు చాలక మరో 14 వేల ఎకరాలను కొట్టేయడానికి చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని, దీన్నిబట్టి ఆయన భూదాహం పరాకాష్టకు చేరుకుందని విమర్శించారు.మూడు గ్రామాల రైతులు తమ భూములు తీసుకోవాలని తన వెనుక బడి బతిమిలాడుతున్నట్లు చంద్రబాబు చెప్పడం ఆశ్చర్యం కలిగిస్తోందని, ఆ గ్రామాల్లో 14 వేల ఎకరాలు తీసుకుంటామని ముఖ్యమంత్రి చెప్పడంపై ఆయన మండిపడ్డారు. వెల్లంపల్లి ఇంటిపై దాడి గర్హనీయం వైఎస్సార్ కాంగ్రెస్ విజయవాడ నగర అధ్యక్షుడు వెల్లంపల్లి శ్రీనివాస్ ఇంటిపై టీడీపీ నేతలు దాడి చేయడాన్ని పార్టీ తీవ్రంగా ఖండిస్తోందని సారథి అన్నారు. -
ఆలయంలో అర్ధరాత్రి యాగం
► ఆగమశాస్త్ర విరుద్ధంగా నిర్వహణ ►అమ్మ క్షేమం కోసం యాగం చేసినట్టు సమాచారం ►దేశానికే అరిష్టం : దీక్షితులు టీనగర్: ఆగమశాస్త్ర నిబంధనలు ఉల్లంఘించి చట్ట విరుద్ధంగా చెన్నై, పార్థసారధి ఆలయంలో బుధవారం అర్ధరాత్రి యాగం నిర్వహించడంతో సంచలనం ఏర్పడింది. ఇది దేశానికే అరిష్టమని దీక్షితులు వ్యాఖ్యానించడంతో పలువురు ఆందోళన చెందుతున్నారు. ట్రిప్లికేన్‌లోని పార్థసారధి ఆలయం 108 వైష్ణవ క్షేత్రాల్లో మిక్కిలి ప్రసిద్ధి చెందింది. ఈ ఆలయం హిందూ దేవాదాయ శాఖ ఆధీనంలో ఉంది. ఈ ఆలయానికి రాష్ట్రం నుంచే గాకుండా ఇతర రాష్ట్రాలకు చెంది న భక్తులు పెద్ద సంఖ్యలో వస్తుంటారు. ఇంతటి ప్రాముఖ్యత కలిగిన ఆలయంలో ఉదయం 6 గంటలకు సన్నిథిని తెరిచి రాత్రి 10.30 గంటలకు మూసివేస్తారు. ఈ సమయంలోనే ఆలయంలో ఐదు కాలపూజలు జరుపుతుంటారు. ఇదే సమయంలో మిగతా యాగపూజలు, అది కూడా మంచి సమయం చూసి జరపాలన్నది ఆగమ శాస్త్ర విధిగా ఉంది. అరుుతే ఆలయం మూసివేసిన తర్వాత బుధవారం రాత్రి 11 గంటల సమయంలో ఆగమ శాస్త్ర నిబంధనలకు విరుద్ధంగా ఆలయ సన్నిథిని తెరిచారు. ఆలయ డిప్యూటీ కమిషనర్ జ్యోతిలక్ష్మి, అడిషనల్ కమిషనర్ కవిత, ఓ జ్యోతిష్యుడు, కొందరు వేద పండితులు ఆలయ సన్నిథి చిన్న ద్వారం తెరచి యాగశాల పూజలు నిర్వహించారు. ఆలయంలో పనిచేసే దీక్షితులు వ్యతిరేకత తెలుపుతారనే కారణంగా బయటి నుంచి తీసుకువచ్చిన వేదపండితుల ద్వారా యాగశాల పూజ జరిగింది. ముఖ్యమంత్రి క్షేమాన్ని కోరుతూ ఈ యాగం నిర్వహించినట్లు తెలిసింది. ఇందుకోసం అనేక మంది వీఐపీలు కార్లలో ఈ ఆలయానికి చేరుకున్నారు. అర్థరాత్రి మూడు గంటల వరకు యాగపూజ కొనసాగింది. ఆగమ నిబంధనలకు విరుద్ధంగా అర్ధరాత్రి పూజలు నిర్వహించడం ఉన్నత పదవుల్లో వున్న వారికి ప్రమాదం కలిగించడమే గాకుండా దేశానికే అరిష్టం కలుగుతుందని దీక్షితులు వ్యాఖ్యానించారు. ఆగమ నిబంధనలు మీరితే అందరికీ ఇబ్బందులు కలుగుతాయన్నారు. శ్రీరంగం ఆలయంలో సమయాన్ని పాటించకుండా కుంభాభిషేకం నిర్వహించడంతో ప్రస్తుతం పాలకులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ఇటువంటి పరిస్థితుల్లో మళ్లీ ఆగమ శాస్త్ర నిబంధనలు మీరితే ఏమి జరుగుతుందనేది ఎవరూ ఊహించలేరన్నారు. ఆలయ కార్యనిర్వహణాధికారి అరుున ప్పటికీ అర్థరాత్రి ఆలయ ప్రవేశం చట్ట విరుద్ధమని, అటువంటి స్థితిలో ఆలయాన్ని తెరచి పూజలు నిర్వహించడం సరికాదన్నారు. -
కరువు ప్రాంతాలుగా అన్ని మండలాలు
* ప్రకటన కోరుతూ వైఎస్సార్సీపీ నేత పార్థసారథి డిమాండ్ * ఏడాది పొడవునా ‘ఉపాధి’ పథకాన్ని అమలు చేయాలి * కరువుతో రైతులు అల్లాడుతుంటే బాబు విదేశీ పర్యటనలా.. సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో దుర్భిక్ష పరిస్థితులు విలయతాండవం చేస్తున్నందున అన్ని మండలాల్నీ కరువు ప్రాంతాలుగా ప్రకటించి వెంటనే సహాయక చర్యలు చేపట్టాలని, గ్రామాల్లో వందరోజుల ఉపాధికి బదులుగా ఏడాది పొడవునా గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని(ఎన్ఆర్ఈజీఎస్) అమలు చేయాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి కొలుసు పార్థసారథి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అంతేగాక కేంద్రం లేదా రాష్ట్రప్రభుత్వం నుంచి వచ్చే నిధులతో గ్రామాల్లో సహాయక పనులు చేపట్టాలని కోరారు. ఆయన బుధవారం పార్టీ కేంద్ర కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రంలో కరువుతో అల్లాడుతున్న రైతులను విస్మరించి సీఎం చంద్రబాబు విదే శాల్లో విహార యాత్రలకు వెళ్లడం ఆయన దివాలాకోరుతనానికి నిదర్శనమని విమర్శించారు. చంద్రబాబు రైతు వ్యతిరేకి అని, ఆయనకేమాత్రం వ్యవసాయంపై శ్రద్ధ లేదని దుయ్యబట్టారు. రాష్ట్రంలో ఖరీఫ్ వ్యవసాయ రుణాలకు సంబంధించి ఏటా మే 15 నాటికి రాష్ట్రస్థాయి బ్యాంకర్ల సమావేశం జరగాల్సి ఉండగా జూన్ చివరినాటికిగానీ నిర్వహించలేదని, దీనినిబట్టి ఆయనకు రైతులపై ఎంత శ్రద్ధ ఉందో అర్థమవుతోందని విమర్శించారు. తెలంగాణ ప్రభుత్వం సాగర్ నుంచి నీరు విడుదల కాకుండా కృష్ణా డెల్టా రైతులకు అన్యాయం చేస్తున్నా, శ్రీశైలం రిజర్వాయర్ నుంచి విద్యుత్ ఉత్పత్తిని యథేచ్ఛగా చేస్తూ రాయలసీమకు నష్టం కలిగిస్తున్నా చంద్రబాబు పట్టించుకోవట్లేదని విమర్శించారు. బాబొస్తే కరువొస్తుందనేది నిజమైంది బాబొస్తే జాబొస్తుందని ఎన్నికల్లో చెప్పారని, ఇపుడు ఎవరికీ జాబు రాకపోయినా.. బాబొస్తే కరువొస్తుందనేది నిజమైందని పార్థసారథి వ్యంగ్యంగా అన్నారు. చంద్రబాబు గత తొమ్మిదేళ్ల పాలనలో ఆరేళ్లు కరువొచ్చిందని, ఇపుడు ఆయన రావడంతోనే తిరిగి కరువు ప్రారంభమైందని చెప్పారు. -
'ప్రజలను గాలికొదిలి బాబు పర్యటనలు సిగ్గుచేటు'
హైదరాబాద్: రైతులు సమస్యలతో సతమతమవుతుంటే ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు విదేశాలకు వెళ్లడం సిగ్గుచేటని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి పార్థసారథి అన్నారు. ఏపీ ప్రజలను గాలికొదిలేశారని, చంద్రబాబు నిర్వాకం వల్ల కృష్ణా, గోదావరి డెల్టాలు ఎడారిలుగా మారిపోయే పరిస్థితి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రభుత్వం రాయలసీమకు అన్యాయం చేస్తున్నా చంద్రబాబు ఎందుకు నోరు మెదపడం లేదని ప్రశ్నించారు. చంద్రబాబు ప్రభుత్వంలో ఏపీ అంతా బీడు భూమిగా మారిపోయిందని అన్నారు. ఏపీలోని అన్ని మండలాలను కరువు మండలాలుగా ప్రకంటించాలని, కార్మికులందరికి ఎన్ఆర్ఈజీఎస్ వర్తింపజేయాలని డిమాండ్ చేశారు. పంట నష్టపోయిన రైతులకు వెంటనే పరిహారం చెల్లించాలని కోరారు. -
అవి అనుమానాస్పద మరణాలా?
* పుష్కర మృతులపై వైఎస్సార్సీపీ నేత పార్థసారథి * ఈ వ్యవహారం నుంచి బాబును తప్పించాలనే కేసును పక్కదోవ పట్టించాలని డీజీపీ చూస్తున్నారు సాక్షి, హైదరాబాద్: పుష్కరాల తొక్కిసలాటలో మృతిచెందిన వారివి అనుమానాస్పద మరణాల ని పోలీసులు కేసు నమోదు చేయడం దారుణమని, అవి చంద్రబాబు ప్రభుత్వం చేసిన హత్యల ని వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ అధికార ప్రతినిధి కొలుసు పార్థసారథి ధ్వజమెత్తారు. ఆయన గురువారం పార్టీ కేంద్ర కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. ప్రభుత్వ నిర్లక్ష్యంవల్ల తొక్కిసలాటలో 27 మంది మరణించిన విషయం కళ్లకు కొట్టొచ్చినట్లు కనిపిస్తూ ఉంటే వాటిని అనుమానాస్పద మరణాలని ఎలా అంటారని ప్రశ్నించారు. ఈ మరణాలపై 374 సెక్షన్ కింద(ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల జరిగిన మరణాలు) కేసు నమోదు చేయాల్సి ఉంటే 174 సెక్షన్(అనుమానాస్పద మరణాలు)కింద ఎలా పెడతారని ఆశ్చర్యం వెలిబుచ్చారు. తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ ప్రభుత్వానికిచ్చిన నివేదికలో ఎక్కడా అనుమానాస్పద మరణాలుగా పేర్కొనలేదన్నారు. ‘వీఐపీ ఘాట్లోగాక సాధారణ ఘాట్ వద్ద సీఎం చంద్రబాబు, మరికొందరు వీఐపీలు వచ్చి గంటన్నరకుపైగా స్నానాన్ని ఆచరించడంతో జనసందోహం పెరిగింది.. వారు వెళ్లిపోయాక ముహూర్తానికే స్నానం చేయాలనే భావనతో జనమంతా రావడంతో తొక్కిసలాట జరిగింది.. దానిఫలితంగానే మరణాలు సంభవించాయి.. పోలీసులు కూడా జనాన్ని నియంత్రించలేకపోయారని కలెక్టర్ తన నివేదికలో పేర్కొంటే అందుకు భిన్నంగా పోలీసులు కేసెలా పెడతారు?’’ అని ఆయన ప్రశ్నించారు. రాష్ట్రప్రభుత్వాన్ని, సీఎం చంద్రబాబును తప్పించి కేసును పక్కదోవ పట్టించాలని డీజీపీ చూస్తున్నారని పార్థసారథి మండిపడ్డారు. మరణాలకు బాబే బాధ్యుడు.. ఇలాంటి కార్యక్రమాలు జరిగేటపుడు రెవెన్యూ, పోలీసు, దేవాదాయశాఖల మంత్రులతో పర్యవేక్షణకు ఉపసంఘాన్ని నియమిస్తారని, కానీ చంద్రబాబు సీనియర్లను కాదని తన మాటకు తందానా పలికే మంత్రి పి.నారాయణ, మీడియా సలహాదారు పరకాల ప్రభాకర్ వంటి వారికి నిర్వహణ బాధ్యతలు అప్పగించారని పార్థసారథి విమర్శించారు. ఈ విషాదానికి స్వయంగా తానే బాధ్యుడైనపుడు ఇంకా సీఎం న్యాయవిచారణకు ఆదేశించడమంటే.. ఇందులో అధికారుల్ని బలిపశువుల్ని చేయాలనే ఉద్దేశంతోనేనన్నారు. -
రుణమాఫీపై మళ్లీ మోసం
టీడీపీ ప్రభుత్వంపై మాజీ మంత్రి పార్థసారథి ధ్వజం సాక్షి, హైదరాబాద్: రుణాల మాఫీపై రైతులను మళ్లీ మోసం చేయాలని టీడీపీ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి కె.పార్థసారథి ధ్వజమెత్తారు. రుణ మాఫీపై దాగుడుమూతలు ఆపి రుణ మొత్తాన్ని బ్యాంకులకు ఎపుడు చెల్లిస్తారో, ఖరీఫ్ వ్యవసాయానికి కొత్త రుణాలు ఎపుడు ఎలా ఇప్పిస్తారో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ మొత్తం వ్యవహారంపై చంద్రబాబు ఒక శ్వేతపత్రాన్ని విడుదల చేయాలని డిమాండ్ చేశారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో గురువారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ టీడీపీ, ఆ పార్టీ అధినేత చంద్రబాబునాయుడు విశ్వసనీయతపై రైతులకు నమ్మకం లేకపోయినా తమ పంట రుణాలన్నీ రద్దవుతాయన్న ఆశతో నమ్మి ఓట్లేశారని, కానీ తీరా అధికారంలోకి వచ్చాక రైతులను మోసం చేసే చంద్రబాబు నైజాన్ని మళ్లీ చాటుకున్నారని దుయ్యబట్టారు. -
సారథి, వ్యాస్ చేరికతోకొత్త జోష్
జిల్లాలో వైఎస్సార్సీపీ మరింత బలోపేతం జగన్ సమక్షంలో పార్టీలో చేరిన ఇద్దరు కీలక నేతలు సాక్షి ప్రతినిధి, విజయవాడ : ఇద్దరూ ఇద్దరే.. తండ్రుల నుంచి తమ వరకు రాజకీయాల్లో రాణించినవారే.. కీలక పదవులు సైతం సమర్థవంతంగా నిర్వహించి జిల్లాపై తమదైన ముద్ర వేసినవారే.. అటువంటి ఉద్దండులు ఇద్దరి చేరికతో వైఎస్సార్సీపీలో కొత్త ఉత్సాహం ఉప్పొంగుతోంది. జిల్లాకు చెందిన మాజీ మంత్రి కొలుసు పార్థసారథి, మాజీ డెప్యూటీ స్పీకర్ బూరగడ్డ వేదవ్యాస్‌లు శనివారం వైఎస్సార్సీపీలో చేరారు. ఆ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి వారిద్దరికి మెడలో పార్టీ కండువాలు వేసి ఆహ్వానించారు. కాంగ్రెస్‌లో తిరుగులేని నేతలుగా వ్యవహరించిన వీరిద్దరూ పార్టీలో చేరడం శుభపరిణామమని జిల్లాలోని వైఎస్సార్సీపీ శ్రేణులు పేర్కొంటున్నాయి. రెండు పర్యాయాలు గెలిచి.. కీలక పదవులు అధిరోహించి... ముక్కుసూటి తత్వం కలిగిన బూరగడ్డ వేదవ్యాస్ వైఎస్సార్సీలోకి రావడం మంచి పరిణామం అని ఆయన అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఆయన తండ్రి బూరగడ్డ నిరంజన్‌రావు జిల్లా రాజకీయాల్లో రాజీలేని వ్యక్తిగా గుర్తింపు పొందారు. అధికార కాంగ్రెస్ పార్టీలో సైతం ఆర్థికంగా, సామాజికంగా పెత్తనం చెలాయించే వ్యక్తులకు ఆయన ఎదురొడ్డి నిలిచే వ్యక్తిగా పేరొందారు. మల్లేశ్వరం నియోజకవర్గంలో ఒకమారు స్వతంత్ర అభ్యర్థిగా, మరోమారు జనతా పార్టీ అభ్యర్థిగా బూరగడ్డ నిరంజన్‌రావు గెలుపొందారు. మూడు పర్యాయాలు ఓటమిని చవిచూశారు. దాదాపు 30 ఏళ్లపాటు జిల్లా రాజకీయాల్లో కీలక వ్యక్తిగా నిరంజన్‌రావు రాణించారు. ఆయన హయాం తర్వాత బూరగడ్డ వేదవ్యాస్ మల్లేశ్వరం నియోజకవర్గం నుంచి రెండు పర్యాయాలు ఎమ్మెల్యేగా విజయం సాధించారు. అదే సమయంలో అంచనాల కమిటీ చైర్మన్, మాజీ డెప్యూటీ స్పీకర్ వంటి పదవులతో పాటు ఏఐసీసీ సభ్యుడు, పీసీసీ ప్రధాన కార్యదర్శి వంటి పార్టీ పదవులు నిర్వహించారు. ఆయన వైఎస్సార్సీపీలో చేరడంతో ఆ పార్టీలోను, ఆయన అనునయుల్లోనూ ఆనందోత్సాహాలు వ్యక్తమవుతున్నాయి. బూరగడ్డ వేదవ్యాస్ వైఎస్సార్సీపీలో చేరుతున్న విషయాన్ని తెలుసుకున్న ఆయన అనునయులు హైదరాబాద్ వెళ్లారు. ఆయనతోపాటు పెడన నియోజకవర్గానికి చెందిన పలు గ్రామాల సర్పంచ్‌లు, కీలకనేతలు వైఎస్సార్సీపీలో చేరారు. వ్యాస్ అనుచరులు మాజీ జెడ్పీటీసీ బూరగడ్డ శ్రీకుమార్, జోగి శ్రీను, చోడవరం శ్రీను, గరికిపాటి నాయుడు, మాతా సుబ్బారావు, యండపల్లి నర్శింహారావు, తుమ్మిడి చినబాబు, చిన్నా, సత్యనారాయణ తదితరులు పెద్ద సంఖ్యలో వైఎస్ జగన్మోహన్రెడ్డి సమక్షంలో వైఎస్సార్సీపీలో చేరారు. వ్యాస్ పార్టీలో చేరిన సమయంలో పెడన మాజీ జెడ్పీటీసీ గుడిసేవ రమేష్, పెడన నియోజకవర్గ వైఎస్సార్సీపీ నాయకులు మావులేటి వెంకట్రాజు, వరుదు రామకృష్ణ, ఆయూబ్‌ఖాన్ తదితరులు అక్కడే ఉన్నారు. అప్పుడు వైఎస్ అనుచరుడు.. ఇప్పుడు జగన్ వెంట.. జిల్లాలో ఏకైక మంత్రిగా రాజకీయాల్లో రాణించిన కొలుసు పార్థసారథి వైఎస్సార్సీపీలో చేరికతో అదనపు బలం చేకూరుతోంది. సారథి తండ్రి కొలుసు పెద రెడ్డియ్య బందరు ఎంపీ, ఉయ్యూరు ఎమ్మెల్యేగా పనిచేశారు. దాదాపు 25 ఏళ్లపాటు జిల్లా రాజకీయాల్లో కేపీ రెడ్డియ్య చక్రం తిప్పారు. ఆయన అనంతరం రాజకీయ వారసుడిగా సారథి 2004లో ఉయ్యూరు ఎమ్మెల్యేగా, 2009లో పెనమలూరు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. రెండో పర్యాయం ఎన్నికైన సారథికి దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి మంత్రి పదవిని ఇచ్చారు. జిల్లాలో ఏకైక మంత్రిగా సారథి తనదైన ముద్ర వేశారు. అటువంటి సారథి వైఎస్సార్సీపీలోకి రావడం పార్టీకి అదనపు బలం అని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. పార్టీలో చేరిన అనంతరం సారథి సాక్షితో మాట్లాడుతూ వైఎస్ సువర్ణయుగం జగన్మోహన్రెడ్డితోనే సాధ్యమని భావించి వైఎస్సార్సీపీలో చేరినట్టు చెప్పారు. సంక్షేమం, అభివృద్ధి రెండు కళ్లుగా వైఎస్ పనిచేశారని, ఆయన మరణం తీరనిలోటని అన్నారు. సమైక్యాంధ్ర కోసం రాజీలేని పోరాటం చేసిన వైఎస్ జగన్మోహన్రెడ్డి నాయకత్వంలో పనిచేసి వైఎస్ ఆశయాలను నెరవేర్చేందుకు కృషి చేస్తానని చెప్పారు. సారథి వెంట జిల్లా పశుగణాభివృద్ధి సంస్థ చైర్మన్ గోవాడ అనిల్‌కుమార్ తదితరులు పార్టీలో చేరారు. -
పాపం.. పార్థసారథి
భీమవరం అర్బన్, న్యూస్‌లైన్ : ఆయన పేరు మెంటే పార్థసారథి. మూడు దశాబ్దాలుగా తెలుగుదేశం పార్టీలో పల్లకి మోసే బోయూగానే ఉండిపోయూరు. ప్రస్తుతం ఆ పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శిగా పనిచేస్తున్నారు. ప్రతి ఎన్నికల్లోనూ తనకు సీటొస్తుందనే ఆశతో ఉంటున్నారు. చివరకు అట్టడుగు స్థారుుకి నెట్టబడుతున్నారు. ఓసారి ఆయనకు ఎమ్మెల్సీ అయ్యే అవకాశం దక్కింది. సామాజిక సర్దుబాటులో భాగంగా మునిసిపల్ మాజీ చైర్మన్‌కు ఆ పదవిని కట్టబెడుతున్నామని.. మరోసారి మంచి అవకాశం కల్పిస్తామని టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు బుజ్జగించారు. 1999 ఎన్నికల్లో అరుునా ఎమ్మెల్యే సీటు ఇస్తారని సారథి, ఆయన వర్గీయులు భావించారు. అప్పుడూ అదే పరిస్థితి. ఆయన వర్గీయులు, అభిమానులు ఎమ్మెల్యే సీటును ఆయనకే ఇచ్చి తీరాలన్నారు. అరుునా పార్టీ అధిష్టానం పట్టించుకోలేదు. అరుునా పార్థసారథి సర్దుకుపోయూరు. ఇలా చాలా సందర్భాల్లో జరిగింది. ప్రస్తుత ఎన్నికల్లో తనకు తప్పకుండా ఎమ్మెల్యే సీటొస్తుందనే ధీమాతో ఉన్నారు. అభిమానులు సైతం మొన్నటివరకూ అదే ఆశతో ఉన్నారు. బంధుగణం, అనుచర వర్గం బలంగా ఉన్న ఆయనకు ఈసారి సీటొస్తే కష్టపడి గెలిపించుకుందామనుకున్నారు. కానీ.. సీను తారుమారైంది. కాంగ్రెస్ పార్టీని వీడిన వారందరికీ పచ్చజెండాలు కప్పుతున్న చంద్రబాబునాయుడు ఈసారి కూడా సారథి కి షాక్ ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన భీమవరం ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులును చంద్రబాబు టీడీపీలోకి ఆహ్వానించారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో భీమవరం సీటు రామాంజనేయులు (అంజిబాబు)కు ఇస్తామని హామీ కూడా ఇచ్చేశారు. ఈసారి ఎలాగైనా సరే టీడీపీ సీటు తనకే వస్తుందని.. ఖర్చుకు వెనుకాడబోనని పార్థసారథి ఎన్నికలకు సిద్ధమైన తరుణంలో అంజిబాబు రాక టీడీపీలో ముసలాన్ని రేపింది. ‘టీడీపీలో ఎప్పుడూ పల్లకి మోసే బోయీగానే ఉండిపోవాలా, పల్లకి ఎక్కే అవకాశం ఇవ్వరా’ అంటూ సారథి అనుచరులు, బంధుగణం అసహనంతో రగిలిపోతోంది. పార్టీ శ్రేణులు సైతం ఆవేదనతో రగిలిపోతున్నాయి. ఆదినుంచి పార్టీకి ఎనలేని సేవలందిస్తున్న మెంటే పార్థసారథిని కాదని వేరే వారికి సీటిస్తే సహించేది లేదని, అంజిబాబుకు సహకరించేది లేదని వారంతా మండిపడుతున్నారు. అంజిబాబుపై అసంతృప్తి: టీడీపీలో చేరిన ఎమ్మెల్యే అంజిబాబుపై ఆ పార్టీ శ్రేణులు అసంతృప్తిని వెళ్లగక్కుతున్నారుు. చంద్రబాబు నాయుడు సమక్షంలో పార్టీలో చేరి మంగళవారం భీమవరం వచ్చిన ఎమ్మెల్యే అంజిబాబుకు స్వాగతం పలికేందుకు టీడీపీ నాయకులు, కార్యకర్తల్లో ఒక్కరు కూడా వెళ్లలేదు. మెంటేకి అసెంబ్లీ సీటిస్తేనే మునిసిపల్ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థుల కోసం పనిచేస్తామని, లేదంటే పట్టించుకునేది లేదని పార్టీ నాయకులు ఇప్పటికే చంద్రబాబుకు వివిధ రూపాల్లో స్పష్టం చేశారు. అరుునా అధిష్టానం పట్టించుకోకపోవడంతో శ్రేణులంతా అసహనంతో రగిలిపోతున్నారు. నీ దారి నీదే : ఇటీవల పార్థసారథి ఇంటికి వెళ్లిన ఎమ్మెల్యే అంజిబాబు వచ్చే ఎన్నికల్లో తనకు సహకరించాలని కోరారు. ఇందుకు పార్థసారథి ససేమిరా అన్నట్టు సమాచారం. పార్టీ కోసం ఎన్నో ఏళ్లుగా పనిచేస్తున్నానని, తాను అసెంబ్లీ టికెట్ ఆశిస్తున్నానని.. ఈ విషయంలో నీ దారి నీదే.. నా దారి నాదే అని పార్థసారథి స్పష్టం చేసినట్టు చెబుతున్నారు. దీంతో చేసేదేమీ లేక అంజిబాబు వెనుతిరిగినట్లు తెలిసింది. ఎందుకింత కష్టపడాలి : భీమవరం సీటు తనకు దక్కుతుందనే ఆశతో మెంటే పార్థసారథి మునిసిపల్ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థుల కోసం చెమటోడుస్తున్నారు. అయితే అంజిబాబుకు సీటు ఖరారైందనే విషయం తెలిసి పార్థసారథి పార్టీ కోసం తానెందుకు కష్టపడాలనే ఆలోచనతో ఉన్నట్టు ఆయన అనుచరులు పేర్కొంటున్నారు. అంజిబాబు అంటే ఇష్టంలేని శ్రేణులు ఆయన చేరికతో మునిసిపల్ ఎన్నికల్లో ప్రచారం చేసేందుకు వెనకడుగు వేశారు. -
మారిషస్‌లో 108 అడుగుల శ్రీవారి విగ్రహం
సాక్షి, తిరుమల: మారిషస్ దేశంలో 108 అడుగుల ఎత్తయిన శ్రీవేంకటేశ్వరస్వామి విగ్రహాన్ని ప్రతిష్ఠించనున్నట్లు అక్కడి హరిహర దేవస్థానం చైర్మన్, కేబినెట్ ఓఎస్డీ పార్థసారథి తెలిపారు. శనివారం ఉదయం ఆయన మారిషస్ ప్రభుత్వ కేబినెట్ సెక్రటరీ సురేష్ చంద్రతో కలిసి శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం ఆలయం వెలుపల పార్థసారథి మీడియాతో మాట్లాడారు. ఈ ఏడాది డిసెంబరులో కుంభాభిషేకం చేసి అంగరంగ వైభవంగా విగ్రహాన్ని ప్రతిష్ఠించనున్నామని తెలిపారు. అనంతరం తిరుమలలోని వేద పాఠశాలను వారు సందర్శించారు. మారిషస్‌లో కూడా వేదపాఠశాలను ఏర్పాటు చేయాలనే ఆలోచన ఉందన్నారు.