సంచలనం సృష్టించిన ఎయిర్ సెల్ మాక్సిస్ కేసులో 2 జీ ప్రత్యేక కోర్టు సంచలన తీర్పును వెలువరించింది. మారన్ సోదరులకు ఊరట లభించింది. గురువారం ఈ కేసును విచారించిన కోర్టు నిందితులందరికీ ప్రత్యేక కోర్టు విముక్తి కల్పించింది. అవినీతి , మనీ లాండరింగ కేసులో మారన్ సోదరులపై ఉన్న అభియోగాలను కొట్టి వేసింది. వీరిపై సీబీఐ , ఈడీ ఆరోపణలను తోసిపుచ్చిన ప్రత్యేక న్యాయమూర్తి ఓపీ సైనీ ఈకీలక ఆదేశాలు జారీ చేశారు.