మారన్‌ బ్రదర్స్‌కు భారీ ఊరట | Maran brothers cleared of all charges in Aircel-Maxis case | Sakshi
Sakshi News home page

మారన్‌ బ్రదర్స్‌కు భారీ ఊరట

Published Thu, Feb 2 2017 5:08 PM | Last Updated on Tue, Jun 4 2019 6:47 PM

మారన్‌ బ్రదర్స్‌కు భారీ ఊరట - Sakshi

మారన్‌ బ్రదర్స్‌కు భారీ ఊరట

న్యూఢిల్లీ:  సంచలనం సృష్టించిన ఎయిర్‌ సెల్‌ మాక్సిస్‌ కేసులో 2 జీ ప్రత్యేక కోర్టు సంచలన  తీర్పును వెలువరించింది. మారన్‌ సోదరులకు ఊరట లభించింది.  గురువారం ఈ కేసును  విచారించిన కోర్టు నిందితులందరికీ ప్రత్యేక కోర్టు  విముక్తి కల్పించింది.  అవినీతి , మనీ లాండరింగ​ కేసులో మారన్‌ సోదరులపై ఉన్న అభియోగాలను కొట్టి వేసింది.  వీరిపై సీబీఐ , ఈడీ ఆరోపణలను తోసిపుచ్చిన ప్రత్యేక న్యాయమూర్తి  ఓపీ సైనీ ఈకీలక ఆదేశాలు జారీ చేశారు.  మాజీ కమ్యూనికేషన్ల శాఖ మంత్రి దయానిధి మారన్ సహా, ఆయన సోదరుడు కళానిధి మారన్‌, కళానిధి భార్య కావేరీ కళానిధి, సౌత్‌ ఆసియా  ఎఫ్‌ ఎం లిమిటెడ్‌​ ఎండీ,  షణ్ముగం ఇతర రెండు (ఎస్‌ఏఎఫ్‌ఎల్‌ , సన్ డైరెక్ట్ టివీ ప్రెవేట్ లిమిటెడ్) కంపెనీలకు  ఊరట కల్పించింది.

సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సిబిఐ), ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఇడి) దాఖలు చేసిన కేసుల నుంచి  వీరికి విముక్తి  కల్పించింది. ఎయిర్సెల్-మాక్సిస్ ఒప్పందానికి సంబంధించి రెండు వేర్వేరు విషయాలను విన్న జరిగినది.   యుపిఎ   ప్రభుత్వం మంత్రిగా  ఉన్న దయానిధి మారన్ తన  పలుకుబడితో  మలేషియా వ్యాపారవేత్త టి.ఎ. ఆనంద కృష్ణన్ కు సహాయం  చేశారని సీబీఐ ఆరోపించింది.  ఎయిర్‌ సెల్‌ లో అతిపెద్ద వాటాదారుడు శివశంకరన్‌ తో  బలవంతంగా తన వాటాలను అమ్మించారని  ఆరోపిస్తూ సీబీఐ చార్జ్‌ షీట​ దాఖలు చేసింది.

మాక్సిస్‌ అనుబంధం సంస్థ అయిన గ్లోబెల్‌ కమ్యూనికేషన్‌ సర్వీసెస్‌ రూ. 4,866 కోట్ల మేర విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను పొందేందుకు 2006లో అనుమతి లభించింది. దీనికిగాను దయానిధికి భారీ ఎత్తున ముడుపులు ముట్టినట్టు ఆరోపణలు  వెల్లువెత్తాయి. మరోవైపు స్పెషల్‌ కోర్టు ఆదేశాలపై సీబీఐ సుప్రీంకోర్టును ఆశ్రయించనున్నట్టు సమాచారం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement