న్యూఢిల్లీ : తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్ట్‌కు వ్యతిరేకంగా దాఖలయిన పిటిషన్‌ను సుప్రీం కోర్టు కొట్టివేసింది. ఈ అంశంపై హైకోర్టును ఆశ్రయించాలని పిటిషనర్‌కు సూచించింది. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా రీ డిజైన్ పేరుతో తెలంగాణ ప్రభుత్వం భారీగా ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తోందని రిటైర్డ్ ఇంజనీర్ లక్ష్మీనారాయణ సుప్రీం కోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేసిన సంగతి తెలిసిందే.
‘భారీ రిజర్వాయర్లతో పర్యావరణానికి నష్టం చేకూరుతోంది. ప్రజలు పెద్ద ఎత్తున నిర్వాసితులవుతారు. అవసరానికి మించి రిజర్వాయర్లు నిర్మించారు. ప్రవేట్ బ్యాంకుల నుంచి అధిక వడ్డీలకు డబ్బులు తెస్తున్నారు. కాళేశ్వరాన్ని ఒక పర్యాటక ప్రాంతంగా మార్చుకున్నార’ని లక్ష్మీనారాయణ తన పిటిషన్‌లో పేర్కొన్నారు. ప్రాజెక్ట్‌కు ప్రత్యామ్నాయంపై స్వతంత్ర న్యాయ విచారణ కమిటీని నియమించాలని ఆయన అత్యున్నత న్యాయస్థానాన్ని కోరారు. దీనిపై విచారణ చేపట్టిన జస్టిస్ మదన్ లోకూర్ ధర్మాసనం ఈ పిటిషన్‌ను కొట్టివేస్తు సోమవారం తీర్పు వెలువరించింది.
Comments
Please login to add a commentAdd a comment