రుణమాఫీపై మళ్లీ మోసం | partha saradhi takes on TDP government | Sakshi
Sakshi News home page

రుణమాఫీపై మళ్లీ మోసం

Published Fri, Aug 1 2014 1:15 AM | Last Updated on Sat, Jul 28 2018 6:33 PM

రుణమాఫీపై మళ్లీ మోసం - Sakshi

రుణమాఫీపై మళ్లీ మోసం

టీడీపీ ప్రభుత్వంపై మాజీ మంత్రి పార్థసారథి ధ్వజం

సాక్షి, హైదరాబాద్: రుణాల మాఫీపై రైతులను మళ్లీ మోసం చేయాలని టీడీపీ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని వైఎస్సార్‌సీపీ నేత, మాజీ మంత్రి కె.పార్థసారథి ధ్వజమెత్తారు. రుణ మాఫీపై దాగుడుమూతలు ఆపి రుణ మొత్తాన్ని బ్యాంకులకు ఎపుడు చెల్లిస్తారో, ఖరీఫ్ వ్యవసాయానికి కొత్త రుణాలు ఎపుడు ఎలా ఇప్పిస్తారో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.
 
ఈ మొత్తం వ్యవహారంపై చంద్రబాబు ఒక శ్వేతపత్రాన్ని విడుదల చేయాలని డిమాండ్ చేశారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో గురువారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ టీడీపీ, ఆ పార్టీ అధినేత చంద్రబాబునాయుడు విశ్వసనీయతపై రైతులకు నమ్మకం లేకపోయినా తమ పంట రుణాలన్నీ రద్దవుతాయన్న ఆశతో నమ్మి ఓట్లేశారని, కానీ తీరా అధికారంలోకి వచ్చాక రైతులను మోసం చేసే చంద్రబాబు నైజాన్ని మళ్లీ చాటుకున్నారని దుయ్యబట్టారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement