టీడీపీ పొలిట్‌బ్యూరోకు ధన్యవాదాలు: లోకేష్
విజయవాడ: ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కొడుకు, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ త్వరలో ఎమ్మెల్సీ కానున్నారు. ఆయనే ఈ విషయాన్ని ప్రకటించారు. ఎమ్మెల్సీ పదవికి తన పేరును ప్రతిపాదించినందుకు టీడీపీ పొలిట్‌బ్యూరోకు ఆయన కృతజ్ఞతలు చెప్పారు. ఎమ్మెల్సీగా ప్రజలకు మరింత సేవ చేసే అవకాశం తనకు ఇచ్చారని పేర్కొన్నారు. ఆయన ఈ మేరకు ట్వీట్ చేశారు.
ఆదివారం జరిగిన పొలిట్‌బ్యూరో సమావేశంలో ఎమ్మెల్యేల కోటాలో లోకేష్‌కు ఎమ్మెల్సీ స్థానం ఇవ్వాలని పార్టీ నేతలు చంద్రబాబును కోరారు. ఈసారి శాసనమండలిలో కచ్చితంగా లోకేష్ ఉంటారని పొలిట్ బ్యూరో నిర్ణయాలు వెల్లడించిన ఎమ్మెల్సీ సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తెలిపారు. లోకేష్‌ను చంద్రబాబు కేబినెట్‌లోకి తీసుకుంటారని ఎప్పటి నుంచో వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే.
Heartfelt thanks to TDP Politburo for believing in my capabilities & proposing my name as MLC. It is an opportunity to serve people closely.
— Lokesh Nara (@naralokesh) 27 February 2017