'ప్రజలను గాలికొదిలి బాబు పర్యటనలు సిగ్గుచేటు' | cm chandrababu behaviour is shame full: partha saradhi | Sakshi
Sakshi News home page

'ప్రజలను గాలికొదిలి బాబు పర్యటనలు సిగ్గుచేటు'

Published Wed, Aug 5 2015 3:40 PM | Last Updated on Tue, Aug 14 2018 11:26 AM

'ప్రజలను గాలికొదిలి బాబు పర్యటనలు సిగ్గుచేటు' - Sakshi

'ప్రజలను గాలికొదిలి బాబు పర్యటనలు సిగ్గుచేటు'

హైదరాబాద్: రైతులు సమస్యలతో సతమతమవుతుంటే ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు విదేశాలకు వెళ్లడం సిగ్గుచేటని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి పార్థసారథి అన్నారు. ఏపీ ప్రజలను గాలికొదిలేశారని, చంద్రబాబు నిర్వాకం వల్ల కృష్ణా, గోదావరి డెల్టాలు ఎడారిలుగా మారిపోయే పరిస్థితి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు.

తెలంగాణ ప్రభుత్వం రాయలసీమకు అన్యాయం చేస్తున్నా చంద్రబాబు ఎందుకు నోరు మెదపడం లేదని ప్రశ్నించారు. చంద్రబాబు ప్రభుత్వంలో ఏపీ అంతా బీడు భూమిగా మారిపోయిందని అన్నారు. ఏపీలోని అన్ని మండలాలను కరువు మండలాలుగా ప్రకంటించాలని, కార్మికులందరికి ఎన్ఆర్ఈజీఎస్ వర్తింపజేయాలని డిమాండ్ చేశారు. పంట నష్టపోయిన రైతులకు వెంటనే పరిహారం చెల్లించాలని కోరారు.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement