సాక్షి, న్యూఢిల్లీ : సుప్రీం కోర్టులో మార్గదర్శి ఫైనాన్షియర్స్‌కు చుక్కెదురైంది. మార్గదర్శిపై క్రిమినల్ ప్రొసీడింగ్స్‌పై గతంలో విధించిన స్టేను పొడిగించాలని మార్గదర్శి ఫైనాన్షియర్స్ దాఖలు చేసిన పిటిషన్‌ను శుక్రవారం సర్వోన్నత న్యాయస్ధానం కొట్టివేసింది. సంస్ధ హైకోర్టును ఆశ్రయించేందుకు సుప్రీం కోర్టు అనుమతించింది. నిబంధనలకు విరుద్ధంగా భారీ ఎత్తున డిపాజిట్లు సేకరించారని మార్గదర్శిపై అభియోగాలు నమోదైన సంగతి తెలిసిందే.
మార్గదర్శి ఫైనాన్షియర్స్ ఆర్‌బీఐ నిబంధనలను ఉల్లంఘిస్తూ రూ 2300 కోట్లు డిపాజిట్లు సేకరించిందన్న ఆరోపణలపై చర్యలు తీసుకునేందుకు ఉమ్మడి ఏపీ ప్రభుత్వం 2006 డిసెంబర్ 19న జీవో నంబరు 800, జీవో నంబరు 801 జారీ చేసింది. ఈ జీవోలకు అనుగుణంగా విచారణ అనంతరం అధీకృత అధికారి కృష్ణంరాజు మార్గదర్శి ఫైనాన్షియర్స్‌పై న్యాయపరమైన చర్యలకు సిద్ధమయ్యారు.
2008 జనవరి 23న ఫస్ట్ అడిషనల్ చీఫ్ మెట్రపాలిటన్ మెజి స్ట్రేట్ కోర్టులో క్రిమినల్ కంప్లయింట్(సీసీ) నంబరు 540 దాఖలు చేశారు. ఉత్తర్వులను పక్కన పెట్టాలని, ప్రొసీడిం గ్స్‌ను పూర్తిగా కొట్టివేయాలని 2011లో మార్గదర్శి హైకోర్టును ఆశ్రయిం చింది. 2011 జూలై 20న మరో క్రిమినల్ పిటిషన్‌లో హై కోర్టు ఏకసభ్య ధర్మాసనం మధ్యంతర స్టే ఇచ్చింది.
ఇటీవల ఏషియన్ రీ సర్ఫేసింగ్ ఆఫ్ రోడ్ ఏజెన్సీ ప్రయివేటు లిమిటెడ్ వర్సెస్ సీబీఐ కేసులో 2018 మార్చి 28న సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం సివిల్, క్రిమినల్ కేసుల స్టే ఉత్తర్వులు ఆ రోజు నుంచి ఆరు నెలల తరువాత రద్దవుతాయని పేర్కొంది. దీని ప్రకారం మార్గదర్శి కేసులోనూ స్టే ఉత్తర్వుకు కాలం చెల్లింది.
Comments
Please login to add a commentAdd a comment