criminal proceedings
-
29మంది బాలలకు మరణశిక్ష
పిల్లలను రక్షించాల్సిన ప్రభుత్వమే వారిని శిక్షిస్తోంది. అన్యాయం, అసమానతలపై గొంతెత్తడమే వారి నేరమైంది. 29 మంది పిల్లలకు కోర్టు మరణశిక్ష విధించడం నైజీరియా లో సంచలనం రేపింది. అయితే బాలల హక్కుల చట్టం ప్రకారం పిల్లలకు మరణ శిక్ష విధించడానికి క్రిమినల్ ప్రొసీడింగ్స్ అనుమతించకపోవడంతో బెయిలు మంజూరు చేసింది. నైజీరియాలో ఇంతకుముందెన్నడూ లేనివిధంగా జీవన వ్యయ సంక్షోభం నెలకొంది. సరైన విద్య, ఉపాధి లేదు. చివరకు ఆకలితో చనిపోయే రోజులొచ్చాయి. దీనిపై తీవ్రమైన నిరసనతో యువత సామూహిక నిరసనలను చేపట్టింది. ఆగస్టులో జరిగిన ఆందోళనల్లో దాదాపు 20 మందిని ప్రభుత్వం కాల్చి చంపింది. వందలాది మంది యువకులను అరెస్టు చేశారు. 76 మందిపై దేశద్రోహం, తిరుగుబాటు, ఆస్తుల విధ్వంసం సహా 10 ఆరోపణలతో కేసు వేశారు. ఈ కేసులో విచారణ జరిపిన కోర్టు.. వారందరికీ మరణశిక్ష విధిస్తూ సంచలన తీర్పు వెలువరించింది. అయితే ఈ 76 మందిలో 29 మంది చిన్నారులు ఉండటం, వారంతా 14 నుంచి 17 ఏళ్లలోపు వారు కావడం సంచలనమైంది. కేసు విచారణ జరుగుతున్న సమయంలో కోర్టు ఆవరణలోనే నలుగురు చిన్నారులు కుప్పకూలిపోయారు. అయితే నైజీరియా బాలల హక్కుల చట్టం ప్రకారం పిల్లలపై క్రిమినల్ ప్రోసీడింగ్స్, మరణశిక్ష విధించడానికి అనుమతి లేదని బాలుర తరఫు లాయర్ వాదనలతో ఏకీభవించిన కోర్టు బెయిలు మంజూరు చేసింది. ఒక్కొక్కరికీ రూ. 5 లక్షల పూచికత్తుతో పాటు కఠినమైన ఆంక్షలు విదించింది. నైజీరియాలో 1970లో మరణశిక్షను ప్రవేశపెట్టారు. 2016 నుంచి ఉరిశిక్ష అమలులో లేదు. నైజీరియా కోర్టు సంచలన తీర్పు21 కోట్లకు పైగా జనాభా ఉన్న నైజీరియా జనాభా పరంగా ఖండంలో అతిపెద్దది. ఆఫ్రికాలో ముడిచమురు ఉత్పత్తిలో అగ్రస్థానంలో ఉంది. అయినా ప్రపంచంలోని పేద దేశాలలో ఒకటిగా ఉంది. ఇటీవలికాలంలో ద్రవ్యోల్బణం రేటు కూడా 28 ఏళ్ల గరిష్టానికి పెరిగింది. స్థానిక నైరా కరెన్సీ డాలర్‌తో పోలిస్తే రికార్డు కనిష్టానికి పడిపోయింది. ఓవైపు ప్రజలు ఆకలితో చస్తుంటే.. ప్రభుత్వ అధికారుల జీవనశైలి మాత్రం అందుకు భిన్నంగా ఉంది. ఆ దేశ రాజకీయ నాయకులు ఆరోపణలతో అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. చట్టసభ సభ్యులు అత్యధిక పారితోíÙకం అందుకుంటున్నారు. ప్రభుత్వాధినేతలు, అధికారులు విలాసవంతమైన జీవితాన్ని గడుపుతున్నారు. పెద్ద సంఖ్యలో ప్రజలు తీవ్రమైన ఆహార అభద్రతను ఎదుర్కొంటున్నారని తెలిపిన ఐక్యరాజ్యసమితి.. ఆహార సంస్థల నివేదికలో నైజీరియాను ‘ఆందోళన కలిగించే హాట్ స్పాట్’గా వర్గీకరించింది. ఈ నేపథ్యంలో ఉపాధి, ఉద్యోగాలు, ఆహార భద్రతను డిమాండ్ చేస్తూ యువత ఆందోళనలు చేస్తున్నారు.– సాక్షి, నేషనల్ డెస్క్ -
వారిపై క్రిమినల్ కేసులు.. హైడ్రా మరో సంచలన నిర్ణయం
సాక్షి, హైదరాబాద్: హైడ్రా మరో సంచలన నిర్ణయం తీసుకుంది. చెరువుల్లో నిర్మాణాలకు పర్మిషన్ ఇచ్చిన ఉన్నతాధికారులపై క్రిమినల్ చర్యలకు హైడ్రా రంగం సిద్ధం చేసింది. ఇప్పటికే సైబరాబాద్ పరిధిలో మున్సిపల్ శాఖ హెచ్ఎండీఏ, సర్వే డిపార్ట్మెంట్లలో పనిచేసిన ఐదుగురు ఉన్నతాధికారులపై క్రిమినల్ కేసులు పెట్టేందుకు సైబరాబాద్ కమిషనర్‌కు హైడ్రా కమిషనర్ రంగనాథ్ సిఫారసు చేశారు.క్రిమినల్ చర్యల లిస్టులో నిజాంపేట్ మున్సిపల్ కమిషనర్, చందానగర్ మున్సిపల్ డిప్యూటీ కమిషనర్, హెచ్ఎండీఏ ఏపీవో, బాచుపల్లి ఎమ్మార్వో, మేడ్చల్ మల్కాజ్గిరి డిస్ట్రిక్ట్ సర్వే ఆఫ్ ఎడి ఉన్నట్లు సమాచారం.తెలంగాణలో అక్రమ నిర్మాణాల కూల్చివేతలే లక్ష్యంగా ముందుకు సాగుతున్న హైడ్రా.. తాజాగా ఐటీ కారిడార్ వద్ద ఉన్న దుర్గం చెరువు పరిసరాల్లో నిర్మాణాలపై దృష్టి పెట్టింది. ఈ క్రమంలోనే సీఎం రేవంత్ రెడ్డి సోదరుడు తిరుపతి రెడ్డితో సహా మొత్తం 204 మందికి రెవెన్యూ అధికారులు నోటీసులు ఇచ్చారు.నగరంలో ప్రసిద్ధి చెందిన దుర్గం చెరువుకు ‘సీక్రెట్ లేక్’ గుర్తింపు ఉంది. హైటెక్‌సిటీ వెలిశాక చెరువు చుట్టూ ఆక్రమణలు పెరిగాయి. రాజకీయ, వ్యాపార ప్రముఖులు, ఇంజనీర్లు, ఉన్నతాధికారులు, విశ్రాంత బ్యూరోక్రాట్లు నివాసాలను ఏర్పాటు చేసుకోవడంతో.. అధికారులు వాటి జోలికి వెళ్లలేదనేది వాస్తవం. కానీ, ఇప్పుడు హైడ్రా చర్యలతో కదలిక వచ్చింది.దుర్గం చెరువును ఆనుకుని ఉన్న పరిసరాల్లో నిర్మాణాలపై రెవెన్యూ అధికారులు దృష్టి సారించారు. దుర్గం చెరువుకు ఇరువైపులా.. కొందరు ప్రముఖుల నివాసాలు కూడా ఉన్నాయి. ఈ నిర్మాణాలు ఎఫ్టీఎల్ జోన్లో ఉన్నట్టు అధికారులు గుర్తించారు. ఈ క్రమంలో శేరిలింగంపల్లి తహసీల్దార్.. వారికి నోటీసులు ఇచ్చారు. నోటీసుల్లో భాగంగా 30 రోజుల్లో స్వచ్చందంగా అక్రమ కట్టడాలను కూల్చివేయాలని పేర్కొన్నారు. లేనిపక్షంలో చట్టరీత్యా తామే కట్టడాలను కూల్చేస్తామని తెలిపారు. -
పెగసస్ ఆరోపణలు నిజమైతే.. తీవ్రమైన అంశమే
న్యూఢిల్లీ: పెగసస్ స్పైవేర్‌పై ప్రసార మాధ్యమాల్లో వస్తున్న వార్తలు, ఆరోపణలు నిజమే అయితే ఇది తీవ్రమైన అంశమేనని సుప్రీంకోర్టు పేర్కొంది. ఇజ్రాయెల్‌కు చెందిన ఈ స్పైవేర్‌తో ప్రత్యర్థులపై కేంద్ర ప్రభుత్వం నిఘా పెట్టిందని, ఈ వ్యవహారంపై సమగ్ర దర్యాప్తు జరిపించాలని కోరుతూ సీనియర్ జర్నలిస్టులు ఎన్.రామ్, శశికుమార్ దాఖలు చేసిన పిటిషన్‌తోపాటు ఇదే అంశంపై దాఖలైన ఇతర పిటిషన్లపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వి.రమణ, జస్టిస్ సూర్యకాంత్‌తో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం గురువారం విచారణ చేపట్టింది. పెగసస్ ఉదంతంపై క్రిమినల్ ఫిర్యాదు చేయడానికి ఏవైనా ప్రయత్నాలు సాగించారా? అని పిటిషనర్లను ప్రశ్నించింది. 2019 మే నెలలోనే పెగసస్ విషయం బయటపడిందని, అలాంటప్పుడు ఇప్పుడే దీన్ని ఎందుకు తెరపైకి తీసుకొస్తున్నారని అడిగింది. ఈ అంశంలో ప్రధానమంత్రిని సైతం కక్షిదారుగా చేర్చాలన్న పిటిషనర్ల వినతిని న్యాయస్థానం తిరస్కరించింది. కేంద్ర ప్రభుత్వానికి నోటీసు ఇవ్వడాన్ని స్వల్పకాలంపాటు నిలిపివేసింది. కోర్టుకు సమర్పించిన వినతులను కేంద్రానికి సైతం అందజేయాలని పిటిషనర్లకు సూచించింది. తద్వారా ఆగస్టు 10న జరిగే తదుపరి విచారణకు కేంద్ర ప్రభుత్వం నుంచి ఎవరైనా ప్రతినిధిగా తమ ముందు హాజరవుతారని, అప్పుడు తాము నోటీసు జారీ చేస్తామని వెల–్లడించింది. పిటిషనర్లు ఎన్.రామ్, శశికుమార్ తరపున సీనియర్ అడ్వొకేట్ కపిల్ సిబల్ హాజరయ్యారు. పిటిషనర్లు ఉన్నత విద్యావంతులు, విషయ పరిజ్ఞానం ఉన్నవారేనని, పెగసస్ నిఘాపై వారు మరింత సమాచారం సేకరిస్తే బాగుండేదని ధర్మాసనం తెలిపింది. పెగసస్‌పై తాము కొన్ని ప్రశ్నలు అడుగుతామని, ఇంకా సమాచారం సేకరించి, తదుపరి విచారణకు రావాలని పిటిషనర్లకు సూచించింది. ఈ విషయంలో ఇప్పటిదాకా ఎలాంటి సమాచారం అందుబాటులో లేదని తాము చెప్పడం లేదని, మీడియాలో వస్తున్న వార్తలు నమ్మశక్యం కానివని తాము భావించడం లేదని వెల్లడించింది. తమ ఫోన్లు హ్యాక్ అయ్యాయని కొందరు పిటిషనర్లు చెబుతున్నారని, వ్యక్తుల ఫోన్లపై ఎవరైనా నిఘా పెడితే టెలిగ్రాఫ్ చట్టం, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టం కింద ఫిర్యాదు (క్రిమినల్ కంప్లైంట్) చేసే వెసులుబాటు ఉందని గుర్తుచేసింది. పెగసస్ వ్యవహారంపై వస్తున్న వార్తల్లో వాస్తవం ఉంటే ఇది తీవ్రమైన అంశం అనడంలో సందేహం లేదని తేల్చిచెప్పింది. వ్యక్తుల గోప్యత, గౌరవంపై దాడి పెగసస్ అనేది వంచన పరిజ్ఞానం (రోగ్ టెక్నాలజీ) అని కపిల్ సిబల్ సుప్రీంకోర్టు ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు. ఇది పూర్తిగా చట్ట విరుద్ధమేనని చెప్పారు. మనకు తెలియకుండానే మన జీవితాల్లోకి ఈ టెక్నాలజీ చొరబడుతుందని అన్నారు. పెగసస్ స్పైవేర్‌ను ఉపయోగించడం వ్యక్తుల గోప్యత, గౌరవంపై దాడి చేసినట్లే అవుతుందని స్పష్టం చేశారు. పెగసస్ స్పైవేర్‌ను ప్రభుత్వం, ప్రభుత్వ సంస్థలు కొనుగోలు చేయకపోతే వినియోగించడానికి వీల్లేదని చెప్పారు. ఈ స్పైవేర్‌ను ఉపయోగించి, ప్రత్యర్థుల ఫోన్లపై నిఘా పెట్టినట్లు ఆరోపణలు వస్తున్నాయని, అలాంటప్పుడు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని, ఎందుకు ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదని నిలదీశారు. పెగసస్ వ్యవహారంపై ప్రభుత్వం ఎందుకు మౌనం వహిస్తోందో చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ దశలో ప్రభుత్వం అంటే కేంద్రమే కాదు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా అని ధర్మాసనం వ్యాఖ్యానించింది. అయితే దీనిపై కోర్టుకు కేంద్ర ప్రభుత్వమే వివరణ ఇవ్వాల్సి ఉంటుందని సిబల్ బదులిచ్చారు. దేశ పౌరుల గోప్యత హక్కుకు సంబంధించిన ఈ అంశంలో దర్యాప్తు అవసరమని మరికొందరు పిటిషనర్ల తరపున హాజరైన అడ్వొకేట్లు అరవింద్ దాతర్, మీనాక్షి అరోరా చెప్పారు. -
సీఎం, మంత్రులపై క్రిమినల్ కేసులు పెండింగ్
సాక్షి, హైదరాబాద్: ముఖ్యమంత్రితోపాటు ఏడుగురు మంత్రుల మీద క్రిమినల్ కేసులు పెండింగ్‌లో ఉన్నాయని ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ స్వచ్ఛంద సంస్థ హైకోర్టు దృష్టికి తీసుకెళ్లింది. స్పెషల్ టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేసి ఎంపీలు, ఎమ్మెల్యేలపై నమోదైన క్రిమినల్ కేసుల విచారణను ఏడాదిలోగా పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని సంస్థ కోర్టును కోరింది. ఈ మేరకు ఆ సంస్థ కార్యదర్శి ఎం.పద్మనాభరెడ్డి శుక్రవారం హైకోర్టులో ప్రజాహిత వ్యాజ్యం(పిల్) దాఖలు చేశారు. ‘10 మంది ఎంపీల మీద 133 కేసులు, 67 మంది ఎమ్మెల్యేల మీద 150, గోషామహల్ ఎమ్మెల్యే మీద 43, చాంద్రాయణగుట్ట ఎమ్మెల్యే మీద 14, కరీంనగర్ ఎమ్మెల్యే మీద 7 కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. ఈ కేసులకు స్పెషల్ కోర్టు ఏర్పాటు చేసిన తర్వాత న్యాయస్థానం అనుమతి లేకుండా కేసులను ప్రభుత్వం ఉపసంహరించుకోవడానికి వీల్లేదు, అయినా ప్రభుత్వం కేసులను ఉపసంహరిస్తూనే ఉంది. స్థానిక పోలీసులు సాక్ష్యులను కోర్టుల ముందు హాజరుపర్చడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. అందుకే స్పెషల్ టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేసి ఏడాదిలోగా విచారణ పూర్తి చేయాలి. స్పెషల్ కోర్టుకు ప్రత్యేకంగా పబ్లిక్ ప్రాసిక్యూటర్‌ను, సిబ్బందిని ఏర్పాటు చేయాలి. కేసుల విచారణ పురోగతిని నెల రోజులకొకసారి హైకోర్టుకు సమర్పించేలా ఆదేశించండి’అని పిటిషన్లో కోరారు. -
‘అభ్యర్ధుల నేరచరిత వివరాలు వెల్లడించాలి’
సాక్షి, న్యూఢిల్లీ : రాజకీయ పార్టీలు తమ పార్టీ తరపున ఎన్నికల్లో పోటీ చేసే నేరచరిత్ర కలిగిన అభ్యర్ధుల గురించి పూర్తిసమాచారాన్ని పార్టీ వెబ్సైట్లు, ప్రింట్ మీడియా ద్వారా బహిర్గతం చేయాలని సుప్రీంకోర్టు అన్ని రాజకీయ పార్టీలను ఆదేశించింది. అభ్యర్ధుల కేసులు, అభియోగాలు, విచారణ ఏ దశలో ఉంది అనే వివరాలను సమగ్రంగా వెల్లడించడంతో పాటు అలాంటి అభ్యర్ధులను ఎందుకు ఎంపిక చేశారో వివరణ కూడా ఇవ్వాలని పేర్కొంది. సదరు అభ్యర్థిని ఎంపిక చేసిన మూడు రోజుల్లోగా ఎన్నికల కమిషన్‌కు కూడా ఈ వివరాలను నివేదించాలని తెలిపింది. కాగా, ఈ సమాచారాన్ని తమ అధికారులు ఇవ్వకపోవడం లేదా ఆన్లైన్లో పోస్ట్ చేయకపోయినా ఎన్నికల కమిషన్ కోర్టు ధిక్కార చర్యలను చేపట్టవచ్చని సర్వోన్నత న్యాయస్ధానం స్పష్టం చేసింది. కాగా ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేల్లో సగానికి పైగా ఎమ్మెల్యేలు నేరచరితను కలిగి ఉన్న క్రమంలో సుప్రీంకోర్టు ఈ ఆదేశాలను వెలువరించడం గమనార్హం. చదవండి : నిర్భయ దోషులకు ‘సుప్రీం’ నోటీసులు -
సోషల్ మీడియా ‘సైకో’లకు బేడీలు
సాక్షి, అమరావతి : ప్రభుత్వాన్ని పలుచన చేసే వ్యాఖ్యలతో సోషల్ మీడియాలో పేట్రేగిపోతున్న సైకోలకు పోలీసులు బేడీలు వేస్తున్నారు. రాజకీయ నేతల వ్యక్తిత్వాలను దెబ్బతీసే చర్యలకు పాల్పడుతున్న వారిపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. సీఎం వైఎస్ జగన్‌పైన, నీటి పారుదల శాఖ మంత్రి అనిల్‌కుమార్ యాదవ్‌పైన వ్యక్తిగత దూషణలు చేసిన టీడీపీ పెయిడ్ ఆర్టిస్ట్‌లు సోమశేఖర్‌చౌదరితోపాటు మరికొందరిని ఇప్పటికే అరెస్టు చేసిన పోలీసులు గురువారం తెలంగాణ రాష్ట్రానికి చెందిన మరోవ్యక్తిని అరెస్టు చేశారు. సీఎం వైఎస్ జగన్, మంత్రి అనిల్‌కుమార్, వైఎస్సార్సీపీ నేతలపై ఫేస్బుక్లో అభ్యంతరకరమైన, అసభ్యకరమైన, అశ్లీలమైన పోస్టింగ్‌లు పెట్టిన పి.నవీన్‌కుమార్ గౌడ్‌ను గురువారం అరెస్టు చేసినట్టు డీజీపీ కార్యాలయం నుంచి ప్రకటన విడుదల చేసింది. తెలంగాణ రాష్ట్రంలోని మెదక్ జిల్లా కల్లకల్ గ్రామానికి చెందిన నవీన్ కుమార్ భార్య 2013లో అనుమానాస్పదస్థితిలో మృతి చెందడంతో అతనిపై గతంలో వనపర్తి రూరల్ పోలీస్ స్టేషన్లో కేసు ఉంది. కాగా ఇటీవల సీఎం, మంత్రులు, వైఎస్సార్సీపీ నాయకులపై అనుచిత వ్యాఖ్యలతో పోస్టింగ్‌లు పెట్టడంతో ఏపీ పోలీసులు ఐటీ యాక్ట్–2000 సెక్షన్ 67(లైంగిక అసభ్యకరమైన ప్రవర్తనను ఎలక్ట్రానిక్ రూపంలో ప్రచురణ, ప్రసారం చేయడం), ఐపీసీ సెక్షన్ 153ఎ(మతం, జాతి, పుట్టిన ప్రదేశం, నివాసం, భాష, మొదలైన వాటి మధ్య శత్రుత్వం పెంచే చర్యలు), 505(2)(దుష్ట సంకల్పంతో ప్రకటనలు, పుకార్లు, భయంకర వార్తలను ప్రచారం చేయడం) కింద కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. అభ్యంతరకర చర్యలు సరికాదు.. ఇతరులను విమర్శించే హక్కు ఉంది కదా అని సోషల్ మీడియాలో అభ్యంతరకర చర్యలకు పాల్పడటం సరికాదని డీజీపీ గౌతమ్ సవాంగ్ గురువారం ఒక ప్రకటనలో హెచ్చరించారు. సోషల్ మీడియా ద్వారా అభ్యంతరకరమైన, అసభ్యకరమైన, అశ్లీలమైన పోస్టింగ్‌లతో ఇతరుల మనోభావాలు, గౌరవమర్యాదలకు భంగం కలిగించే విధంగా చేస్తే చట్ట ప్రకారం కఠిన చర్యలు తప్పవన్నారు. సోషల్ మీడియా పోస్టింగ్‌లు పెట్టే సమయంలో భావోద్వేగాలను అదుపులో పెట్టుకోవాలన్నారు. - డీజీపీ సవాంగ్ -
క్రిమినల్స్‌ను ఏరిపారేద్దాం..!
సాక్షి, చిత్తూరు : ‘చిత్తూరు అనేది ఇంటర్ స్టేట్ బోర్డర్. తమిళనాడులోని వేలూరుకు దగ్గరగా ఉన్న ప్రాంతం. మన దగ్గర 11 సరిహద్దు పోలీస్ స్టేషన్లు ఉంటే.. వేలూరు పరిధిలో 8 స్టేషన్లు ఉన్నాయి. మనందరిదీ ఒక్కటే కాన్సెప్ట్. క్రిమినల్స్‌పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. మా వద్ద నమోదైన కేసుల్లో మోస్ట్ వాటెండ్ క్రిమినల్స్ తమిళనాడులో ఉన్నారు. వాళ్లను మాకు అప్పగిస్తే పెండింగ్ కేసులు క్లోజ్ అవుతాయి. అలాగే మా వద్ద ఎవరైనా ఉంటే మేమూ సహకరిస్తాం. అప్పుడే క్రిమినల్స్‌ను ఏరిపారేయడానికి వీలవుతుంది..’ అని చిత్తూరు ఎస్పీ వెంకట అప్పలనాయుడు పేర్కొన్నారు. చిత్తూరు, తమిళనాడు అంతరాష్ట్ర సరిహద్దు నేర సమీక్షా సమావేశం బుధవారం చిత్తూరులోని పోలీసు అతిథిగృహంలో నిర్వహించారు. ఈ సమావేశానికి వేలూరు ఎస్పీ ప్రవేష్‌కుమార్, చిత్తూరు ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ నాగలక్ష్మి, తమిళనాడుకు చెందిన పలువురు డీఎస్పీలు పాల్గొన్నారు. ఎస్పీ అప్పలనాయుడు మాట్లాడుతూ జిల్లాలో నమోదైన ఎర్రచందనం స్మగ్లింగ్ కేసుల్లో న్యాయస్థానం జారీ చేసిన అరెస్టు వారెంట్లు పెండింగ్‌లో ఉన్నాయన్నారు. వారిని తమకు అప్పగించడంలో తమిళనాడు పోలీసులు సహకరించాలన్నారు. సరిహద్దు ప్రాంతాల్లో బియ్యం అక్రమ రవాణా, ఇతర స్మగ్లింగ్‌ను అరికట్టడానికి రెండు జిల్లాల పోలీసులు సమన్వయంగా పనిచేయాల్సిన అవసరం ఉందన్నారు. అలాగే సారాపై ఉక్కుపాదం మోపాలని.. దీంతో చాలా కుటుంబాలు రోడ్డున పడుతున్నాయన్నారు. పేరుమోసిన క్రిమినల్స్‌పై నిత్యం నిఘా ఉంచడం వల్ల నేరాలు జరగకుండా ముందుగానే నియంత్రించవచ్చన్నారు. వేలూరు ఎస్పీ ప్రవేష్‌కుమార్ మాట్లాడుతూ ఈనెల 5వ తేదీ వేలూరు ఎంపీ స్థానానికి ఎన్నిక జరగనున్న నేపథ్యంలో చిత్తూరు పోలీసుల సాకారం కావాలన్నారు. శాంతి భద్రతలకు విఘాతం లేకుండా చూడటంతో పాటు సరిహద్దు ప్రాంతాల్లో నిఘా పెంచడం, అక్రమ మద్యం, సారాను నియంత్రించడానికి సమన్వయంతో పనిచేయాలన్నారు. ఈ సమావేశంలో చిత్తూరు ఏఎస్పీ కృష్ణార్జునరావు, జిల్లాకు చెందిన డీఎస్పీలు ఈశ్వర్‌రెడ్డి, అరీఫుల్లా, గిరిధర్, వేలూరు జిల్లా డీఎస్పీలు పళనిసెల్వం, రాజేంద్రన్, శరవనన్, మురళి, ప్రశాంత్, తేరస్ పాల్గొన్నారు. -
మార్గదర్శి ఫైనాన్షియర్స్కు సుప్రీంలో ఎదురుదెబ్బ
-
మార్గదర్శి చిట్‌ఫండ్స్‌కు చుక్కెదురు
-
మార్గదర్శి ఫైనాన్షియర్స్కు సుప్రీంలో చుక్కెదురు
సాక్షి, న్యూఢిల్లీ : సుప్రీం కోర్టులో మార్గదర్శి ఫైనాన్షియర్స్కు చుక్కెదురైంది. మార్గదర్శిపై క్రిమినల్ ప్రొసీడింగ్స్‌పై గతంలో విధించిన స్టేను పొడిగించాలని మార్గదర్శి ఫైనాన్షియర్స్ దాఖలు చేసిన పిటిషన్‌ను శుక్రవారం సర్వోన్నత న్యాయస్ధానం కొట్టివేసింది. సంస్ధ హైకోర్టును ఆశ్రయించేందుకు సుప్రీం కోర్టు అనుమతించింది. నిబంధనలకు విరుద్ధంగా భారీ ఎత్తున డిపాజిట్లు సేకరించారని మార్గదర్శిపై అభియోగాలు నమోదైన సంగతి తెలిసిందే. మార్గదర్శి ఫైనాన్షియర్స్ ఆర్బీఐ నిబంధనలను ఉల్లంఘిస్తూ రూ 2300 కోట్లు డిపాజిట్లు సేకరించిందన్న ఆరోపణలపై చర్యలు తీసుకునేందుకు ఉమ్మడి ఏపీ ప్రభుత్వం 2006 డిసెంబర్ 19న జీవో నంబరు 800, జీవో నంబరు 801 జారీ చేసింది. ఈ జీవోలకు అనుగుణంగా విచారణ అనంతరం అధీకృత అధికారి కృష్ణంరాజు మార్గదర్శి ఫైనాన్షియర్స్‌పై న్యాయపరమైన చర్యలకు సిద్ధమయ్యారు. 2008 జనవరి 23న ఫస్ట్ అడిషనల్ చీఫ్ మెట్రపాలిటన్ మెజి స్ట్రేట్ కోర్టులో క్రిమినల్ కంప్లయింట్(సీసీ) నంబరు 540 దాఖలు చేశారు. ఉత్తర్వులను పక్కన పెట్టాలని, ప్రొసీడిం గ్స్‌ను పూర్తిగా కొట్టివేయాలని 2011లో మార్గదర్శి హైకోర్టును ఆశ్రయిం చింది. 2011 జూలై 20న మరో క్రిమినల్ పిటిషన్లో హై కోర్టు ఏకసభ్య ధర్మాసనం మధ్యంతర స్టే ఇచ్చింది. ఇటీవల ఏషియన్ రీ సర్ఫేసింగ్ ఆఫ్ రోడ్ ఏజెన్సీ ప్రయివేటు లిమిటెడ్ వర్సెస్ సీబీఐ కేసులో 2018 మార్చి 28న సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం సివిల్, క్రిమినల్ కేసుల స్టే ఉత్తర్వులు ఆ రోజు నుంచి ఆరు నెలల తరువాత రద్దవుతాయని పేర్కొంది. దీని ప్రకారం మార్గదర్శి కేసులోనూ స్టే ఉత్తర్వుకు కాలం చెల్లింది. -
రికార్డుల్లోకి నేర ‘చరిత్ర’
సాక్షి, అమరావతి: నేరం జరిగిన తీరును బట్టే ఎవరు చేశారో ఓ అంచనా వేయొచ్చు.. చిన్నపాటి క్లూ దొరికితే చాలు నేరస్తుడిని ఇట్టే పట్టేయవచ్చు.. పట్టుకున్న క్రిమినల్‌కు కచ్చితంగా శిక్ష పడేలా కీలక ఆధారాలు సేకరించవచ్చు.. ఆశ్చర్యంగా ఉందా? ఏపీ పోలీసులు ఇప్పుడు ఇదే తరహా కొత్త వ్యూహానికి పదును పెడుతున్నారు. మారుతున్న కాలంతో పాటు నేరస్తులు పోటీ పడుతున్నా.. వారికి చెక్ పెట్టడంలో పోలీసులు మాత్రం వెనుకబడుతున్న లోపాన్ని గుర్తించారు. ఈ నేపథ్యంలోనే ఇటీవల నేర పరిశోధన, దర్యాప్తునకు దోహదం చేసే రాష్ట్రస్థాయి అధికారుల కీలక సమావేశం నిర్వహించారు. నేర ‘చరిత్ర’ను సృష్టించే ఆధునిక పద్ధతికి శ్రీకారం చుట్టాలని నిర్ణయించారు. డీజీపీ చైర్మన్‌గా ఉండే రాష్ట్రస్థాయి బయోమెట్రిక్ క్రిమినల్ డేటా వ్యవస్థ(ఏపీ స్టేట్ లెవెల్ బయోమెట్రిక్ క్రిమినల్ డేటా ఇండెక్సింగ్ సిస్టమ్)కు రూపకల్పన చేస్తున్నారు. ఇందుకోసం నేర పరిశోధనలలో కీలకపాత్ర పోషించే పలు శాఖలను ఒకే గొడుకు కిందకు తెచ్చి ‘సమగ్ర ఫోరెన్సిక్ ఆధార సంస్థ’గా పనిచేయిస్తారు. దీనిలో భాగంగా తొలిదశలో పది వేల మంది నేరస్తుల పూర్తి సమాచారాన్ని సేకరిస్తారు. మలి విడతలో 50 వేల మంది నేరస్తుల చరిత్రను నిక్షిప్తం చేయనున్నారు. ఏయే వివరాలు సేకరిస్తారు? రాష్ట్రంలో పలు కేసుల్లో శిక్ష పడినవారు, పలు కేసులు విచారణలో ఉన్నవాళ్లు, అరెస్టులు అయినవాళ్లు, బెయిల్‌పై ఉన్నవాళ్లు, అనుమానితుల పూర్తి సమాచారాన్ని బయోమెట్రిక్ క్రిమినల్ డేటాలో పొందుపరుస్తారు. ప్రధానంగా వాళ్ల వేలిముద్రలు, హస్తముద్రలు, పాదముద్రలు, సంతకాలు, చేతి వ్రాత, స్వర నమూనాలు, నడక, ఆలోచన ధోరణి, బాడీ లాంగ్వేజ్, ఫోన్ మాట్లాడే తీరు, తల వెంట్రుకలు, శరీరంపై మచ్చలు, డీఎన్ఏ తదితర అన్ని నమూనాలతోపాటు ఫొటోలు, వీడియో షాట్లు రికార్డు చేస్తారు. వారు పుట్టిన ప్రాంతం, ఆధార్, పాన్‌కార్డు, డ్రైవింగ్ లైసెన్సు, మొబైల్ నంబర్, ల్యాండ్ ఫోను నంబర్, నివాసం ఎక్కడ, కుటుంబ సభ్యుల వివరాలు, వారితో కలిసి ఉండే వారి వివరాలను వాటితో జతచేస్తారు. క్రిమినల్స్ గత నేర చరిత్ర, ప్రస్తుత స్థితిగతులు, శిక్షలు, వీడిపోయిన కేసులు, బెయిల్ ఇచ్చిన వారు, ఏఏ కేసుల్లో సాక్షిగా ఉన్నారు, డిఫెన్సు లాయర్ ఎవరు అనే వివరాలతోపాటు పోలీస్ రికార్డుల్లోని వివరాలను కూడా ఆన్లైన్ బయోగ్రఫిక్లో చేరుస్తారు. వీటిని కేసుల్లో పురోగతి, దర్యాప్తు, విచారణకు దోహదం చేసేలా ఉపయోగించుకోనున్నారు. వైఫల్యాల నుంచి పాఠాలు వాస్తవానికి ఏపీలో ఫోరెన్సిక్ విభాగంలో పోలీసులకు కావాల్సిన సాక్ష్యాలను బలపరిచే సరైన వ్యవస్థ లేదు. నేరస్తులను పట్టుకోవడంలోను, తగిన ఆధారాలు సేకరించడంలోను, వారికి శిక్షలు పడేలా చేయడంలోను ఘోర వైఫల్యం కన్పిస్తోంది. ఫలితంగా నేరస్తులు తప్పించుకోవడం, ఒక్కోసారి నేరం చేయనివారు కూడా బాధితులుగా మారడం జరుగుతోంది. ఇలాంటి లోపాలను ఇప్పటికే అధిగమించిన అమెరికా లాంటి దేశాలు ఫోరెన్సిక్ వ్యవస్థను బలోపేతం చేసుకుని నేరస్తులకు చెక్ పెట్టగలుగుతున్నాయి. ఇటీవల అట్లాంటాలో క్రైమ్, ఫోరెన్సిక్ ల్యాబ్‌లపై సదస్సుకు ఏపీ పోలీసు ప్రతినిధులు హాజరయ్యారు. అభివృద్ధి చెందిన దేశాలతో పోల్చితే నేరాలు చేసిన వాళ్లను పట్టుకోవడం, శిక్షలు పడేలా చేయడంలో మనం ఎక్కడ విఫలమవుతున్నామనో తెలుసుకోగలిగారు. దేశంలోను, రాష్ట్రంలోనూ ఫోరెన్సిక్ మెడిసిన్, ఫింగర్ ప్రింట్, ఎక్సైజ్, నార్కోటిక్స్, డ్రగ్ మొదలైన వాటి ద్వారా ఎన్నో సంచలన కేసుల్లో నేరస్తుల ఆటకట్టించవచ్చని గుర్తించారు. ఈ నేపథ్యంలోనే ఇటీవల డీజీపీ అధ్యక్షతన కీలక అధికారుల సమావేశంలో ‘భిన్న విభాగాల సమూహం(మల్టీ డిపార్టుమెంటల్ వర్కింగ్ గ్రూపు)’తో ఇంటిగ్రేటెడ్ ఫోరెన్సిక్ ఎవిడెన్స్ మేనేజ్మెంట్ సిస్టమ్(సమగ్ర ఫోరెన్సిక్ సాక్ష్యాధార వ్యవస్థ)కు రూపకల్పన చేయాలని నిర్ణయించారు. -
ఇటాలియన్ మెరైన్స్పై న్యాయవిచారణ నిలిపివేత
న్యూఢిల్లీ: ఇటాలియన్ మెరైన్స్ ఇద్దరు భారత మత్స్యకారులను కాల్చిచంపిన కేసు మరో మలుపు తిరిగింది. నిందితులకు సంబంధించిన నేర విచారణ ప్రక్రయలన్నింటినీ భారత అత్యున్నత న్యాయస్థానం నిలిపివేసింది. ఇటాలియన్ మెరైన్స్ను శిక్షించే హక్కు భారత్‌కు లేదని, కేసుకు సంబంధించిన అన్ని వివరాలను సెప్టెంబర్ 24లోగా తనకు సమర్పించాలని యూనైటెడ్ నేషన్స్ ట్రిబ్యునల్ కోర్టు సోమవారం తీర్పు ఇచ్చిన నేపథ్యంలో సుప్రీంకోర్టు ఈ నిర్ణయం తీసుకుంది. కాగా, ఈ నిలిపివేత జనవరి 13 వరేకేనని కోర్టు పేర్కొంది. అసలేం జరిగింది? 2012 ఫిబ్రవరిలో ఇటలీకి చెందిన ఓ ఆయిల్ ట్యాంకర్ షిప్.. సింగపూర్ నుంచి ఈజిప్ట్ బయలుదేరింది. కేరళ తీరంలో తమ నౌకకు సమీపంగా వచ్చిన ఇద్దరు భారతీయ జాలర్లను ఇటలీ నావికులు విచక్షణా రహితంగా కాల్చిచంపారు. ఆ సమయంలో జాలర్ల వద్ద ఎలాంటి ఆయుధాలు కూడా లేవు. విషయం తెలుసుకున్న కేరళ పోలీసులు.. ఇటాలియన్ మెరైన్స్ పై ఐపిసీ 302 కింద కేసు నమోదుచేశారు. భారత ప్రభుత్వం కూడా వారిని లీగల్‌గా ప్రాసిక్యూట్ చెయ్యాలని నిర్ణయించింది. అయితే భారత్ నిర్ణయాన్ని సవాలు చేస్తూ ఇటలీ నౌకాదళం.. అంతర్జాతీయ కోర్టును ఆశ్రయించింది. మూడేళ్ల విచారణ అనంతరం నిందితులను శిక్షించే అధికారం మన దేశానికి లేదని ఐక్యరాజ్య సమితి కోర్టు పేర్కొంది. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు న్యాయవిచారణను నిలిపివేసినట్లు తెలిసింది.