సాక్షి, న్యూఢిల్లీ : రాజకీయ పార్టీలు తమ పార్టీ తరపున ఎన్నికల్లో పోటీ చేసే నేరచరిత్ర కలిగిన అభ్యర్ధుల గురించి పూర్తిసమాచారాన్ని పార్టీ వెబ్‌సైట్‌లు, ప్రింట్ మీడియా ద్వారా బహిర్గతం చేయాలని సుప్రీంకోర్టు అన్ని రాజకీయ పార్టీలను ఆదేశించింది. అభ్యర్ధుల కేసులు, అభియోగాలు, విచారణ ఏ దశలో ఉంది అనే వివరాలను సమగ్రంగా వెల్లడించడంతో పాటు అలాంటి అభ్యర్ధులను ఎందుకు ఎంపిక చేశారో వివరణ కూడా ఇవ్వాలని పేర్కొంది. సదరు అభ్యర్థిని ఎంపిక చేసిన మూడు రోజుల్లోగా ఎన్నికల కమిషన్‌కు కూడా ఈ వివరాలను నివేదించాలని తెలిపింది.
కాగా, ఈ సమాచారాన్ని తమ అధికారులు ఇవ్వకపోవడం లేదా ఆన్‌లైన్‌లో పోస్ట్ చేయకపోయినా ఎన్నికల కమిషన్ కోర్టు ధిక్కార చర్యలను చేపట్టవచ్చని సర్వోన్నత న్యాయస్ధానం స్పష్టం చేసింది. కాగా ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేల్లో సగానికి పైగా ఎమ్మెల్యేలు నేరచరితను కలిగి ఉన్న క్రమంలో సుప్రీంకోర్టు ఈ ఆదేశాలను వెలువరించడం గమనార్హం.
Comments
Please login to add a commentAdd a comment