సాక్షి, నెల్లూరు: తెలుగుదేశం పార్టీ నాలుగేళ్ల పాలన అవినీతి మయం, కుటుంబ పాలన, ప్రజలను మోసం చేయడమేనని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే కాకాణా గోవర్థన్ రెడ్డి విమర్శించారు. ఆయన శనివారం మీడియాతో మాట్లాడుతూ.. ప్రజల్లో విశ్వాసం కోల్పోయారన్నారు. ప్రజల డబ్బుతో రాజకీయ ప్రయోజనాల కోసమే నవనిర్మాణ దీక్షలు చేస్తున్నారని మండిపడ్డారు. ఆంధ్రుల హక్కుల వంచన విధానాలకు చంద్రబాబు వారథి అన్నారు. నాలుగేళ్లుగా అమిత్ షా స్క్రిఫ్ట్, మోదీ భజన చేసింది తండ్రి, కొడుకులే అన్నారు.
జన్మభూమి కమిటీలు, సాధికార మిత్రుల చేతిలోకి అభివృద్ధి పథకాలు వెళ్లాయని, అర్హులకు పథకాలు అందడం లేదని తెలిపారు. చంద్రబాబు రంగుల మార్పిడితో ఊసరవెల్లి కూడా భయపడుతుందన్నారు. ప్రత్యేక హోదా సజీవంగా ఉండటానికి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి కారణమన్నారు. జగన్‌పై విమర్శలు చేస్తే సహించమని హెచ్చరించారు. ఎంపీల రాజీనామాలు ఆమోదిస్తే ఎన్నికలు రావాలని కోరుకుంటున్నామని స్పష్టం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment