భారత ప్రధాని నరేంద్రమోదీ మారిషస్ లోని హిందువుల పవిత్రస్థలమైన గంగా తలావ్ శివాలయాన్ని సందర్శించి ప్రత్యేక ప్రార్థనలు చేశారు.
పోర్ట్ లూయీస్: భారత ప్రధాని నరేంద్రమోదీ మారిషస్ లోని హిందువుల పవిత్రస్థలమైన గంగా తలావ్ శివాలయాన్ని సందర్శించి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. మార్చి 12 మారిషస్ జాతీయ దినోత్సం సందర్భంగా మోదీ జాతినుద్దేశించి ప్రసంగించిన అనంతరం వరల్డ్ హిందీ సెక్రటేరియట్ భవనానికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా హిందీ భాషను ఆదరిస్తున్న మారిషస్ ప్రజలను అభినందించారు మోదీ. మారిషస్ ఒక మినీ భారత్ అని తన బిడ్డకు భారత మాత ప్రణామాలర్పిస్తోందన్నారు. ఇక్కడున్న కోట్లాది భారతీయుల కోరిక మేరకు మారిషస్ వచ్చానన్నారు మోదీ.