పాపం.. పార్థసారథి
భీమవరం అర్బన్, న్యూస్‌లైన్ : ఆయన పేరు మెంటే పార్థసారథి. మూడు దశాబ్దాలుగా తెలుగుదేశం పార్టీలో పల్లకి మోసే బోయూగానే ఉండిపోయూరు. ప్రస్తుతం ఆ పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శిగా పనిచేస్తున్నారు. ప్రతి ఎన్నికల్లోనూ తనకు సీటొస్తుందనే ఆశతో ఉంటున్నారు. చివరకు అట్టడుగు స్థారుుకి నెట్టబడుతున్నారు. ఓసారి ఆయనకు ఎమ్మెల్సీ అయ్యే అవకాశం దక్కింది.
సామాజిక సర్దుబాటులో భాగంగా మునిసిపల్ మాజీ చైర్మన్‌కు ఆ పదవిని కట్టబెడుతున్నామని.. మరోసారి మంచి అవకాశం కల్పిస్తామని టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు బుజ్జగించారు. 1999 ఎన్నికల్లో అరుునా ఎమ్మెల్యే సీటు ఇస్తారని సారథి, ఆయన వర్గీయులు భావించారు. అప్పుడూ అదే పరిస్థితి. ఆయన వర్గీయులు, అభిమానులు ఎమ్మెల్యే సీటును ఆయనకే ఇచ్చి తీరాలన్నారు. అరుునా పార్టీ అధిష్టానం పట్టించుకోలేదు.
అరుునా పార్థసారథి సర్దుకుపోయూరు. ఇలా చాలా సందర్భాల్లో జరిగింది. ప్రస్తుత ఎన్నికల్లో తనకు తప్పకుండా ఎమ్మెల్యే సీటొస్తుందనే ధీమాతో ఉన్నారు. అభిమానులు సైతం మొన్నటివరకూ అదే ఆశతో ఉన్నారు. బంధుగణం, అనుచర వర్గం బలంగా ఉన్న ఆయనకు ఈసారి సీటొస్తే కష్టపడి గెలిపించుకుందామనుకున్నారు. కానీ.. సీను తారుమారైంది. కాంగ్రెస్ పార్టీని వీడిన వారందరికీ పచ్చజెండాలు కప్పుతున్న చంద్రబాబునాయుడు ఈసారి కూడా సారథి కి షాక్ ఇచ్చారు.
కాంగ్రెస్ పార్టీకి చెందిన భీమవరం ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులును చంద్రబాబు టీడీపీలోకి ఆహ్వానించారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో భీమవరం సీటు రామాంజనేయులు (అంజిబాబు)కు ఇస్తామని హామీ కూడా ఇచ్చేశారు. ఈసారి ఎలాగైనా సరే టీడీపీ సీటు తనకే వస్తుందని.. ఖర్చుకు వెనుకాడబోనని పార్థసారథి ఎన్నికలకు సిద్ధమైన తరుణంలో అంజిబాబు రాక టీడీపీలో ముసలాన్ని రేపింది. ‘టీడీపీలో ఎప్పుడూ పల్లకి మోసే బోయీగానే ఉండిపోవాలా, పల్లకి ఎక్కే అవకాశం ఇవ్వరా’ అంటూ సారథి అనుచరులు, బంధుగణం అసహనంతో రగిలిపోతోంది. పార్టీ శ్రేణులు సైతం ఆవేదనతో రగిలిపోతున్నాయి.
ఆదినుంచి పార్టీకి ఎనలేని సేవలందిస్తున్న మెంటే పార్థసారథిని కాదని వేరే వారికి సీటిస్తే సహించేది లేదని, అంజిబాబుకు సహకరించేది లేదని వారంతా మండిపడుతున్నారు. అంజిబాబుపై అసంతృప్తి: టీడీపీలో చేరిన ఎమ్మెల్యే అంజిబాబుపై ఆ పార్టీ శ్రేణులు అసంతృప్తిని వెళ్లగక్కుతున్నారుు. చంద్రబాబు నాయుడు సమక్షంలో పార్టీలో చేరి మంగళవారం భీమవరం వచ్చిన ఎమ్మెల్యే అంజిబాబుకు స్వాగతం పలికేందుకు టీడీపీ నాయకులు, కార్యకర్తల్లో ఒక్కరు కూడా వెళ్లలేదు.
మెంటేకి అసెంబ్లీ సీటిస్తేనే మునిసిపల్ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థుల కోసం పనిచేస్తామని, లేదంటే పట్టించుకునేది లేదని పార్టీ నాయకులు ఇప్పటికే చంద్రబాబుకు వివిధ రూపాల్లో స్పష్టం చేశారు. అరుునా అధిష్టానం పట్టించుకోకపోవడంతో శ్రేణులంతా అసహనంతో రగిలిపోతున్నారు.
నీ దారి నీదే : ఇటీవల పార్థసారథి ఇంటికి వెళ్లిన ఎమ్మెల్యే అంజిబాబు వచ్చే ఎన్నికల్లో తనకు సహకరించాలని కోరారు. ఇందుకు పార్థసారథి ససేమిరా అన్నట్టు సమాచారం. పార్టీ కోసం ఎన్నో ఏళ్లుగా పనిచేస్తున్నానని, తాను అసెంబ్లీ టికెట్ ఆశిస్తున్నానని.. ఈ విషయంలో నీ దారి నీదే.. నా దారి నాదే అని పార్థసారథి స్పష్టం చేసినట్టు చెబుతున్నారు. దీంతో చేసేదేమీ లేక అంజిబాబు వెనుతిరిగినట్లు తెలిసింది.
ఎందుకింత కష్టపడాలి : భీమవరం సీటు తనకు దక్కుతుందనే ఆశతో మెంటే పార్థసారథి మునిసిపల్ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థుల కోసం చెమటోడుస్తున్నారు. అయితే అంజిబాబుకు సీటు ఖరారైందనే విషయం తెలిసి పార్థసారథి పార్టీ కోసం తానెందుకు కష్టపడాలనే ఆలోచనతో ఉన్నట్టు ఆయన అనుచరులు పేర్కొంటున్నారు. అంజిబాబు అంటే ఇష్టంలేని శ్రేణులు ఆయన చేరికతో మునిసిపల్ ఎన్నికల్లో ప్రచారం చేసేందుకు వెనకడుగు వేశారు.